breaking news
mercy plea
-
తొలి క్షమాభిక్షకు కోవింద్ నో...!
న్యూఢిల్లీ : రాష్ట్రపతి అయిన తర్వాత మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులను అతికిరాతంగా సజీవదహనం చేసిన ఓ నిందితుడికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 2006లో బిహార్‌కు చెందిన విజేంద్ర మహతో, ఆయన కుటుంబ సభ్యులను జగత్‌రాయ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించగా.. తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 23న దోషి జగత్‌రాయ్ రాష్ట్రపతి కోవింద్‌కు విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే ఏడుగురిని హతమార్చి, దహనం చేసిన వ్యక్తికి క్షమాభిక్ష ఇవ్వడానికి రాష్ట్రపతి అయిష్టత చూపించారు. జగత్‌రాయ్ అభ్యర్థనను తిరస్కరించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
క్షమాభిక్ష తీర్పును పునఃసమీక్షించం: సుప్రీం
న్యూఢిల్లీ: క్షమాభిక్ష పిటిషన్లపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేది లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటషన్లకు సంబంధించి మరణశిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఉరిశిక్ష పడ్డ 15 మంది ఖైదీలకు శిక్షను జీవిత ఖైదుగా మార్చడాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది.