breaking news
MLC selection of candidates
-
సీటుపై ఉత్కంఠ..
టీడీపీ అభ్యర్థిత్వం కోసం nఆశావహుల పోటీ గెలుపు గుర్రాల కోసం నేతల కసరత్తు నేడు నారా లోకేష్ పర్యటన ముఖ్యనేతలతో మంత్రాంగం తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లోగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనుంది. మున్సిపల్ మంత్రి నారాయణ పావులు కదుపుతుండటంతో అభ్యర్థుల ఎంపిక రెండు జిల్లాల రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక తేలిపోతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారుు. తిరుపతి: వచ్చే మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అభ్యర్థుల ఎంపికలో సమాలోచనలు చేస్తున్నారుు. తూర్పు రాయలసీమలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులను ఈ రెండు పార్టీ లు ఇప్పటికే ఖరారు చేశారుు. యండపల్లి శ్రీనివాసులురెడ్డి, విఠపు బాల సుబ్రహ్మణ్యంలనే మళ్లీ బరిలో నిలుపుతున్నారుు. టీడీపీ అధిష్టానం మాత్రం అభ్యర్థుల ఎంపికలో వేచిచూసే ధోరణి కనబరుస్తోంది. ఉభయ కమ్యూనిస్టులు నిలబెట్టిన అభ్యర్థుల బలాన్ని అంచనా వేసుకుని ఓట్లను చీల్చే అభ్యర్థులను నిలబెట్టాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. యూటీఎఫ్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడాలనుకుంటున్న చదలవాడ సుచరిత నిర్ణయం టీడీపీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఎస్టీయూ, యూటీఎఫ్ మినహారుుంచి మిగతా ఉపాధ్యాయ సంఘాలు సుచరితకు మద్దతు తెలుపుతున్నామని ఇటీవలనే ప్రకటించారు. దీంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరుగుతోంది. అభ్యర్థులు ఎవరో... ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజక వర్గం నుంచి టీడీపీ పక్షాన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, దేశారుుశెట్టి హనుమంతరావు పోటీ పడుతున్నారు. పట్టాభిరామిరెడ్డి అభ్యర్థిత్వా న్ని మంత్రి నారాయణ బలపరుస్తున్నా రు. నారాయణ విద్యాసంస్థల్లో పట్టాభిరామిరెడ్డి కీలక ఉద్యోగి. అత్యంత సన్నిహితుడు కూడా. రెండో అభ్యర్థి దేశారుుశెట్టి హనుమంతరావు వృత్తి రీత్యా న్యాయవాది. 2009, 2011 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు ఎన్నికల్లో నిలబడిన వ్యక్తిగా భావించి హనుమంతరావుకు టికెట్ కేటారుుంచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డారుు. పార్టీ నేతల అంచనాలను తలకిందులు చేస్తూ పట్టాభిరామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. బుధవారం సాయంత్రం లాంఛనంగా ప్రకటించింది. దేశారుుశెట్టి శిబిరంలో అగ్గి రాజుకుంది. ఆయన్ను బలపరిచే నేతల్లో అసంతప్తి పెల్లుబుకింది. కార్పొరేట్ డబ్బులకు అమ్ముడు పోరుు టికెట్ కేటారుుంపులో పార్టీ తొందరపాటు నిర్ణయం తీసుకుందనే వాదనలు రెండు జిల్లాల్లోనూ వినిపిస్తున్నారుు. ఇక్కడి నుంచి ఎవరో... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున చిత్తూరు జిల్లాలో వాసుదేవనాయుడు, ఎన్బీ సుధాకర్‌రెడ్డి, సాకం నాగరాజు ఆసక్తి చూపుతున్నారు. చదలవాడ విద్యా సంస్థల అధినేత చదలవాడ సుచరిత తొలుత టీడీపీ తరఫున టికెట్ ఆశించి, ఆపైన పార్టీ అధిష్టానం సుముఖంగా లేదని తెలిసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సన్నద్ధమయ్యారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటారుుస్తే, చిత్తూరు జిల్లా లో మరో సామాజిక వర్గానికి ఇవ్వాలన్నది టీడీపీ నిర్ణయంగా ఉన్నప్పటికీ జయాపజయాలను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని పార్టీ ముఖ్యులు అధిష్టానానికి చెబుతున్నారు. ఎమ్మెల్సీ బరిలో నిలబడేందుకు చదలవాడ సుచరిత ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పలు ఉపాధ్యాయ సంఘాలు ఈమెకు మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారుు. యూటీఎఫ్ విధానాలకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని సుచరిత ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నారుు. వాసుదేవనాయుడు లేదా నాగరాజు అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేస్తే అటు సుచరితతో పాటు, ఇటు ఎన్బీ సుధాకర్‌రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నారుు. -
