breaking news
MLA Konda Surekha
-
అప్పుడు రాజయ్య.. ఇప్పుడు సురేఖ
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రుల పదవులకు సంబంధించి ఉమ్మడి వరంగల్ రాజకీయ చరిత్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకే ప్రాంతానికి చెందిన మంత్రులు వేర్వేరు ప్రభుత్వాల హయాంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురికావడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 2015లో నాటి సీఎం కేసీఆర్ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను తొలగించారు. తాజాగా 2026లో సీఎం రేవంత్‌రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు.రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కీలక పదవి దక్కింది. ఆ తర్వాత స్వైన్ ఫ్లూ నియంత్రణలో వైఫల్యం, శాఖలో అవినీతి ఆరోపణలపై 2015, జనవరి 25న కేసీఆర్ ఆయనను మంత్రివర్గంనుంచి తొలగించారు. అదే రోజు కడియం శ్రీహరితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించారు. సురేఖ స్థానంలో ఎవరో? దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి ఉమ్మడి వరంగల్‌కు చెందిన మంత్రి.. మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురయ్యారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ 2023, డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో చేరారు. తాజాగా కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత వివాదాల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గంనుంచి తొలగించారు. ఆమె స్థానంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 2021లో ఈటల రాజేందర్పైనా...బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా ఉన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అప్పటి సీఎం కేసీఆర్ 2021, మే 2న మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. భూఆక్రమణల ఆరోపణలు కారణంగా చూపగా.. బర్తరఫ్ అయిన కొద్ది రోజులకు (2021 జూన్ 14న) రాజేందర్ బీజేపీలో చేరి, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సా«ధించారు. పరకాల కేంద్రంగానే రెండు నిర్ణయాలు అప్పుడు రాజీనామా.. ఇప్పుడు బర్తరఫ్సాక్షి, వరంగల్ : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ రాజకీయ జీవితంలో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పరకాల వేదికగానే గతంలో వైఎస్ జగన్‌కు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖను వదులుకుంటే.. ఇప్పుడు అదే పరకాల పంచాయితీ ఏకంగా ఆమెను మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేసే వరకు వెళ్లింది. వరంగల్ రాజకీయ చరిత్రలో మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉదంతాలు ఉన్నా.. తాజాగా చోటుచేసుకున్న బర్తరఫ్ మాత్రం భిన్నమైన పరిణామంగా నిలిచిందనే ప్రచారం సాగుతోంది. చదవండి: ఎంపీటీసీ నుంచి మంత్రి.. బర్తరఫ్ వరకు -
స్పీకర్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
-
హమ్ సబ్ భాయీభాయీ
వెల్లివిరిసిన మత సామరస్యం క్రీస్మస్ కేక్‌లు కట్‌చేసి, దుస్తులు పంపిణీ చేసిన ముస్లిం సోదరులు కాశిబుగ్గ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకోని గురువారం లోతుకుంట చర్చిలో స్థానిక మాజీ కార్పొరేటర్ యాకుబ్‌పాషా ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండా సురేఖ హాజరై క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి, స్థానికులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత సామరస్యాన్ని చాటేలా క్రిస్మస్ నిర్వహించిన యాకూబ్‌పాషాను ఎమ్మెల్యే కొండా సురేఖ అభినందించారు. నిజాంపురలో చీరల పంపిణీ.. వరంగల్ 16వ డివిజన్ నిజాంపురలోని సెంటినరీ ట్రినిటి బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అబ్దుల్ ఖహార్ స్థానికులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు సాబిర్, అప్సర్, సలీమ్, గోరెబాయి, దేవదాసు, బాబురావు, వినోద్‌కుమార్, ఆశిర్వాదం, జోసఫ్, అలెగ్జండర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 15వ డివిజన్లో.. వరంగల్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని 15వ డివిజన్లోని అంబేద్కర్‌భవన్‌లో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ కార్పొరేటర్ మునవరున్నిసా క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు సాదిఖ్, టీఆర్ఎస్ నాయకులు బరుపట్ల మొగిళి, జన్ను ప్రదీప్, కందుకూరి దినేష్, రాము,వేణు, సంజీవ, దయాకర్, స్వామి, సుధీర్ రమేష్, సంఘ పాస్టర్ నరేష్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుకు హాజరైన కొండా సురేఖ, బోడకుంటి
