breaking news
miyami open
-
సెమీస్‌లో సానియా జంట
ఫ్లోరిడా (అమెరికా): మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి ప్రవేశించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ జంట 6-3, 6-4తో అనస్తాసియా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఏడో సీడ్ తిమీ బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లతో సానియా జంట తలపడుతుంది. -
మియామి ఓపెన్ క్వార్టర్స్‌లో సానియా జంట
ఫ్లోరిడా (అమెరికా): మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా-హింగిస్ జంట 7-6 (8/6), 6-4తో గాబ్రియేలా దబ్రోవ్‌స్కీ (కెనడా)-అలీసియా రొసోల్‌స్కా (పోలండ్) ద్వయంపై విజయం సాధించింది.