తేలని పితలాటకం
పట్టువీడని మంత్రులు బీసీ అయితే కాశీ విశ్వనాథం!? ఎస్టీ అయితే ఎం.వి.ఎస్.{పసాద్లకు ఛాన్స్!? నిర్ణయం నేటికి వాయిదాటీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిఎంపిక వ్యవహారం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పితలాటకం మరింత జఠిలంగా తయారైంది. జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పప్పల చలపతిరావు పేరును ఇప్పటికే ఖరారు చేశారు. కాగా రెండో ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపిక మాత్రం టీడీపీలో వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా మారింది. సామాజికవర్గ సమీకరణలతోపాటు వర్గ రాజకీయాల పీటముడి బిగుసుకుంది. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన సమావేశం తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. మంత్రులు ఇద్దరు తమ మాటే నెగ్గాలని పంతం పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో శుక్రవారం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో మంత్రులు గంటా, అయ్యన్నలతోపాటు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న తమకు అవకాశం కల్పించాలని విడివిడిగా కోరారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రామానాయుడు, పీలా శ్రీనివాస్, బొడ్డేటి కాశీవిశ్వనాథం, అనకాపల్లికిచెందిన డాక్టర్ సరస్వతి తదితరులు తమకు అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఓసీ వర్గానికి చెందిన పప్పల చలపతిరావుకు కేటాయించినందున రెండో స్థానాన్ని బీసీకిగానీ ఎస్టీకిగానీ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దాంతో కన్నబాబు రాజుకు అవకాశాలు మూసుకుపోయాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినందున ఎమ్మెల్సీగా అవకాశమివ్వలేనని రామానాయుడుకు సీఎం చెప్పేశారు. దాంతో అయ్నన్నపాత్రుడు బీసీ వర్గం నుంచి పీలా శ్రీనివాస్ పేరును ప్రతిపాదించారు. కాగా గంటా శ్రీనివాసరావు మాత్రం బీసీ వర్గానికే చెందిన కాశీ విశ్వనాథంకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. ఈమేరకు ఇద్దరు మంత్రులు కూడా సీఎంతో విడిగా మాట్లాడుతూ తమ వాదనను బలంగా వినిపించారు. దాంతో సీఎం ఏమీ తేల్చకుండా శుక్రవారం మరోసారి చర్చించిన అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేద్దామని చెప్పి అందర్నీ పంపించి వేశారు. ఎస్టీ అయితే ఎం.వి.ఎస్. ప్రసాద్!? తాజా పరిస్థితుల నేపథ్యంలో రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. బీసీకే ఇవ్వాలని భావిస్తే కాశీ విశ్వనాథంకు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి పప్పల చలపతిరావు మంత్రి అయ్యన్నకు సన్నిహితుడు. మరోవైపు అయ్యన్న ప్రతిపాదిస్తున్న పీలా శ్రీనివాస్ సోదరుడు గోవింద సత్యన్నారాయణ అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి రెండో అభ్యర్థిగా మంత్రి గంటాతోపాటు మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్న కాశీ విశ్వనాథంకు అవకాశాలు మెరుగయ్యాయి. కానీ చంద్రబాబు మాత్రం ఎస్టీ నేతను ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం మాజీ మంత్రి మణికుమారి, మాజీ ఎమ్మెల్యే ఎం.వి.సత్యన్నారాయణ కుమారుడు ఎం.వి.ప్రసాద్ పేర్లను పరిశీలిస్తున్నారు. మణికుమారి కంటే యువకుడైన ఎం.వి.ప్రసాద్ వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీకి ఇవ్వాలని నిర్ణయిస్తే కాశీ విశ్వనాథంను, ఎస్టీకి ఇవ్వాలని భావిస్తే ఎం.వి.ప్రసాద్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. అనూహ్య మార్పులు జరిగితే తప్పా వీరిద్దరిలో ఒకరికి అవకాశం లభించొచ్చని టీడీపీవర్గాలు భావిస్తున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో శుక్రవారం మరోసారి సమావేశమై చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు.