breaking news
military reimbursements
-
యూఎస్ నుంచి పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని అమెరికా మిలిటరీ సంస్థ పెంటగాన్ స్పష్టం చేసింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమైనందున ఇక మిలిటరీ రియంబర్స్మెంట్కింద 2016 సంవత్సరానికి ఎలాంటి చెల్లింపులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాట్టిస్ తెలిపారు. పాక్‌లోని అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ను కట్టడి చేయడంలో పాకిస్థాన్ విఫలమైందని అమెరికా అధికారులు చెప్పారు. 'పాకిస్థాన్ ప్రభుత్వానికి మేం 2016కుగానూ నిధులు మంజూరు చేయలేం. ఎందుకంటే హక్కానీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా పాక్ వ్యవహరించినట్లుగానీ, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకున్నట్లుగానీ పాక్‌కు సెక్రటరీగా వ్యవహరిస్తున్న మా దేశ ప్రతినిధి జిమ్ మాట్టిస్ ధ్రువీకరించనందున ఈ నిర్ణయం తీసుకున్నాం' అని పెంటగాన్ అధికారిక ప్రతినిధి ఆడం స్టంప్ విలేకరులకు చెప్పారు. -
పాకిస్థాన్‌కు షాకిచ్చిన పెంటగాన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక సాయం విషయంలో పాకిస్థాన్ ఆర్మీకి ఎదురుదెబ్బ తగిలింది. మిలిటరీ రీయింబర్స్మెంట్ సాయం కింద 300 మిలియన్ డాలర్ల (రూ. 2009 కోట్ల)ను పాక్ సైన్యానికి పెంటగాన్ అందించాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని తాజాగా అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో యథేచ్ఛగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న హక్కానీ నెట్‌వర్క్‌ను అణచివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, కాబట్టి పెంటగాన్ ఈ సాయాన్ని నిలిపివేయనుందని అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా-పాకిస్థాన్ మధ్య గత దశాబ్దకాలంగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. పాక్‌లో ఇస్లామిక్ గ్రూపులైన ఆఫ్గన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు పాక్ ప్రభుత్వం నిరాకరిస్తుండటం అమెరికాను చికాకు పరుస్తున్నది. ఈ నేపథ్యంలో హక్కానీ నెట్వర్క్ అణచివేత విషయంలో పాక్ చర్యలను ధ్రువీకరిస్తూ అమెరికా రక్షణశాఖ కార్యదర్శి యాష్ కార్టర్ కాంగ్రెస్ (చట్టసభ)కు నివేదించాల్సి ఉంది. అయితే, పాక్ చర్యల విషయంలో సంతృప్తిగాలేని రక్షణమంత్రి ఈ విషయమై కాంగ్రెస్‌కు ఏమీ చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉగ్రవాద నియంత్రణలో భాగంగా కొలియేషన్ సపోర్ట్ ఫండ్ కింద మిత్రదేశాలకు అందించే ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది పాకిస్థాన్‌కు అందజేయబోమని రక్షణశాఖ (పెంటాగాన్) అధికారులు తెలిపారు.