breaking news
mirika jaiswal
-
విజేతలు ఆదిత్య, మిరిక జైస్వాల్
జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సీరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆదిత్య కల్లెపల్లి, మిరిక జైస్వాల్ టైటిళ్లు సాధించారు. త్రినైన ఇన్ఫార్మాటిక్స్ లిమిటెడ్, సూర్య టెన్నిస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర అండర్-14 విభాగం ఫైనల్లో ఆదిత్య 4-6, 6-4, 6-4తో ప్రలోక్ ఇక్కుర్తిపై గెలిచి విజేతగా నిలిచాడు. తొలి సెట్లో ఓడిన ఆదిత్య తర్వాతి సెట్లలో విజృంభించి ఆడాడు. ప్రలోక్ గ ట్టి పోటీనిచ్చాడు. బాలికల టైటిల్ పోరులో మిరిక జైస్వాల్ 6-3, 6-7 (2/7), 6-4తో ధృతి కపూర్‌పై చెమటోడ్చి నెగ్గింది. తొలి సెట్ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన మిరికకు రెండో సెట్లో పరాజయం ఎదురైంది. దీంతో నిర్ణాయక మూడో సెట్లో పుంజుకొని ఆడిన మిరిక సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. -
ఫైనల్లో మిరిక, ధ్రుతి
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) జాతీయ జూనియర్ టాలెంట్ సిరీస్ టోర్నమెంట్‌లోని అండర్-14 బాలికల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు మిరిక జైస్వాల్, ధ్రుతి కపూర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బోయినపల్లిలోని పల్లవి స్కూల్ మైదానంలో మంగళవారం జరిగిన సెమీఫైనల్స్‌లో మిరిక 6-3, 6-4తో సంస్కృతిపై, ధ్రుతి 6-3, 7-6 (7/5)తో సాహితి రెడ్డిపై గెలిచారు. క్వార్టర్ ఫైనల్స్‌లో మిరిక 9-8తో తటవర్తి శ్రేయపై, సంస్కృతి 9-3తో నమిరెడ్డి అవని రెడ్డిపై, ధ్రుతి కపూర్ 9-6తో కొత్తకోట అనన్యపై, సాహితి రెడ్డి 9-3తో వినీతపై నెగ్గారు. అండర్-14 బాలుర సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆదిత్య కల్లేపల్లి 6-3, 6-2తో హర్ష శ్రీపై, ప్రలోక్ ఇక్కుర్తి 7-5, 6-2తో రాజా కృష్ణతేజ (తమిళనాడు)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆదిత్య 9-0తో కుర్వా గౌరవ్‌పై, హర్ష శ్రీ 9-7తో షేక్ రిఫత్పై, రాజా కృష్ణతేజ 9-5తో గన్నవరం రాఘవ్‌పై, ప్రలోక్ 9-4తో కొసరాజు హర్షిత్‌పై విజయం సాధించారు.