breaking news
mobile gambling
-
గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13మంది అరెస్టు
అనంతపురం(హిందూపురం): మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హిందూపురం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కుడికొండ చెక్‌పోస్టు దగ్గర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 6. లక్షల నగదు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ హిందూపురం, కర్నాటకకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వీళ్లు వాహనాల్లో సంచరిస్తూనే గ్యాబ్లింగ్ ఆడుతున్నారని డీఎస్పీ సుబ్బారావు వెల్లడించారు. -
మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పోలీసులు గత అర్థరాత్రి పలు నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోనులతోపాటు రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు కల్యాణదుర్గం పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దాడులు నిర్వహించారు.


