కోర్టుకు హాజరైన కొండా సురేఖ, బోడకుంటి | Konda Surekhaattended the cour | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన కొండా సురేఖ, బోడకుంటి

Jul 10 2015 1:08 AM | Updated on Sep 3 2017 5:11 AM

కోర్టుకు హాజరైన కొండా సురేఖ, బోడకుంటి

కోర్టుకు హాజరైన కొండా సురేఖ, బోడకుంటి

ఓ కేసు విషయమై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ....

జనగామ రూరల్: ఓ కేసు విషయమై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గురువారం జనగామ కోర్టుకు హాజరయ్యూరు. 2008లో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ, టీడీపీ తరఫున బోడకుంటి వెంకటేశ్వర్లు అభ్యర్థులుగా పోటీ చేశారు. చేర్యాలలో కొండా సురేఖ సమయానికి మించి ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపిస్తూ బోడకుంటి వెంకటేశ్వర్లు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల అధికారి కేసు నమోదు చేశారు.

ఈ కేసు విషయమై ఇరువురు జనగామ కోర్టుకు హాజరయ్యూరు. అడిషనల్ ఫస్ట్ క్లాసు మెజిస్ట్రేట్ టి.నర్సిరెడ్డి ఈనెల 16కు వాయిదా వేశారని న్యాయవాది ఆలేటి సిద్ధిరాములు తెలిపారు.  కొండా సురేఖ, బొడకుంటి వెంకటేశ్వర్లును కలుసుకున్న వారిలో ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రవి, సర్పంచ్ జయప్రకాష్ నారాయణరెడ్డి, నాయకులు ఈగం శ్రీనివాస్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement