విజేతలు ఆదిత్య, మిరిక జైస్వాల్ | Aditya,Mirika Jaiswal winners | Sakshi
Sakshi News home page

విజేతలు ఆదిత్య, మిరిక జైస్వాల్

Nov 29 2013 12:16 AM | Updated on Sep 2 2017 1:04 AM

ఏఐటీఏ టాలెంట్ సీరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆదిత్య కల్లెపల్లి, మిరిక జైస్వాల్ టైటిళ్లు సాధించారు.

జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సీరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆదిత్య కల్లెపల్లి, మిరిక జైస్వాల్ టైటిళ్లు సాధించారు. త్రినైన ఇన్‌ఫార్మాటిక్స్ లిమిటెడ్, సూర్య టెన్నిస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర అండర్-14 విభాగం ఫైనల్లో ఆదిత్య 4-6, 6-4, 6-4తో ప్రలోక్ ఇక్కుర్తిపై గెలిచి విజేతగా నిలిచాడు.  
 
 తొలి సెట్‌లో ఓడిన ఆదిత్య తర్వాతి సెట్లలో విజృంభించి ఆడాడు.  ప్రలోక్ గ ట్టి పోటీనిచ్చాడు. బాలికల టైటిల్ పోరులో మిరిక జైస్వాల్ 6-3, 6-7 (2/7), 6-4తో ధృతి కపూర్‌పై చెమటోడ్చి నెగ్గింది. తొలి సెట్ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన మిరికకు రెండో సెట్‌లో పరాజయం ఎదురైంది. దీంతో నిర్ణాయక మూడో సెట్‌లో పుంజుకొని ఆడిన మిరిక సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement