breaking news
m.Girjashankar
-
త్వరలో ‘సగటు సమీక్ష మిషన్’ జిల్లా పర్యటన
కలెక్టరేట్, న్యూస్‌లైన్: వైద్య ఆరోగ్య పరిస్థితుల ను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వాని కి చెందిన ‘సగటు సమీక్ష మిషన్’ బృందం త్వ రలోనే జిల్లా పర్యటనకు రానుందని, ఈ విషయాన్ని ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వైద్యాధికారులను సూచించారు. బుధవారం వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు వచ్చే కమిటీ పీహెచ్సీ నుంచి జిల్లా ఆస్పత్రి, వైద్యాధికారుల కార్యాలయాల్లో ఎక్కడైనా తనిఖీ చేయవచ్చని తెలిపారు. వైద్యాధికారులు, సిబ్బంది వారివారి కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. కమిటీ వచ్చాక ఏమైనా తేడాలొస్తే అందుకు సంబంధిత అధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సీనియర్ ఆరోగ్య అధికారులు తక్షణమే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మాతా శిశు ర క్షణలో భాగంగా రూపొందించిన ‘ట్రాక్’ కా ర్డును తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూ చించారు. అలాగే జననీ సురక్ష యోజన, జనని శిశు సంరక్షక యోజన, జాతీయ గ్రామీణ ఆ రోగ్య మిషన్ నిధులు, పారిశుధ్యం, ఇతర రి జిస్టర్లు, ఇమ్యూనైజేషన్ తదితర అంశాలకు చెం దిన రికార్డులన్నీ సక్రమంగా ఉండేలా చూడాల న్నారు. ఈకమిటీ వైద్యసేవలపై అధ్యయనం చే సి, వాటిపై కేంద్రానికి ఇచ్చే నివేదిక పైనే ైవె ద్యా దికారుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. గతంలో ఈ కమిటీ జిల్లాకు వచ్చినప్పుడు చాలా వరకు సంతృప్తి వ్యక్తం చేసిందని, అలాగే కొన్ని లోపాలను సరిచేసుకోవాలని సూచించిందన్నారు. ఈసారి లోపాలను ఎత్తిచూపే అవకాశం ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలన్నారు. ఇప్పటినుంచే గ్రామాల్లో ఆశా కార్యకర్తలను అప్రమత్తం చేసి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు జే సీ డా.రాజారాం, జిల్లా వైద్యాధికారి డా.రుక్మిణి, ఐసీడీఎస్ పీడీ ఇందిర, అధికారులు శశికాంత్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. -
కుండపోత.. గుండెకోత
అన్నదాత గుండె చెరువైంది. అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన తరుణంలో ముసురువాన నిండాముంచింది. రైతన్న రెక్కలకష్టమంతా వర్షార్పణమైంది. పత్తి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మార్కెట్‌కు విక్రయానికి తెచ్చిన వేలాది బస్తాల మొక్కజొన్న తడిసిముద్దయింది. జిల్లాలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నల్లమలలో భారీవర్షం కురియడంతో చంద్రవాగు ఉధృతంగా ప్రహహిస్తోంది. దుందుబీ ఉరకలేస్తోంది. శ్రీశైలం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాకేంద్రంతో పాటు పలుప్రాంతాల్లో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణం నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పాలమూరు, న్యూస్‌లైన్: జడివాన జిల్లాను ముం చెత్తింది. మూడురోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఏకమైపారుతున్నాయి. నల్లమలలో కురిసిన భారీవర్షానికి చంద్రవాగు ఉధృతం గా ప్రవహిస్తోంది. గురువారం అచ్చంపేట మం డలంలో అత్యధికంగా 22 సెం.మీ వర్షపాతం న మోదైంది. జిల్లాలోని పలుచోట్ల లోతట్టుప్రాం తా లు జలమయమయ్యాయి. రహదారులు తెగి పోయి రాకపోకలకు నిలిచిపోయాయి. అన్నదాత రెక్కల పూర్తిగా వర్షార్పణమైంది. జిల్లాలో దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో పత్తిపంట నీటమునిగింది. కేవలం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోనే దాదాపు 50వేల ఎకరాల్లో పత్తిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. గద్వాల, అలంపూర్, కల్వకుర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి, నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. వర్షానికి రూ.200కోట్ల పంటనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అచ్చంపేట, అమ్రాబాద్ పరిధిలో వరి, పత్తి, మిర్చి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కందిసాగులో ప్రత్యేకతను చాటుకునే కొడంగల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాల్లో కందిపంట సాగయింది. ప్రస్తుత వర్షానికి పంటమొత్తం నాశనమైపోయింది. రబీలో సాగుచేసిన వేరుశనగ విత్తనాలు కూడా నీటిలోనే మురిగిపోయార ుు. జిల్లాలో వర్షం ధాటికి 620 ఇళ్లు కూలి రూ. 17.50కోట్ల నష్టం వాటిల్లింది. ఆర్అండ్బీ రోడ్లు సుమారు 50కిలోమీటర్ల మేర పాడైపోయాయి. అలాగే జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, మహబూబ్‌నగర్, వనపర్తి మార్కెట్లలో వేలాది మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. జిల్లాలో 45.1 మి.మీ వర్షపాతం గురువారం జిల్లా వ్యాప్తంగా 45.1 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నా రు. అచ్చంపేట మండల పరిధిలో అత్యధికంగా 220.0మి.మీ మేర వర్షపాతం నమోదైంది. బల్మూర్ 200.0 మి. మీ, లింగాల 132.0, అమ్రాబాద్ 109.0, తెలకపల్లి 106.0, కల్వకుర్తి 100.2, వంగూరు, పెద్దకొత్తపల్లి 90.0, కోడే రు 88.0, వెల్దండ 85.6, నాగర్‌కర్నూల్ 82.4, బిజినేపల్లి 67.4, కొల్లాపూర్ 66.0, షాద్‌నగర్ 63.2, ఆమనగల్లు 56.0, తిమ్మాజిపేట, మాడ్గుల 55.0, దరూర్ 51.0, ఉప్పునుంతల 50.0, ఆత్మకూర్ 49.0, గద్వాల 43.6, పెబ్బేరు, తలకొండపల్లి 43.0, కొత్తూరు 40.2, తాడూరు 40.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.