జనగామ రూరల్: ఓ కేసు విషయమై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గురువారం జనగామ కోర్టుకు హాజరయ్యూరు. 2008లో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ, టీడీపీ తరఫున బోడకుంటి వెంకటేశ్వర్లు అభ్యర్థులుగా పోటీ చేశారు. చేర్యాలలో కొండా సురేఖ సమయానికి మించి ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపిస్తూ బోడకుంటి వెంకటేశ్వర్లు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల అధికారి కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఇరువురు జనగామ కోర్టుకు హాజరయ్యూరు. అడిషనల్ ఫస్ట్ క్లాసు మెజిస్ట్రేట్ టి.నర్సిరెడ్డి ఈనెల 16కు వాయిదా వేశారని న్యాయవాది ఆలేటి సిద్ధిరాములు తెలిపారు. కొండా సురేఖ, బొడకుంటి వెంకటేశ్వర్లును కలుసుకున్న వారిలో ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రవి, సర్పంచ్ జయప్రకాష్ నారాయణరెడ్డి, నాయకులు ఈగం శ్రీనివాస్ ఉన్నారు. -
చందూలాల్‌కు క్లియర్
గిరిజన సంక్షేమ శాఖ దక్కే అవకాశం పార్లమెంటరీ సెక్రటరీగా వినయభాస్కర్ తుది ప్రయత్నాల్లో సురేఖ వరంగల్ : రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు మరో పదవి ఖాయమైంది. ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్‌కు కేబినెట్లో చోటు ఖరారైందని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్.. ఈ నెల 11న జరిగిన గిరిజన భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖను గిరిజనుడికి అప్పగిస్తామని ప్రకటించారు. దీని ప్రకారం చందూలాల్‌కు గిరిజన సంక్షేమ శాఖ దక్కనుంది. మంత్రి పదవి విషయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు వినిపిస్తోంది. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించే విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఆధారంగా సురేఖకు మంత్రి పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆమెకు మంత్రి పదవి బదులు.. ఆమె భర్త కొండా మురళీధర్‌రావుకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వవచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండుకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సురేఖకు మంత్రి పదవి దక్కకపోతే మురళీధర్‌రావుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని గులాబీ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మంత్రి పదవి ఆశించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ సెక్రెటరీ పదవి ఖాయమైందని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. మంగళవారం జరగునున్న మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత వెలువడే ఉత్తర్వులతో జిల్లా ఎమ్మెల్యేలకు దక్కే పదవులపై పూర్తి స్పష్టత రానుంది. పార్లమెంటరీ సెక్రటరీ.. పార్లమెంటరీ సెక్రటరీకి రాష్ట్ర సహాయ మంత్రి హోదా ఉంటుంది. ముఖ్యమంత్రి ఇష్టానుసారం వీరిని నియమించుకోవచ్చు. జీతభత్యాలు, వసతులు, ఇతర రవాణా సౌకర్యాల వంటివన్నీ మంత్రులతో సమానంగానే ఉంటాయి. ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, గోవా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఉంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు వీరు సహకరిస్తారు. వీరికి కేటాయించిన శాఖలకు రాజకీయ అధిపతులుగా వ్యవహరిస్తారు. సమీక్షలు నిర్వహించి ఆదేశాలిస్తారు. ఫైల్స్‌పై సంతకాలు చేస్తారు. కార్యాలయాల కేటాయింపుతోపాటు బుగ్గ కార్లు, జీతభత్యాలు గౌరవమర్యాదలు, ఇతర వసతులు వర్తిస్తాయి. సీఎం అనుమతిస్తే కేబినెట్ సమావేశాల్లో పాల్గొంటారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా వీరితో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వీరికి శాఖల కేటాయింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటన జారీ చేస్తారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం తెలంగాణలో ఇదే మొదటిసారి. మర్రిచెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న 1978-80లో పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు ఉన్నాయి. పేరు : అజ్మీరా చందూలాల్ పుట్టిన తేదీ : 08-07-1954 విద్యార్హతలు : ఇంటర్మీడియెట్ తల్లిదండ్రులు : మీటూనాయక్, మీరాబాయి భార్య : శారద పిల్లలు : పద్మాదేవి, ధరంసింగ్, ప్రహ్లాద్, ప్రవీణ్ సామాజిక వర్గం: ఎస్టీ(లంబాడా) స్వస్థలం : సారంగపల్లి, జగ్గన్నపేట గ్రామపంచాయతీ, ములుగు మండలం. రాజకీయ నేపథ్యం.. 1981లో జగ్గంపేట సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1983లో టీడీపీలో చేరారు. 1985, 1994లో టీడీపీ అభ్యర్థిగా ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1994,1996 టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1996,1998లో వరంగల్ ఎంపీగా ఎన్నికయ్యారు.(అప్పుడు జనరల్ స్థానం) 2001లో ట్రైకార్ చైర్మన్‌గా మూడేళ్లు చేశారు. 1983, 1989, 1999 ఎన్నికల్లో ములుగు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసి ఓటమిపాలయ్యారు. 2005లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వ్యవహరిస్తున్నారు. 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ములుగు నుంచి 16,399 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


