breaking news
junnior ranking tennis tournment
-
విజేతలు ఆదిత్య, మిరిక జైస్వాల్
జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సీరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆదిత్య కల్లెపల్లి, మిరిక జైస్వాల్ టైటిళ్లు సాధించారు. త్రినైన ఇన్ఫార్మాటిక్స్ లిమిటెడ్, సూర్య టెన్నిస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర అండర్-14 విభాగం ఫైనల్లో ఆదిత్య 4-6, 6-4, 6-4తో ప్రలోక్ ఇక్కుర్తిపై గెలిచి విజేతగా నిలిచాడు. తొలి సెట్లో ఓడిన ఆదిత్య తర్వాతి సెట్లలో విజృంభించి ఆడాడు. ప్రలోక్ గ ట్టి పోటీనిచ్చాడు. బాలికల టైటిల్ పోరులో మిరిక జైస్వాల్ 6-3, 6-7 (2/7), 6-4తో ధృతి కపూర్‌పై చెమటోడ్చి నెగ్గింది. తొలి సెట్ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన మిరికకు రెండో సెట్లో పరాజయం ఎదురైంది. దీంతో నిర్ణాయక మూడో సెట్లో పుంజుకొని ఆడిన మిరిక సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. -
సెమీస్‌లో ఉమర్, ప్రీతమ్
జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సిరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఉమర్ మిష్గాన్ సెమీస్‌లోకి ప్రవేశించింది. బోయిన్‌పల్లిలోని సూర్య టెన్నిస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఉమర్ మిష్గాన్ 9-3తో చరిత వాసిరెడ్డి (ఆంధ్రప్రదేశ్ )పై విజయం సాధించింది. తనతో పాటు జువేరా ఫాతిమ (ఆంధ్రప్రదేశ్ ) 9-1తో లాస్య (ఆంధ్రప్రదేశ్ )పై, శ్రేయ (ఆంధ్రప్రదేశ్ ) 9-8తో క్రితి పరేఖ్ (ఆంధ్రప్రదేశ్ )పై, శ్రావ్య శివాని (ఆంధ్రప్రదేశ్ ) 9-1తో తనూజా చౌహాన్ (ఆంధ్రప్రదేశ్ )పై నెగ్గారు. బాలుర అండర్-12 విభాగంలో ప్రీతమ్ (ఆంధ్రప్రదేశ్ )19-8తో అన్నే ఆకాష్ (ఆంధ్రప్రదేశ్ )పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాడు. హర్షిత్ (ఆంధ్రప్రదేశ్ ) 9-7తో ఇక్బాల్ ఖన్ (ఆంధ్రప్రదేశ్ )పై, అనురాగ్ (పశ్చిమబెంగాల్) 9-4తో దీపక్ (ఆంధ్రప్రదేశ్ )పై, రుచిత్ (ఆంధ్రప్రదేశ్ ) 9-8తో రిషిల్ గుప్తా (ఆంధ్రప్రదేశ్ )పై గెలుపొందారు. బాలుర అండర్-14 విభాగంలో వెంకట్ అనికేత్ (ఆంధ్రప్రదేశ్ ) 9-3తో ఆకాష్ (ఆంధ్రప్రదేశ్ )పై,శ్రీ హర్ష (ఆంధ్రప్రదేశ్ ) 9-5తో ఆదర్శ్నాగ (ఆంధ్రప్రదేశ్ )పై, కొసరాజు హర్షిత్ (ఆంధ్రప్రదేశ్ ) 9-1తో సయ్యద్ కరీముల్లా (ఆంధ్రప్రదేశ్ )పై, సాయి కార్తీక్ (ఆంధ్రప్రదేశ్) 9-4తో ఆకాష్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్ )పై విజయం దక్కించుకున్నారు. బాలికల అండర్-12 విభాగంలో అవంతిక రెడ్డి (ఆంధ్రప్రదేశ్ ) 9-8తో జువేరా ఫాతిమా (ఆంధ్రప్రదేశ్ )ను, సంస్కృతి (ఆంధ్రప్రదేశ్ ) 9-4తో అమూల్య (ఆంధ్రప్రదేశ్ )ను, సాహితీ రెడ్డి (ఆంధ్రప్రదేశ్ ) 9-6తో సొనాలి జైస్వాల్ (ఆంధ్రప్రదేశ్ )ను, సమృతి భాసిన్ (ఆంధ్రప్రదేశ్ ) 9-2తో శ్రేయ (ఆంధ్రప్రదేశ్ )ను ఓడించారు.