breaking news
MLC ranga reddy
-
అటవీ అధికారిపై దాడి..
శ్రీశైలం ప్రాజెక్ట్: మద్యం మత్తులో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు రెచ్చిపోయారు. అటవీశాఖ శ్రీశైలం సెక్షన్ ఆఫీసర్ జ్యోతిస్వరూప్పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం పరిధిలోని సున్నిపెంటలో చోటుచేసు కుంది. మంగళవారం రాత్రి సున్నిపెంటలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ఆరుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ శ్రీశైలానికి వచ్చే, పోయే వారికి ఆటంకం కల్గించారు. అక్కడ విధుల్లో ఉన్న జ్యోతిస్వరూప్ గమనించి.. ఇది టైగర్‌జోన్ అని, బహిరంగం గా మద్యపానం చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవా లని వారికి సూచించారు. దీంతో వారు రెచ్చిపోయా రు. అధికారిపై దుర్భాషలాడుతూ చెంపలపై కొట్టా రు. వారిలో ఓ వ్యక్తి.. ‘నేనెవరో తెలుసా? ఎమ్మెల్సీ రంగారెడ్డి కొడుకును. కాళ్లు పట్టుకుంటే వదిలేస్తాం నా కొడకా’ అంటూ దౌర్జన్యం చేస్తూ తీవ్రంగా కొట్టా రు. భయపడిన జ్యోతిస్వరూప్ వారి నుంచి రక్షించుకునేందుకు వాళ్ల కాళ్లను పట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా వారు సెల్ఫోన్లో రికార్డు చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న జ్యోతిస్వరూప్ దాడి విషయా న్ని పై అధికారులకు తెలియజేశారు. నిందితులు వీరే.. అటవీ అధికారిపై దాడి చేసిన వారిని గౌడ్ ఉప్పల్‌లో ఉన్న గోల్డెన్ ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ యజ మాని శ్రీనివాసగౌడ్, బాబునగర్‌కు చెందిన బయో డీజిల్ ఫ్యాక్టరీ యజమాని నాగం అభినయరెడ్డి, డ్రైవర్ దయానంద్, చింతల్‌కు చెందిన ఎంఎస్ఎంఈ లో క్లర్క్‌గా పనిచేస్తున్న మొగల్కౌతర్, చందానగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పిల్లిమడుగుల అశోక్‌కుమార్, ఫతేనగర్‌కు చెందిన సివిల్ సూపర్వైజర్ రాజుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
'కేసీఆర్.. ఓటుకు కోట్లు కేసును తేల్చాలి'
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకం అని చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏసీబీ కోర్టు ఆదేశాలతోనైనా ఓటుకు కోట్లు కేసును తేల్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేయం ఉందని అందరికీ తెలిసిందే'ని అని ఆయన అన్నారు. ఈ కేసు విషయంలో అప్పట్లో రెండు రాష్ట్రాల సీఎంలు సవాళ్లు విసురుకున్నారనీ, ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం రాజీపడ్డారని ఎమ్మెల్సీ రంగారెడ్డి విమర్శించారు.