దాండియాకు రెడీయా?
నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని డీజే మెరుపుల మధ్య దాండియా నృత్యాల సందడికి సిటీలో తెరలేచింది. ఏకేఈఎంఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘మెగా దాండియా ఉత్సవ్’ను శంషాబాద్‌లోని ఎంఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 8 నుంచి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పవన్ అగర్వాల్, అభిలాష్ చెప్పారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో వర్ధమాన సినీ తారలు పాల్గొని సందడి చేశారు. మూడు రోజుల ఈ ఈవెంట్లో డీజే పీయూష్ బజాజ్ మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన ఉంటుందన్నారు.
– సాక్షి, వీకెండ్ ప్రతినిధి