breaking news
the mega sports
-
అట్టహాసంగా ఆరంభమైన ఆసియా గేమ్స్
ఇంచియాన్: నాలుగేళ్లకోసారి కనువిందు చేసే ఆసియా గేమ్స్‌కు సర్వం సిద్ధమైంది. కొరియా సిటీ ఇంచియాన్‌లో 17వ ఆసియా క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఆసియా ఖండానికి చెందిన 45 దేశాల నుండి సుమారు 10 వేల మంది ప్లేయర్లు తమ క్రీడా కౌశలాన్ని ఈ వేదికలో ప్రదర్శించేందుకు ఆరాట పడుతున్నారు. ఈ మెగా క్రీడలకు మూడోసారి ఆతిథ్యమిస్తున్న కొరియా... వీటి నిర్వహణ ద్వారా తమ సత్తా ప్రపంచానికి చూపాలని భావిస్తోంది. ఆసియా క్రీడల ఆరంభానికి ముందే కొరియా అదుర్స్ అనిపించుకుంది. అందుకు కారణం క్రీడల్ని విజయవంతం చేసేందుకు ఆతిథ్య దేశం చేసిన ఏర్పాట్లే. ఇక కొరియా ‘డైవర్సిటీ షైన్స్ హియర్’ స్లోగన్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆసియాలో ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నా... భిన్నత్వం ఇక్కడ మెరిసిపోతుందంటూ కొరియా అన్ని దేశాల మనసును గెలుచుకుంది. ఆసియా క్రీడల్ని దక్షిణ కొరియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్లుగానే భారీగా నిధులను ఖర్చు చేసింది. ఏషియాడ్ కోసం 162 కోట్ల అమెరికా డాలర్లు (రూ. 9720 కోట్లు) వెచ్చిస్తోంది. పోటీలు పూర్తయ్యే వరకు ఈ ఖర్చు పదివేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. మొత్తం బడ్జెట్లో కొరియా ప్రభుత్వం 19 శాతం, మిగిలినది ఇంచియాన్ ప్రభుత్వం భరించనుంది. -
నేటి నుంచి ఇంచియాన్‌లో ఆసియా క్రీడలు
-
పండగొచ్చింది
ఇంచియాన్: నాలుగేళ్లకోసారి కనువిందు చేసే ఆసియా గేమ్స్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మెగా క్రీడలకు మూడోసారి ఆతిథ్యమిస్తున్న కొరియా... వీటి నిర్వహణ ద్వారా తమ సత్తా ప్రపంచానికి చూపాలని భావిస్తోంది. సాధారణంగా పోటీలు మొదలయ్యాకగానీ క్రీడల నిర్వహణ ఎలా ఉందో చెప్పలేం. అయితే ఆసియా క్రీడల ఆరంభానికి ముందే కొరియా అదుర్స్ అనిపించుకుంది. అందుకు కారణం క్రీడల్ని విజయవంతం చేసేందుకు ఆతిథ్య దేశం చేసిన ఏర్పాట్లే. ఇక కొరియా ‘డైవర్సిటీ షైన్స్ హియర్’ స్లోగన్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆసియాలో ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నా... భిన్నత్వం ఇక్కడ మెరిసిపోతుందంటూ కొరియా అన్ని దేశాల మనసును గెలుచుకుంది. రూ. 9720 కోట్లు... ఆసియా క్రీడల్ని దక్షిణ కొరియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్లుగానే భారీగా నిధులను ఖర్చు చేసింది. ఏషియాడ్ కోసం 162 కోట్ల అమెరికా డాలర్లు (రూ. 9720 కోట్లు) వెచ్చిస్తోంది. పోటీలు పూర్తయ్యే వరకు ఈ ఖర్చు పదివేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. మొత్తం బడ్జెట్లో కొరియా ప్రభుత్వం 19 శాతం, మిగిలినది ఇంచియాన్ ప్రభుత్వం భరించింది. క్రీడలకు స్టేడియాల నిర్మాణం, ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కోసం నిర్వాహకులు 139 కోట్ల అమెరికా డాలర్లు (రూ. 8340 కోట్లు) ఖర్చు చేశారు. భవనాలు, ఆటగాళ్ల శిక్షణకు అవసరమైన ట్రైనింగ్ గ్రౌండ్ల నిర్వహణ కోసం రూ. 66 కోట్లు... రోడ్లు, రవాణా సదుపాయాల కోసం రూ. 