breaking news
Mirzapur 3
-
ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్, సినిమాలు ఇవే!
కోవిడ్ తర్వాత ఓవర్ ద టాప్(ఓటీటీ)ల వాడకం ఎక్కువైంది. మహమ్మారి సమయంలో థియేటర్స్ మూత పడడంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలవైపు మొగ్గుచూపారు. కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో వీక్షకుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోయింది. గతేడాది(2024) నాటికి దేశవ్యాప్తంగా ఓటీటీ వీక్షకుల సంఖ్య 55 కోట్లకు చేరిందంటేనే దీని స్పీడ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఓటీటీలలో సినిమాల కంటే వెబ్ సిరీస్‌ల హవానే ఎక్కువగా కొనసాగుతుంది. గతేడాదిలో రిలీజైన 315 ఒరిజినల్స్‌లో 214 వెబ్ సిరీస్‌లే ఉన్నాయి. అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్‌గా మీర్జాపూర్ సీజన్ 3 నిలిచింది. ఈ హిందీ వెబ్ సిరీస్‌ని 3 కోట్ల మంది వీక్షించారు. ఇక తెలుగులో సేవ్ ద టైగర్స్ సీజన్ 2ని అత్యధికంగా(50లక్షల మంది) వీక్షించారట. సినిమాల విషయానికొస్తే దో పత్తీ(హిందీ)ని 1.51 కోట్ల మంది ఓటీటీలో చూశారు. ఇంటర్నేషనల్ షోలలో.. స్వీడ్ గేమ్ సీజన్ -2ని 1.96 కోట్ల మంది భారతీయులు వీక్షించారు. కంటెంట్ పరంగా హీందీ అగ్రస్థానంలో ఉంది. ఓటీటీలో వస్తున్న మొత్తం ఒరిజినల్స్‌లో మూడింట రెండొంతులు బాలీవుడ్ నుంచే ఉందట. బెంగాలీ 2వ స్థానంలో ఉండగా.. 9 శాతం వాటాలతో తెలుగు మూడో స్థానంలో ఉంది. -
Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ
మీర్జాపూర్.. ఓటీటీల్లో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. 2018లో తొలి సీజన్‌తో మిర్జాపూర్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత 2020లో రెండో సీజన్‌తో ప్రేక్షకుల అంచనాలకు మించి హిట్ కొట్టారు. ఇప్పుడు మీర్జాపూర్ సీజన్-3 ద్వారా ఓటీటీలో తమ సత్తా చూపించారు. క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ సిరీస్‌లు యూత్ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాయి. ఈ కథ మొత్తం ప్రధానంగా కొన్ని పాత్రల చుట్టే తిరుగుతుంది. కాలీన్‌భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిత్ ( అలీ ఫజల్) బబ్లూ పండిత్ (విక్రాంత్ మాస్సే), మున్నా భాయ్ (దివ్యేందు) గోలు (శ్వేతా త్రిపాఠి), బీనా త్రిపాఠి (రసిక దుగల్) భరత్ త్యాగి (విజయ్ వర్మ) పేర్లతోనే ఎక్కువ పాపులర్ కావడం కాకుండా మీర్జాపూర్లో మెప్పించారు.మీర్జాపూర్ వెబ్‌సిరీస్.. మొదటి రెండు సీజన్లు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. భారీ క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ సిరీస్ ముఖ్యంగా యువతను విశేషంగా అలరించాయి. అందుకే ఈ సీరిస్ నుంచి మిలియన్ల కొద్ది మీమ్స్ వైరల్ అయ్యాయి. సీజన్-3 కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు ఫుల్స్టాప్ పడింది. నేడు (జులై 5) నుంచి మిర్జాపూర్-3 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు.మీర్జాపూర్ మొదటి సీజన్లో గుడ్డూ భయ్యా (అలీ ఫజల్),బబ్లూ పండిత్ (విక్రాంత్ మాస్సే) అనే ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా కోసం పనిచేయడం. ఆ సీజన్ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ భయ్యా తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. సీజన్ చివరకు మీర్జాపూర్ గద్దెపై ఎలా కూర్చుంటాడన్నది చూపించారు. ఈ క్రమంలో కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని వెళ్లిపోవడం చూపించారు. సరిగ్గా అక్కడి నుంచే సీజన్- 3 ప్రారంభం అవుతుంది.సీజన్-3 కథ ఏంటి..?సీజన్-3 మున్నా భయ్యా అంత్యక్రియలతో ప్రారంభం అవుతుంది. మున్నా సతీమణి మాధురి (ఇషా తల్వార్) ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమెను శరద్ శుక్లా కలుస్తాడు. మీర్జాపూర్‌ను తిరిగి దక్కించుకునేందుకు ఒకరికొకరం సాయంగా ఉండాలని కోరుతాడు. కానీ, కాలీన్ భయ్యాను కాపాడిన సంగతి ఆమెకు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవుతాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. గుడ్డు భయ్యా మిర్జాపూర్ సింహాసనంపై కూర్చున్నప్పటికీ పూర్వాంచల్‌లో అధికార పోరు కొనసాగుతోంది. కాలీన్ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా , గుడ్డు భయ్యా మధ్య నేరుగా ఘర్షణ జరుగుతుంది. అలా కాలీన్ భయ్యా లేకుండానే మొదటి నాలుగు ఎపిసోడ్లు పూర్తి అవుతాయి. ఈ అధికార పోరు మధ్య, SSP మరణానికి సంబంధించి పండిట్ జీ ఆరోపణలను ఎదుర్కోవడంతో, ఒక రాజకీయ ఆట సాగుతుంది.మరోవైపు ముఖ్యమంత్రి మాధురీ యాదవ్ కూడా శరద్ శుక్లాతో పాటు దద్దా త్యాగి (లిల్లిపుట్ ఫరూఖీ), అతని కుమారుడు (విజయ్ వర్మ) నుంచి మద్దతు తీసుకుంటుంది. ఇలా వీరందరూ గుడ్డు భయ్యాను బలహీనపరచేందుకు పెద్ద ఎత్తున ప్లాన్స్ వేస్తుంటారు. జైలులో ఉన్న గుడ్డు పండిట్ తండ్రి రమాకాంత్ పండిట్ జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. కొత్త శత్రుత్వాలు, స్నేహాల ఆవిర్భావంతో, కాలీన్ భయ్యా పునర్జన్మను పొందుతారు. మిర్జాపూర్ సింహాసనం కోసం కొత్త, చివరి సరైన వారసుడి కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. బీనా త్రిపాఠి బిడ్డకు అసలు తండ్రి ఎవరనే అనుమానం ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. దీనికి సంబంధించిన క్లూ సీజన్లో వెల్లడి అవుతుంది. చివరికి, కాలీన్ భయ్యాతో కోడలు మాధురి కలిసి కథకు నిజమైన ట్విస్ట్ జోడించి మొత్తం ఆటను మలుపు తిప్పుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లలో మీరు ఊహించని విధంగా చివరి 15 నిమిషాల్లో అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది. మీరు ఈ కథను ఉత్తరప్రదేశ్‌లోని ఇటీవలి రాజకీయాలకు కూడా అనుబంధించవచ్చు. "భయం లేని రాష్ట్రం" అనే పదే పదే వచ్చే థీమ్ మీకు యోగి ఆదిత్యనాథ్ పరిపాలనను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అతిక్ అహ్మద్ మరణం తర్వాత గ్యాంగ్స్టర్లలో చట్టాన్ని అమలు చేయడం పట్ల భయం కూడా చిత్రీకరించబడింది. రాజకీయ ఫిరాయింపులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నీ ఈ సీజన్‌ని ఇటీవలి ఈవెంట్లకు సంబంధించినవిగా చేస్తాయి.గుడ్డు భయ్యా, గోలు ఇద్దరూ మీర్జాపూర్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోగలిగారా..? గుడ్డు భయ్యాకు ప్రధాన శత్రువు ఎవరు..? జైలుకు ఎందుకు వెళ్తాడు..? మీర్జాపూర్ పీఠం దక్కిన సమయంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి..? మీర్జాపూర్ పీఠం కోసం ఎంతమంది పోరాటం చేస్తున్నారు..? కాలీన్ భయ్యా భార్య బీనా నిజంగానే గుడ్డు, గోలుకు అండగా నిలిచిందా..? పూర్వాంచల్ పవర్ కోసం ఎటువంటి రక్తపాతం జరిగింది..? గుడ్డు షూట్ చేశాక కాలిన్ ఎలా తిరిగొచ్చాడు..? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలనే ముఖ్యమంత్రి మాధురి (ఇషా తల్వార్) లక్ష్యం నెరవేరిందా..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు అందరినీ మెప్పిస్తుంది.సిరీస్ ఎలా ఉంది..?'మీర్జాపూర్'కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు, నాలుగేళ్లుగా ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఈ సీజన్ గత వాటితో పోలిస్తే అంతగా మెప్పించకపోవచ్చు. ముఖ్యంగా మున్నా భయ్యా లేకపోవడం, ఆపై కథలో కాలీన్ భయ్యాకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ సీజన్‌కు బిగ్ మైనస్ అని చెప్పవచ్చు. సీజన్ మొత్తం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. మూడవ ఎపిసోడ్ వరకు కథలో వేగం కనిపించదు. కథ బలహీనంగా ఉండటమే కాకుండా ప్రధాన పాత్రల నుంచి వచ్చే సీన్లు ప్రేక్షకుల అంచనాలకు దగ్గరగా కనిపిస్తాయి. కానీ, మీర్జాపూర్ అభిమానులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. గత సీజన్లను పోల్చుకుంటూ చూస్తే మాత్రం కాస్త కష్టం. మీర్జాపూర్ అంటేనే వయలెన్స్, సీరిస్‌కు అదే ప్రధాన బలం. కానీ, ఈ సీజన్లో హింసను చాలా వరకు తగ్గించారు. పొలిటికల్ డ్రామాను ఎక్కువగా చూపించారు. ఫిమేల్ పాత్రలకు భారీగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులోని ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నుంచి 50 నిమిషాల పాటు ఉంటుంది. దీంతో సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. కథలో నెక్స్ట్ ఏంటి..? అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కనిపించలేదు. ఇందులోని స్క్రీన్ ప్లే కూడా చాలా సీన్స్‌లలో ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే ఉంటాయి.ఎవరెలా చేశారంటే..?గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్ మొత్తం తన తన భుజాలపై మోశారు. కానీ, ఒక్కడిపై భారం అంతా పడటంతో షో రన్ చేయడం కష్టమైంది. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరుత్సాహపరచదు. ఇందులో ఆమె పాత్ర అందరినీ మెప్పిస్తుంది. అంజుమ్ శర్మ సైతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోశారు. ఆమె పాత్ర అండర్ రైట్‌గా అనిపిస్తుంది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. అందరి కంటే విజయ్ వర్మ ఎక్కువ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా సరే తన మార్క్ చూపించారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ ఈ సిరీస్‌ను అనుకున్నంత స్థాయిలో తెరకెక్కించారు. కానీ, అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కాస్త రెస్పాన్స్ తగ్గే అవకాశం ఉంది. 'మీర్జాపూర్ సీజన్ -3' చూడదగినది. మునుపటి సీజన్ల మాదిరి మెప్పంచకపోవచ్చు కానీ, మీరు ఈ సిరీస్‌కి అభిమాని అయితే, మీరు దీన్ని మిస్ చేయకండి. -
థియేటర్లలో కల్కి దూకుడు.. ఓటీటీకి ఒక్క రోజే ఎన్ని సినిమాలంటే!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇప్పటికే థియేటర్లలో కల్కి మానియా నడుస్తోంది. వారం రోజులుగా కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో రెండో వారంలోనూ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ వారంలో చిత్రాలు రిలీజయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఎప్పటిలాగే ఈ వీకెండ్లో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతంలో అత్యంత ఆదరణ పొందిన మీర్జాపూర్-3 వెబ్ సిరీస్‌లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ సిరీస్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు సీజన్లుగా యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్ మీర్జాపూర్: సీజన్3 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - జూలై 05 గోయో (స్పానిష్ మూవీ) - జూలై 05అమెజాన్ ప్రైమ్ మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 05 జియో సినిమా హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) - జూలై 05ఆహా హరా (తమిళ సినిమా) - జూలై 05బుక్ మై షో ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జూలై 05 విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 05సోనీ లివ్ మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) - జూలై 05మనోరమ మ్యాక్స్ మందాకిని (మలయాళ సినిమా) - జూలై 05 -
ఓటీటీలోకి మీర్జాపూర్ 3... సీజన్ 1, 2లో ఏం జరిగింది?
‘మీర్జాపూర్’.. ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరిస్ ఇది. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకుల అంతా ఈ క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్‌ని ఆదరించారు. ముఖ్యంగా యూత్‌కి ఈ సిరీస్ బాగా నచ్చింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు రాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. అలీ ఫజల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటించిన మీర్జాపూర్ సీజన్ 3 జులై 5 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో అసలు సీజన్ 1, 2లలో చెప్పారు? సీజన్ 3లో ఏం చూపించబోతున్నారు? తెలుసుకుందాం.గన్స్, డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. మీర్జాపూర్ మొత్తం కాలీన్ భాయ్(పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉంటుంది. అక్కడి మాఫియా సామ్రాజ్యానికి అతనే మహా రాజు. కాలీన్ భాయ్ కొడుకు మున్నా భాయ్(దివ్యేంద్) ఓ పెళ్లి కొడుకును గన్‌తో కాల్చి చంపేస్తాడు. ఈ కేసును లాయర్ రమాకాంత్ పండిత్(రాజేశ్ తైలాంగ్) వాధిస్తాడు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు పేరు గుడ్డు పండిత్(అలీ ఫజల్), చిన్న కొడుకు బబ్లూ పండిత్(విక్రాంత్ మస్సే), కూతురు డింపీ(హర్షిత). కొడుకును కాపాడుకునేందుకు కాలీన్ భాయ్ భారీ ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో తన వ్యాపార పనులను గుడ్డు, బబ్లులకు అప్పగిస్తాడు. దీంతో మున్నా..తీవ్ర కోపంతో రగిపోతుంటాడు. గుడ్డు ప్రేయసి స్వీటీపై కన్నేస్తాడు. ఆమె దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన గుడ్డు, స్వీటీ, బబ్లూ, డింపీలపై మున్నా తన గ్యాంగ్‌తో దాడి చేస్తాడు. ఈ దాడిలో గర్భిణి అయిన స్వీటీతో పాటు బబ్లు కూడా చనిపోతాడు. గోలు సహాయంతో గుడ్డు తప్పించుకుంటాడు. ఇంతటితో సీజన్ 1 ముగుస్తుంది.మున్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరంభమయ్యే సన్నివేశాలతో సీజన్-2 మొదలవుతుంది. మరోవైపు డింపీ, గోలు కలిసి ఓ డాక్టర్ని కిడ్నాప్ చేసి గుడ్డుకు చికిత్స చేయిస్తారు. మున్నాను ఎలాగైన చంపేయాలనే పగతో రగిలిపోతుంటారు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్‌కు అత్యంత నమ్మకస్తుడైన మక్బూల్.. ఒకప్పుడు తన కుటుంబ సభ్యుడి చావుకు కారణం అయ్యాడనే కోపంతో కాలీన్ తండ్రిని చంపేందుకు ప్లాన్ వేస్తాడు. కాలీన్ భార్య బీనా కూడా అతనితో చేతులు కలిపి మామను చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు మీర్జాపూర్ డాన్ సింహాసనంపై ఆశపడి తండ్రినే చంపేందుకు ప్లాన్ వేస్తాడు మున్నా. అందుకోసం శరత్ శుక్లాతో చేతులు కలుపుతాడు. అయితే గుడ్డు, గోలులు మాత్రం పక్కా ప్లాన్‌తో మున్నాపై దాడికి దిగుతారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాలీన్ భాయ్‌ని శరత్ కాపాడగా.. మున్నాను మాత్రం ప్రాణాలు కోల్పోతాడు. అనంతరం గుడ్డు మీర్జాపూర్ సింహాసనాన్ని అధిరోహిస్తాడు. ఇంతటితో సీజన్ 2కి ఎండ్ కార్డు పడుతుంది.మీర్జాపూర్ 3లో ఏం చూపించబోతున్నారు?మీర్జాఫూర్ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న గుడ్డు.. పూర్వాంచల్‌లో తన ఆదిపత్యాన్ని కొనసాగించాలనుకుంటాడు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్ గుర్తులేవి లేకుండా చేస్తాడు. మరోవైపు భర్త మున్నాభాయ్ మరణంతో అతని భార్య, యూపీ సీఎం కూతురు మాధురి రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. కాలీన్ భాయ్‌పై సింపథీ క్రియేట్ చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో కాలీన్ భాయ్ తిరిగి వచ్చినట్లు ట్రైలర్లో చూపించారు. మీర్జాఫూర్ మాఫీయా సామ్రాజ్యాన్ని కాలీన్ భాయ్ తిరిగి పొందడా? డాన్‌గా ఎదిగిన తర్వాత గుడ్డు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? మాధురి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? తదితర విషయాలన్నీ తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే.