breaking news
Mittal family
-
చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజస్తాన్ రాయల్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రాంచైజీగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు ఇటీవలే చేతులు మారిన సంగతి తెలిసిందే. ఆదివారం లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే కొనుగోలు మురిపెం తీరకుండానే రాజస్తాన్ రాయల్స్ చిక్కుల్లో పడింది. తెర ముందు డీల్ ముగిసినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది. రాజస్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు దాదాపు అదే ధరకు చర్చలు జరిపిన అమెరికాకు చెందిన కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం, ఇప్పుడు ఈ ఒప్పందంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. తమ చేతుల్లోకి రావాల్సిన డీల్ చివరి నిమిషంలో చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కల్ సోమని బృందం ఇప్పటికే తమ న్యాయ, పబ్లిక్ రిలేషన్స్ బృందాలతో చర్చలు జరిపింది. ‘ఈ ఉదయం అమెరికాలోని మా లీగల్ టీమ్‌తో మాట్లాడాము. ఇవాళే దీనిపై అధికారికంగా లీగల్ నోటీసు పంపబోతున్నాము’ అని కల్ సోమని బృందం వెల్లడించింది. పరిస్థితిని బట్టి తాము ఎంత బహిరంగంగా ముందుకు వెళ్లాలనేది త్వరలోనే నిర్ణయించుకుంటామని తెలిపారు. ఈ వివాదం ముదిరితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకునే అవకాశముంది.మిట్టల్ గ్రూప్ కంటే ముందు కల్ సోమని గ్రూప్‌తో కుదరాల్సిన డీల్ ఆగిపోవడం వెనుక సకాలంలో సోమని బృందం చెల్లింపులు చేయలేకపోవడమే కారణమని తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను సోమని బృందం కొట్టిపారేసింది. తమ వెనుక రాబ్ వాల్టన్, హాంప్ ఫ్యామిలీ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఉన్నారని, నిధులు తమకు ఎప్పుడూ సమస్య కాదని వారు స్పష్టం చేశారు. మరి ఈ సమస్య ఎలా కొలిక్కి వస్తుందన్నది చూడాలి.ఐపీఎల్ 2026 సీజన్ తొలి అంచె పోటీల్లో వరుస విజయాలతో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో చతికిలపడుతోంది. ప్రస్తుతం 10 మ్యాచ్‌లాడిన రాజస్తాన్ 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మూడింట గెలిస్తే రాజస్తాన్ ప్లేఆఫ్ బెర్తు దక్కించుకుంటుంది. మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన రాజస్తాన్ తమ తర్వాతి మ్యాచ్ మే 9న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత మే 17న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 19న లక్నోతో, మే 24న ముంబైతో ఆడాల్సి ఉంది.చదవండి: బాంబు పేల్చిన కేఎల్ రాహుల్! -
అత్యంత ధనవంతుల జాబితాలోని టాప్ 10 ఎన్ఆర్ఐలు (ఫొటోలు)
-
మిట్టల్ వారింట పెళ్లి ఖర్చు రూ.507 కోట్లు
ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ కుమార్తె పెళ్లి బార్సిలోనాలో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి 60 మిలియన్ యూరోలు (రూ.507 కోట్లు) ఖర్చయినట్లు స్పానిష్ న్యూస్ పోర్టల్ ‘వానిటాటిస్’ వెల్లడించింది. ప్రమోద్ మిట్టల్ తన కుమార్తె సృష్టి మిట్టల్‌ను (26) ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గుల్రాజ్ బెహల్‌కు ఇచ్చి వివాహం చేశారు. చరిత్రలోనే అత్యంత వైభవోపేతమైన ఐదు పెళ్లిళ్లలో ఇదొకటిగా నిలిచిపోతుందని ‘వానిటాటిస్’ తెలిపింది.