618 కోట్లు కేటాయించారు. ఈసారి నవ్వుతున్న మూడు ‘సీల్స్’ బొమ్మలతో మస్కట్ తయారు చేశారు. మూడు సీల్స్కు బరామె, చుమురో, విచువాన్గా నామకరణం చేశారు. గాలి, నృత్యం, కాంతి అని వీటి అర్థం. భవిష్యత్‌లో దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య శాంతి ఉండాలని కోరుకుంటూ సీల్స్‌ను ఎంపిక చేసుకున్నారు. నార్త్ కొరియా అథ్లెట్లకు ఘన స్వాగతం తమ దేశాల మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నా గేమ్స్ కోసం వచ్చిన నార్త్ కొరియా బృందానికి దక్షిణ కొరియా ఘనంగా స్వాగతం పలికింది. అయితే నార్త్ కొరియా అథ్లెట్స్గానీ, అధికారులుగానీ ఎక్కడా పెదవి విప్పకుండా కేవలం చిరునవ్వుతోనే సరిపెట్టుకున్నారు. గేమ్స్ విలేజిలో మాత్రమే పతాకావిష్కరణ సందర్భంగా కొరియా ప్రతినిధి బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. బ్లూ ట్రౌజర్‌పై వైట్ బ్లేజర్‌ను ధరించిన నార్త్ కొరియన్లు డ్రెస్‌పై తమ దివంగత నేతలు కిమ్-2 సంగ్, కిమ్ జాంగ్-2ల ఫొటోలు కలిగిన బ్యాడ్జ్‌లను పెట్టుకున్నారు. సింగపూర్, చైనా, థాయ్, యెమన్ అథ్లెట్లు ఫొటోలు దిగుతూ సందడి చేశారు. గేమ్స్ విలేజ్‌లో సందడిని మినహాయిస్తే ఇంచియాన్‌లో మాత్రం ఎక్కడా గేమ్స్ జోష్ కనబడటం లేదు. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల బ్యానర్లను నిషేధించడంతో గేమ్స్ జరుగుతున్నట్లు పర్యాటకులు గుర్తించలేకపోతున్నారు. సామాన్య ప్రజలు కూడా వారంలో మరో రోజుగా భావిస్తూ తమ పనిలో నిమగ్నమైపోతున్నారు. టాప్-5లో చోటే లక్ష్యం! ఇంచియాన్: ఒకప్పుడు ఆసియా క్రీడల్లో టాప్-3లో ఉన్న భారత్ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. నాలుగేళ్ల క్రితం గ్వాంగ్జౌలో ఆరో స్థానంలో నిలిచిన భారత బృందం ఈసారి టాప్-5లో చోటే లక్ష్యంగా ఇంచియాన్ చేరింది. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో అంచనాలకు మించి పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు ఆసియాలో పతకాలు సాధించడం మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే కామన్వెల్త్ కన్నా ఏషియాడ్‌లో పోటీ అధికంగా ఉంటుంది. చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లతో పాటు మరికొన్ని దేశాల నుంచి సవాళ్లను ఎదుర్కోవాలి. అప్పుడే భారత్ తాను అనుకున్నది సాధించగలుగుతుంది. అయితే భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. గత ఏషియాడ్ (65 పతకాలు)ని దాటి ఈసారి ఇంచియాన్‌లో 70 పతకాలను గెలుస్తామని ధీమాగా ఉంది. షూటింగ్లో 10 నుంచి 14, అథ్లెటిక్స్‌లో 12 నుంచి 16 పతకాలు వస్తాయని అంచనా వేస్తోంది. వీటితో పాటు బ్యాడ్మింటన్, స్క్వాష్, బాక్సింగ్, రెజ్లింగ్, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, రోయింగ్ల్లో పతకాలు భారత్ ఖాతాలో చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మహిళల బాక్సింగ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మేరీ కోమ్కు స్వర్ణం దక్కడం ఖాయం. షూటింగ్లో బీజింగ్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా, హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్, జీతూ రాయ్, అపూర్వీ చండీలాతో పాటు మరికొందరు షూటర్లు పతకాలపై గురిపెట్టారు. బ్యాడ్మింటన్‌లో హైదరాబాదీలు సైనా నెహ్వాల్, పీవీ సింధు పతకం సాధించే అవకాశాలున్నాయి. పారుపల్లి కశ్యప్ కూడా ఏషియాడ్‌లో తన సత్తా చాటుతానంటున్నాడు. హాకీలో సర్దార్ సింగ్ బృందంపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారత జట్టు స్వర్ణం దక్కించుకుని మళ్లీ హాకీకి పూర్వవైభవం తీసుకొస్తుందని ఆశిస్తున్నారు. 36 ఈసారి క్రీడల్లో క్రీడాంశాలు 49 ఆటలు నిర్వహించే స్టేడియాలు 439 మొత్తం క్రీడల్లో జరిగే ఈవెంట్ల సంఖ్య 13వేలు ఈ క్రీడల్లో పాల్గొనే మొత్తం క్రీడాకారులు రూ.2,400కోట్లుక్రీడల ప్రధాన స్టేడియం ‘ఇంచియాన్ ఏషియాడ్’ నిర్మాణం కోసం కొరియా ఖర్చు చేసిన మొత్తం. 3 కొరియా ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 1986లో సియోల్‌లో, 2002లో బుసాన్‌లో ఆసియా క్రీడలు జరిగాయి. 17 ఈసారి జరిగేది 17వ ఆసియా క్రీడలు 516 భారత్ తరఫున బరిలో దిగుతున్న అథ్లెట్లు