breaking news
Mobile court
-
జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలువురు జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతులు కల్పించడంతో పాటు వారికి వివిధ చోట్ల పోస్టింగ్‌లు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.కిరణ్‌కుమార్‌ను నంద్యాల రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమించింది. గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజేష్‌ను ఆత్మకూరు సీనియర్ సివిల్ జడ్జిగా, తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జి బి.పద్మను రాజమహేంద్రవరం రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి(ఫాస్ట్ ట్రాక్ కోర్టు)గా నియమించింది. కందూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.వాణిని బాపట్ల అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, ఏలూరు రెండో అదనపు జూనియర్ సివిల్‌జడ్జి ఎం.ప్రమీలారాణిని రాజోలు సీనియర్ సివిల్ జడ్జిగా, తూర్పుగోదావరి జిల్లా ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధుస్వామిని నరసరావుపేట అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, నరసరావుపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ.శోభారాణిని నరసరావుపేట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా, కడప మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ పెద ఖాసింను నూజివీడు సీనియర్ సివిల్ జడ్జిగా, ఒంగోలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.రాధాకృష్ణను విశాఖపట్నం ఏడో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.దుర్గావెంకటనాగసింధూరను విశాఖపట్నం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమించింది. అక్కడ పనిచేస్తున్న ఎస్.సుజాతను విశాఖపట్నం ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా, విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ సునందమ్మను విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(జువైనల్ కోర్టు)గా, అక్కడ పనిచేస్తున్న డి.సత్యవతిని విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా, విజయవాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కె.కృష్ణసత్యలతను తణుకు సీనియర్ సివిల్ జడ్జిగా, గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.వెంకటశేషమ్మను గుంటూరు రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి(ఫ్టాస్ట్ట్రాక్)గా, గుంతకల్ జూనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్యను మచిలీపట్నం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా, అక్కడ పనిచేస్తున్న ఎ.పద్మను మచిలీపట్నం ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా నియమించారు. పిఠాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.వెంకటేశ్వరరెడ్డిని విజయవాడ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వై.శ్రీలక్ష్మిని గాజువాక అదనపు సీనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా, అక్కడ పనిచేస్తున్న ఎన్.శ్రీవిద్యను గాజువాక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. శ్రీకాళహస్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్రను పుత్తూరు సీనియర్ సివిల్ జడ్జిగా, కడప స్పెషల్ మొబైల్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.ప్రదీప్‌కుమార్‌ను కడప అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, అక్కడ పనిచేస్తున్న ఎస్.హేమలతను కడప ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.దివాకర్‌ను కర్నూలు అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, అక్కడ పనిచేస్తున్న టి.కేశవను కర్నూలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. వీరంతా ఈ నెల 30వ తేదీలోపు కొత్త పోస్టుల్లో చేరాలని హైకోర్టు రిజిస్ట్రార్(విజిలెన్స్) సునీత ఉత్తర్వులు జారీ చేశారు. -
డబుల్ ధమాకా
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, ట్రేడ్ ఫీజులను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు గాను మొబైల్ కోర్టులను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసినా చర్యలు తీసుకునేందుకు వీలుంది. జీహెచ్ఎంసీ అధికారుల స్థాయిలో బాధ్యులకు జరిమానాలు విధించవచ్చు. చెల్లించని వారిని మొబైల్ కోర్టుకు తీసుకువెళితే అంతకంటే ఎక్కువ జరిమానా విధించడమే కాక చెల్లించని పక్షంలో రెండు రోజుల వరకు శిక్షకు ఆదేశించే అవకాశం ఉంది. అయితే వీటిపై జీహెచ్ఎంసీ అధికారులు ఇంతవరకు పెద్దగా దృష్టి సారించలేదు. ముఖ్యంగా ఈ అంశాలను పర్యవేక్షించే పారిశుధ్యం– ఆరోగ్యం విభాగంలోని అధికారులకు వారి దినవారీ పనులతోనే తీరిక లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌లలో తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకునేందుకు ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ పారిశుధ్య నిర్వహణ, రోడ్లపై చెత్త లేకుండా చూడటంతోపాటు బహిరంగ మూత్ర విసర్జన, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ వంటి కార్యక్రమాలను నిరోధించేందుకు మొబైల్ కోర్టుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. సాధారణ కోర్టుల్లో కేసు వేసినా చర్యలకు చాలా కాలం పడుతుండటంతో అప్పటికప్పుడు శిక్షలు వేసే మొబైల్ కోర్టులను వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో 1వ మెట్రో పాలిట¯ŒS మెజిస్ట్రేట్ (మున్సిపల్ కోర్టు) ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇటీవల ఈ మొబైల్‌కోర్టులను ప్రారంభించారు. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో ప్రతి మంగళవారం ఒక సర్కిల్లో ఈ మొబైల్‌కోర్టు నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ అధికారులు విధించిన జరిమానాలను చెల్లించని వారిని ఈ మొబైల్‌కోర్టు ఎదుట ప్రవేశపెడతారు. మొబైల్ కోర్టు ఆదేశానుసారం జరిమానాను వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో రెండు రోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని ముషీరాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్‌నారాయణ తెలిపారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి సైతం ఇది వర్తిస్తుంది. జరిమానా కట్టడమే కాకుండా తదుపరి మొబైల్‌కోర్టు నిర్వహించే నాటికి తప్పనిసరిగా ట్రేడ్‌లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లేకుంటే చర్యల తీవ్రత పెరుగుతుంది. తద్వారా ఇప్పటిదాకా ట్రేడ్‌లైసెన్సులేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నవారు లైసెన్సులు తీసుకుంటారు. తద్వారా జీహెచ్ఎంసీకి ఆదాయం వస్తుంది. మరోవైపు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాల అమలు తీరు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలోనూ మొబైల్‌కోర్టు పనిచేసినా గత 15 ఏళ్లుగా వాటిని పక్కనబెట్టారు. తిరిగి ఇప్పుడు పునరుద్ధరించడంతో ఇటు ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు.. అటు నగర పరిశుభ్రత రెండూ మెరుగుపడటమే కాక ప్రజల్లో తగిన మార్పు వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ముషీరాబాద్, సనత్‌నగర్ తదితర నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ఈ మొబైల్ కోర్టుల ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన దాదాపు 50 మంది నుంచి రూ. 25 వేల జరిమానా విధించారు.