breaking news
Mint Road
-
ఈస్టర్న్ ఫ్రీ వే పెంపు
- 17 కి.మీను మరో 1.5 కి.మీ పెంచనున్న ఎమ్మెమ్మార్డీఏ - రెండు లేన్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు, వ్యయం అవుతుందని అంచనా సాక్షి, ముంబై: ఈస్టర్న్ ఫ్రీ వేను సౌత్ముంబైలోని మింట్ రోడ్ జంక్షన్ వరకు పొడగించనున్నారు. 17 కి.మీ ఉన్న ఫ్రీ వేను మరో 1.5 కి.మీ వరకు పెంచాలని మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) యోచిస్తోంది. ఫ్రీ వే పి.డి.మెల్లో రోడ్ వద్ద ఉన్న ఆరెంజ్ గేట్ వరకు ఉంది. కాగా, కొత్త మార్గం నిర్మాణంతో డాక్టర్ అంబేద్కర్ మార్గ్, ర ఫీ అహ్మద్ కిద్వాయ్ మార్గ్, పోర్ట్‌ట్రస్ట్ రోడ్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రద్దీ త గ్గనుంది. ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద ఘాట్కోపర్, సీఎస్‌టీల మధ్య కనెక్టివిటీ త్వరగా పెరుగుతుంది. నిర్మాణం, దానికి సంబంధించిన వ్యయం తదితర అంశాలపై ఫ్రీవే కన్సల్టెంట్లు పరిశీలిస్తున్నారని సంబంధిత అధికారి తెలిపారు. అందుబాటులో ఉన్న స్థలంపై లేన్ల నిర్మాణం ఆధారపడి ఉంటుందన్నారు. రెండు లేన్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు, నాలుగు లేన్లకు రెట్టింపు వ్యయం అవుతుందని చెబుతున్నారు. గతంతో ఫ్రీ వేను ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ్ నుంచి నిర్మించాలనుకున్నారు. అయితే స్థలం కొరత వల్ల ప్రణాళిక విఫలమైంది. మొదట ఆరెంజ్ గేట్ నుంచి అనిక్ (9.29) వరకు ఎలివేటెడ్ కారిడార్‌గా ఈ మార్గాన్ని నిర్మించారు. తర్వాత చెంబూర్ లోని శివాజీ చౌక (4.3 కి.మీ) వరకు గ్రౌండ్ లెవల్‌గా నిర్మించారు. మూడవ దశలో పంజర్పోల్-ఘాట్కోపర్ మధ్యలో నిర్మించారు. 22 మీటర్ల ఎత్తున్న ఈ బ్రిడ్జి నగరంలోనే ఎత్తైది. -
రేపు ఆర్బీఐ పగ్గాలు చేపట్టనున్న రాజన్
ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ముంబై నగరంలోని మింట్ రోడ్డులోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు నుంచి రాజన్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే రూపాయి పతనం, అధిక ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు పాతాళానికి పడిపోవడం, ప్రస్తుత ఖాతా లోటు తదితర పరిస్థితలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదెలు అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థను రాత్రికి రాత్రే కొత్త పుంతలు తొక్కించేందుకు తన వద్ద మంత్రదండం ఏమి లేదని ఆర్బీఐ గవర్నర్ పదవికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన సమయంలో రాజన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ముఖ్య ఆర్థికవేత్తగా పని చేసిన అపార అనుభవం రాజన్ సొంతం. అలాగే భారత ఆర్థిక మంత్రికి ముఖ్య సలహాదారునిగా రాజన్ గత ఆగస్టులో నియమితులయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు తన పదవి కాలం రేపటితో ముగియనుంది.