సస్పెన్స్ ఎంటర్టైనర్గా ‘మిస్ కాళికా మిస్సింగ్’
వినీత్ చంద్ర, డాలీషా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం‘మిస్ కాళికా మిస్సింగ్’. సత్య ధనేకుల దర్శకత్వంలో రామకృష్ణ, పదిమల యమున సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఎస్తేర్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ ,ఆలీ ,జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ర్మాతలు రామకృష్ణ, యమునలు మీడియాతో మాట్లాడుతూ.. ‘పూర్తి సస్పెన్స్ తో సాగే ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. మునుపెన్నడు చూడని కథనం తో ఈ మూవీ చిత్రీకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా ఈ చిత్రం డెఫినెట్ గా మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది . అక్టోబర్ నెలలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు.