breaking news
Men in black
-
Ashish Chanchlani: టాలెంట్‌తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్‌తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్‌కి వెల్‌నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్‌లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్‌తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్‌తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్‌కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్‌స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్‌కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
మనుషులా..? గ్రహాంతరవాసులా!
నల్లటి సూటు-బూటు-టోపీలతో పొడవుగా ఉండే వ్యక్తులు. ఎవరో? ఎక్కడివారో? ఎప్పుడు వస్తారో? తెలియదు. అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఎగిరే పళ్లాల(యూఎఫ్ఓ)కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నీ చెప్పవద్దని గట్టిగా వార్నింగ్ మాత్రం ఇస్తారు. వారి వేషధారణ, మాట తీరు, ఆహార్యం అంతా సాధారణ మనుషుల్లా అనిపించదు. అసలు వారు మనుషులేనా? అన్న అనుమానాలూ ఉన్నాయి.. వారే ‘మెన్ ఇన్ బ్లాక్’ (ఎంఐబీ). వీరి గురించి అమెరికాలో కథలుగా చెప్పుకుంటారు. ఈ ఘటనల ఆధారంగా ఎంఐబీ పేరుతో కార్టూన్, టీవీ సీరియళ్లు, సినిమాలు కూడా వచ్చాయి. అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తులు ఈ ‘మెన్ ఇన్ బ్లాక్’. అమెరికాలో వీరు పలు చోట్ల రహస్యంగా సంచరిస్తుంటారని జనం ఇప్పటికీ చెప్పుకుంటారు. వీరు ఎలా ఉంటారన్న విషయాన్ని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోవడం గమనార్హం. కాలి బూట్లు, దుస్తులు, కంటి అద్దాలు, టోపీ, ఓవర్ కోట్ ఇలా అన్నీ నలుపు రంగులోనే ఉండటం వీరి ప్రత్యేకత. వీరు మాట్లాడేది ఇంగ్లిషే అయినా యాస మాత్రం స్థానికంగా వాడేది కాదని, వారి చర్మం రంగు, కళ్లు కూడా విచిత్రంగా ఉన్నాయని, కనుబొమ్మలు లేవని, కనుపాపలు మొత్తం ఒకే రంగులో ఉన్నాయని చూసిన వారు వెల్లడించారు. మనుషుల సహజ లక్షణాలకు విభిన్నంగా కనిపించడంతో వారు తప్పకుండా గ్రహాంతరవాసులే అయి ఉంటారనే వాదన మొదలైంది. ఒంటారియాలో ఓ హోటల్లోకి వచ్చిన వీరి దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. ఎలా వెలుగులోకి వచ్చారు? మెన్ ఇన్ బ్లాక్ గురించి అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన ఘటనల్లో ‘మౌరీ ఐలాండ్’ ఘటన మొదటిది. 1947, జూన్‌లో ఫ్రెడ్ క్రిస్మన్- హరాల్డ్ డాల్ అనే ఇద్దరు తీరంలో పడవలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆకాశంలో ఎగురుతున్న ఆరు ఎగిరేపళ్లాలు దీవికి సమీపంగా వచ్చాయని, వ్యర్థాలతోపాటు లావాలాంటి తెల్లటి ద్రవాన్ని తమపై చిమ్మాయని ఆరోపించారు. ఆ వ్యర్థాల కారణంగా తమ పడవలో ఓ వ్యక్తికి చేయి విరగ్గా, కుక్క మరణించిందని చెప్పారు. వెంటనే నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు తమను సమీపించి ఇక్కడ జరిగిందేది బయటికి చెప్పవద్దని బెదిరించారని వాపోయారు. 1953లో మరోసారి! అల్బర్ట్ .కె. బెండర్ అనే వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వైమానిక దళంలో పనిచేశాడు. అతనికి యూఎఫ్ఓలపై ఉన్న ఆసక్తితో 33వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఇంటర్నేషనల్ ఫ్లైయింగ్ సాసర్ బ్యూరో’ని స్థాపించాడు. అదేక్రమంలో ‘స్పేస్ రివ్యూ’ అనే పత్రికను నడిపేవాడు. దాని నిండా ఎగిరే పళ్లాల గురించిన వార్తలే ఉండేవి. అనతికాలంలోనే ఇతని సంస్థ, పత్రిక అమెరికాలోని 48 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందాయి. 1953లో ఎగిరేపళ్లాలకు సంబంధించిన అతని పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. పలు కొత్త విషయాలు కనిపెట్టాడు. వాటిని అదే ఏడాది సెప్టెంబరు సంచికలో ప్రచురిద్దామనుకున్నాడు. అకస్మాత్తుగా ‘మెన్ ఇన్ బ్లాక్’ వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. తాను ఎంతో కష్టపడి రాసుకున్న పరిశోధన వివరాలను వారి నోట విన్న బెండర్ నివ్వెరపోయాడు. ఈ విషయాలను ప్రచురించవద్దని హెచ్చరించడంతో బెదిరిపోయి వెనక్కుతగ్గాడు. వాస్తవానికి వీరు ఎవరు? వీరు మొత్తం ముగ్గురు వ్యక్తులని ప్రచారం ఉంది. అమెరికాలో ఎవరైతే తాము ఎగిరే పళ్లాలను, వింత వస్తువులను చూశామని చెప్పుకుంటారో, వారి వద్ద వీరు మరునాడు ప్రత్యక్షమయ్యేవారు. మీకు తెలిసిన ఏ సమాచారాన్నైనా బయటికి వెల్లడించవద్దని బెదిరించేవారని సాక్షులు తెలిపారు. వాస్తవానికి వీరు అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే పేరు తెలియని సంస్థల రహస్య ఏజెంట్లన్న ప్రచారమూ ఉంది. గ్రహాంతరవాసులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని, వదంతులను ప్రచారం చేసే వారిని కట్టడి చేయడానికి ఇలా బెదిరించే వారనే వాదనలూ ఉన్నాయి. మొత్తానికి ‘ఎంఐబీ’లు ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.