breaking news
membership enrollment
-
అరే చూస్తావేంటి చేరిపో!
సాక్షి, ముంబై: తరుచూ పరాజయాలతో కుంగిపోతున్న రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ సభ్యత్వ నమోదుకు కొత్త నినాదం అందుకుంది. ‘అరె బగ్తాయ్ కాయ్ సామీల్ వ్హా’ (అరే చూస్తావేంటి చేరిపో) అనే కొత్త నినాదంతో ముందుకొచ్చారు. ఈ ఏడాది మార్చి 9తో ఎమ్మెన్నెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరా లు పూర్తయింది. ఈ సుదీర్గ కాలంలో, అనేక రాజకీయ పరిణామాలతో పార్టీ ఇంతవరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా చేపడుతున్న ఈ కార్యక్ర మానికి సోషల్ మీడియాలో యువతను ఆకుట్టకునే విధంగా ప్రకటన ఇచ్చింది అందులో ‘అరె బగ్తాయ్ కాయ్ సామీల్ వ్హా’ (అరే చూస్తావేంటి చేరిపో) అనే కొత్త పంథాతో ఎన్నికల ముందుకు వెళ్లనున్నారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు.. పుణే, నాసిక్, ఔరంగాబాద్, కల్యాణ్–డోంబివలి, మీరా–భాయందర్ కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికలను రాజ్‌ఠాక్రే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కోల్పోయిన పార్టీ పూర్వ వైభవాన్ని మళ్లీ తెచ్చేందుకు ఎంతో కృషి, పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే ఆయన ఈ కార్పొరేషన్లలో విస్తృతంగా పర్యటించారు. ఆ కార్పొరేషన్ల పరిధిలోని సంబంధిత పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. అక్కడి రాజకీయ వాతావరణం, ఏ పార్టీకి ఎక్కువ పట్టు ఉంది...? తమ పార్టీకి అవకాశాలెలా ఉన్నాయి...? ఎన్నికలు జరిగితే ఫలితాలెలా ఉంటాయి...? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు సభ్యత్వ నమోదు పథకానికి శ్రీకారం చుట్టారు. అందుకు సోషల్ మీడియా ద్వారా ప్రకటనలిస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా నియోజకవర్గాల ప్రజల వరకు చేరుకోవడం కష్టతరంగా మారింది. దీంతో సోషల్ మీడియా సాయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెన్నెస్‌లో సభ్యత్వం ఎలా తీసుకోవాలో అందులో వివరాలు పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని తమ పార్టీ కార్యకర్తలుగా చేర్చుకోవాలనే ప్రయత్నం చేయనున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, పని చేస్తున్న ప్రముఖులను కూడా ఇందులో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే నెల 24వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుంది. ఇదిలాఉండగా ఏటా పార్టీ అవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించే రాజ్‌ఠాక్రే ఈ సారి రద్దు చేశారు. సభలో పార్టీ పదాధికారులకు, కార్యకర్తలకు వివిధ అంశాలపై మార్గదర్శనం, పార్టీ దిశనిర్ధేశం చేస్తారు. కానీ, ఈ సారి కరోనా వైరస్ కారణంగా పార్టీ అవిర్భావ వేడుకలు నిర్వహించలేదు. అందుకు సోషల్ మీడియా ద్వారా తమ సందేశాన్ని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల చెంతకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో ఘనంగా.. అప్పట్లో శివసేన నుంచి బయటపడిన రాజ్‌ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీలో చేర్చుకుంటామని పేర్కొంటూ 2006 మార్చి 9వ తేదీన ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. ప్రారంభంలో తిరుగులేని పార్టీగా ఎదిగిన ఎమ్మెన్నెస్ ప్రధాన పార్టీలను సైతం దెబ్బతీసింది. ఆ తరువాత జరిగిన బీఎంసీ, నాసిక్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించుకుంది. కాని కాలక్రమేణా పార్టీ ప్రతిష్ట, ప్రాబల్యం దెబ్బతినసాగింది. దీంతో కార్పొరేటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. చివరకు పార్టీలో ఒక్కరే ఎమ్మెల్యే, ఒక్కరే కార్పొరేటర్ మిగిలారు. ఇది పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ కోల్పోయిన ప్రతిష్ట, కార్యకర్తలు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి నింపేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో పర్యటించడం, పదాధికారులు, కార్యకర్తలతో సంప్రదించడం లాంటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సభ్యత నమోదు పథకాన్ని సోషల్ మీడియా ద్వారా చేపట్టి పార్టీలో కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలని, అలాగే ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే ప్రయత్నం రాజ్ ఠాక్రే చేస్తున్నారని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. చదవండి: ఊపిరి ఉన్నంతవరకు బీజేపీపై పోరు హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర హెచ్చరికలు -
టీడీపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదుకు బ్రేక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోట్లమంది వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు కంపెనీకి లీకు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం దాంతో ముడిపడి ఉన్న టీడీపీ ఆన్లైన్ సభ్యత్వాన్ని ఉన్నట్టుండి రద్దు చేసింది. ఆధార్‌తో అనుసంధానించి ఇప్పటివరకు పార్టీ ఆన్లైన్ సభ్యత్వాన్ని భారీఎత్తున నమోదు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రైవేటు వ్యవహారాలకోసం ఆధార్‌ను అనుసంధానించకూడదు. కానీ టీడీపీ ఆధార్ ఆధారంగా ఆన్లైన్ సభ్యత్వాన్ని చేపట్టింది. ఓటర్ల జాబితా, ఆధార్ నంబర్లను పార్టీ సభ్యత్వాలకోసం అనుసంధానించింది. తాజా పరిణామాల నేపథ్యంలో హడావుడిగా టీడీపీ వెబ్‌సైట్‌లోని ఆన్లైన్ సభ్యత్వాన్ని శనివారం నుంచి నిలిపివేసింది. సంబంధిత వార్తలు ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్! డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం చంద్రబాబు, లోకేష్‌ల కుట్రే ఐటీ గ్రిడ్ డేటా స్కామ్ సూత్రధారి బాబే ఐటీగ్రిడ్స్ స్కాం: అధికారుల్లో టెన్షన్.. టెన్షన్ -
దేశంలో తొలి హిజ్రా న్యాయవాది
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిజ్రాకు బార్ కౌన్సిల్లో సభ్యత్వం లభించింది. 36 ఏళ్ల సత్యశ్రీ శనివారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో చెన్నైలోని తమిళనాడు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో తన పేరును నమోదు చేసుకున్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న 11 ఏళ్ల తర్వాత బార్ కౌన్సిల్లో సభ్యత్వం పొందగలిగానని ఈ సందర్భంగా సత్య శ్రీ ఆవేదన చెందారు. జడ్జిగా ఎదగడమే తన కల అని చెప్పారు. రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన సత్యశ్రీ జన్మతః బాలుడు. చిన్నప్పుడే శరీరంలో స్త్రీగా మార్పులు ప్రారంభమవడంతో కుటుంబాన్ని వదిలి వచ్చి చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టులో పెరిగారు. 2007లో సేలం కేంద్రీయ లా కాలేజీ నుంచి లా పట్టా తీసుకున్నారు. 2014లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రాతిపదికన జాతీయ న్యాయ వ్యవహారాల కమిషన్ హిజ్రాలు సైతం లాయర్లుగా బార్ కౌన్సిల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో సత్యశ్రీకి బార్ కౌన్సిల్ సభ్యత్వం లభించింది. -
'టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్'
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ పరిధిలో టీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. సీమాంధ్రకు చెందిన వారు కూడా టీఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 5 లక్షల మంది టీఆర్ ఎస్ సభ్యత్వం తీసుకున్నారని ఆయన చెప్పారు. జీహెచ్ ఎంసీ రాజకీయాలను మార్చే సత్తా ఒక్క టీఆర్ ఎస్ కే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ తో ఎలాంటి విబేదాలు లేవని, ఇరుగు పొరుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని నాయిని అన్నారు.