breaking news
miserable
-
వెంటాడుతున్న తీవ్ర అనారోగ్యం..మారని జీవితం !
జవహర్‌నగర్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికులు, దుర్బర జీవితాలను గడుపుతున్నారు. పిన్న వయస్సులోనే పారిశుద్ధ్య కార్మికులు జబ్బు బారినపడి ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కష్టపడుతున్నా.. పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 212 ప్రకారం సౌకర్యాలు.. జవహర్‌నగర్ కార్పొరేషన్లో 130 మంది కార్మికులు, పనిచేస్తున్నారు. కాగా గ్రామపంచాయితీ ఏర్పడినప్పటి నుంచి పనిచేస్తున్న సిబ్బందికి మారుతున్న కాలాన్ని బట్టి రోజూవారి వేతనం పెరగడానికి చాలా ఏళ్లు పట్టింది. పారిశుద్ధ్య సిబ్బందికి కనీసవేతనాలు చెల్లించాలని జీవో నెం.212 ప్రకారం ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని అనేక ఏళ్లుగా కార్మిక నాయకులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 2008 డిసెంబర్ నెలలో కాంట్రాక్ట్ కార్మికులకు పాత జీవోను చట్టం చేస్తూ.. కొత్త జీవో ప్రకారం నెలవారీ జీతంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించారు. బ్యాంకుల ద్వారా జీతాలు ఇవ్వాలని, అది నేటికి అమలు కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జీవో 65 అమలు.. గత ప్రభుత్వం జీవో 14 ప్రకారం అమలు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం జీవో 65ను అమలు చేస్తోంది. జీవోనెం 60 ప్రకారం వేతనాలు పెంచి, గతంలో కార్మికులకు పెంచిన జీతాలను తగ్గించకుండా వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు.. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారి కుటుంబాల్లో రోజూ ఎవరో ఒకరూ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శ్యాసకోస వ్యాధులు, ఇన్ఫెక్షన్కు గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కార్మికుల జీవితాలకు సరైన భద్రత లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. సగానికి పైగా 25 ఏళ్ల సర్వీసు.. జవహర్‌నగర్ పట్టణంలో పనిచేస్తున్న 130 మంది కారి్మకుల్లో సగానికి పైగా 25 ఏళ్ల సర్వీసు ఉన్నవారే. అందరికీ నిర్దిష్ట పని గంటలు ఉన్నా.. వీరికి వర్తించవు. ఇంతచేసినా.. వీరికి ఇచ్చే వేతనం నామమాత్రమే. కాలానికి అనుగుణంగా కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు పట్టణ కార్పొరేషన్ ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ భద్రత కరువు .. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఐదేళ్లపాటు పనిచేసిన వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనే నిబంధన ఉంది. అయితే స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వకపోవడం వల్ల ఆ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రోజూ అడుగుతున్నప్పటికీ వారిని పట్టించుకునే వారు లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలికారి్మకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి. జీవిత బీమాను వెంటనే అమలు చేయాలి. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని అనుకున్నాం. కానీ నేటికి ప్రభుత్వం అమలు చేయడంలేదు. ప్రతీ కారి్మకుడికి రూ.26 వేల కనీసం వేతనం చెల్లించాలి. – రాములు, ఎలక్ట్రిషన్, జవహర్‌నగర్ హెల్త్‌కార్డులు ఇవ్వాలి.. నిత్యం పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ రోగాలబారిన పడుతున్నాం. కనీస వేతనం లేక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కారి్మకులకు హెల్త్‌కార్డులు ఇచ్చి, ఉచిత వైద్యం అందించాలి.- వెంకటమ్మ పారిశుద్ధ్య కార్మికురాలు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటమే.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెలబెట్టుకుని కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి. కార్పొరేషన్లో కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి పర్మనెంట్ చేయాలి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అందించాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలను ఆపేదిలేదు. – శివబాబు, రాష్ట్ర మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి -
ఆదిలాబాద్: ఉట్నూరులోని ఆదివాసీల జీవనం దయనీయం
-
దయనీయం..మేదర జీవనం
అడవికెళ్లి కంకతెచ్చి.. నిలువునా చీల్చి.. ఎండకు ఆరబెట్టి.. ఓపికతో అల్లి.. మార్కెట్‌కు తీసుకెళ్లి.. అమ్మితే వచ్చే డబ్బులతో జీవనం సాగించే మహేంద్రులకు (మేదరులకు) ఉపాధి లేకుండా పోతోంది. వాళ్లు అల్లిన తట్టలకు, బుట్టలకు ఆదరణ తగ్గిపోతుండడంతో మేదరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్లాస్టిక్ దెబ్బకు మేదరుల అల్లికలకు ఆదరణ తగ్గుతోంది. వృత్తిని నమ్ముకుని దుర్భర స్థితిలో కుటుంబాలు వెళ్లదీస్తున్న మేదరి కుటుంబాలపై ‘సాక్షి’ ప్రేత్యేక కథనం.. కౌటాల(సిర్పూర్): కుమురం భీం జిల్లాలో 304 మేదరి కుటుంబాలు ఉండగా వీటిలో 283 కుటుంబాలు వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కుటుంబమంతా కష్టపడితే కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని మేదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఖర్చులు పోను పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. అడవి నుంచి అధికారులు వెదురును తీసుకెళ్లని వ్వకపోవడంతో చేతినిండా పనిదొరకక కొన్ని నెలలుగా మేదరులు ఆర్థికంగా ఇబ్బందులు ప డుతున్నారు. చాలా మంది మేదరి కులస్తులు వృత్తికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్ర భుత్వం ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు. వెదురుతో రూపు దిద్దుకునేవి ఇవే.. మేదరులు వెదురుతో తడకలు, వెదురు బుట్టలు, గొర్ల తడకలు, చాటలు, గంపలు, పెళ్లి పందిళ్లు, మొక్కల పెంపకానికి చిన్నచిన్న బుట్టలు తయారు చేస్తారు. గంపలు, నిచ్చెనలు, పూలతొట్టీలు, విసనకర్రలు, పొయ్యి గొట్టాలు, ఆటవస్తువులు, తరాజు, బుట్టలు, ధాన్యం నిల్వ చేసే గంపలు, వస్తువులను మేదరులు తయారు చేస్తారు. దొరకని ముడిసరుకు.. గతంలో అడవులు ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కడపడితే అక్కడ కంకబొంగు లభిస్తుండేది. దీని ద్వారా మేదరుల అల్లికలకు ముడి సరుకు విరివిగా లభించేది. అడవులు అంతరిస్తుండడంతో అధికారులు కంకబొంగును అడవి నుంచి తీసుకురానివ్వడం లేదు. దీంతో మేదరులకు చేతినిండా పనిదొరకక కుటుంబం నడవని స్థితి. హరితహారంలో అధిక సంఖ్యలో వెదురు మొక్కలు నాటాలని మేదరులు కోరుతున్నారు. వెదురుతో తయారు చేసిన తట్టలు, బుట్టలు ముత్తంపేటలో తట్టలు అల్లుతున్న మేదరులు అన్నింటా ప్లాస్టిక్.. ప్రస్తుతం అన్ని వస్తువులు ప్లాస్టిక్‌లో లభిస్తుండడంతో మేదరులకు ఉపాధి కరువవుతోంది. అడవి నుంచి వెదురును తీసుకెళ్లడానికి అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వాలాని, ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందించి ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు. మేదరి కులస్తులను ఆదుకోవాలి కుమురం భీం జిల్లాలో 304 మేదరి కుంటుబాలు ఉన్నాయి. వీటిలో 283 మేదరి కుటుంబాలు మేదరి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం మేదరుల అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించి వెదురు బొంగుతో తయారు చేసిన వస్తువులను వినియోగించాలి. అడవుల్లో వెదురు మొక్కలను ఎక్కువగా నాటాలి. ప్రభుత్వం రుణాలు అందించాలి. – సుల్వ కనకయ్య, మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు కుటుంబ పోషణ భారంగా మారింది నా పేరు రాచర్ల లక్ష్మి నారాయణ. మాది కౌటాల మండలం గురుడుపేట. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. 30 ఏళ్లుగా మేదరి వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాను. అధికారులు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించి మేదరులను ప్రోత్సాహించాలి. లేకుంటే కులవృత్తి కనిపించకుండాపోతుంది. ఆర్నెళ్ల నుంచి అటవీ అధికారులు వెదురును అడవిలో నుంచి తీసుకురానివ్వడం లేదు. దీంతో పని లేక పస్తులుంటున్నాం. ఆరు నెలల నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. మా తమ్ముడు అడవి నుంచి వెదురు తెస్తే నేను ఇంటి వద్దే ఉంటూ వెదురు వస్తువులు తయారు చేస్తాను. తయారు చేసిన వెదురు వస్తువులను మా తమ్ముడు గ్రామాల్లో, వార సంతల్లో అమ్ముతాడు. మేదరి వృత్తిపైనే నేను. నా భార్య, నా కూతురు, మా తమ్ముడు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఆదరణ తగ్గిపోవడంతో, అటవీ అధికారుల ఆంక్షలతో వృత్తిని వీడాల్సి వస్తోంది. -
యువకుడు దారుణహత్య
ఇంటి ఎదుటే ఘాతుకం తండ్రే చంపాడంటూ తల్లి ఆరోపణ ఆస్తి తగాదాలే హత్యకు కారణమా..? గుంతకల్లు పట్టణంలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఇంటి ఎదుటే ఈ ఘాతుకం జరిగింది. తండ్రే చంపి ఉంటాడని తల్లి ఆరోపించింది. ఈ హత్యకు ఆస్తి తగాదాలా.. లేక ఇంకేదైనా కారణమా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకెళితే.. హోటల్ అశోక ప్యారడైజ్ సమీపాన రంగా టీవీ హౌస్ వెనుక ప్రాంతంలో మంగళవారం ఉదయం రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్ సీఐ రాజు, టూటౌన్ ఎస్ఐ వలిబాషా, ఐడీ పార్టీ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎవరో బండరాయితో తలపై మోది చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యకు గురైన యువకుడు నూర్ అహమ్మద్ (31) అని గుర్తించారు. ఇంటికి ఎదురుగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకెళ్లి పరిశీలించగా కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న నూర్‌అహమ్మద్ తల్లి ముంతాజ్‌బేగం, సోదరులు అల్తాప్, అల్కమల్ వెంటనే స్వగృహానికి చేరుకుని బోరున విలపించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తి కోసం కుటుంబ సభ్యులు నిత్యం గొడవపడుతుండేవారని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు. కన్నతండ్రే కాటికి పంపాడు! నూర్ అహమ్మద్ తండ్రి మహ్మద్‌బాషా అలియాస్ పహిల్వాన్ బాషా మ్యారేజ్ బ్యూరో. ఈయనకు ముగ్గురు సంతానం. ఆస్తి గొడవల నేపథ్యంలోనే నూర్అహమ్మద్ను తండ్రి హతమార్చి ఉండవచ్చని తల్లి ముంతాజ్‌బేగం పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. మహ్మద్బాషాకు వారసత్వంగా రెండు ఇళ్లు వచ్చాయని, ఇందులో ఒకదాన్ని అమ్ముకున్నాడని పేర్కొంది. మిగిలిన ఇల్లు కూడా ఎక్కడా అమ్ముకుంటాడోనన్న భయంతో మామ (మహ్మద్‌బాషా తండ్రి) ఇంటి పత్రాలు తనకు ఇచ్చి భద్రపరచాలని చెప్పాడని ముంతాజ్‌బేగం తెలిపింది. ఇంటి పత్రాలు ఇవ్వాలంటూ మహ్మద్‌బాషా కొన్ని నెలలుగా పిల్లలను, తనను వేధిస్తుండేవాడని వాపోయింది. వేధింపులను భరించలేక పట్టణంలోని బీఎస్ఎస్ కాలనీలో ఉన్న తన పుట్టింటికి వెళ్లానని చెప్పింది. పెద్దకుమారుడు అల్తాఫ్, రెండో కుమారుడు అల్కమల్లు వారి అత్తారింటికి వెళ్లారని తెలిపింది. చిన్నకుమారుడు నూర్ అహమ్మద్, భర్త మహ్మద్‌బాషా ఇద్దరే మూడు రోజులుగా ఇంట్లో ఉంటున్నారని వివరించింది. ఈ నేపధ్యంలోనే చిన్నకుమారుడు నూర్ అహ్మద్‌ను తన భర్త హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. పోలీసుల అదుపులో నిందితుడు? నూర్ అహమ్మద్ హత్య కేసులో నిందితుడైన తండ్రి మహ్మద్‌బాషాను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నూర్‌అహ్మద్‌ను కన్నతండ్రే హత్య చేశాడా? లేదా ఇతరులెవరైనా ఈ పని చేశారా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.