దాండియాకు రెడీయా? | are you ready to dandiya? | Sakshi
Sakshi News home page

దాండియాకు రెడీయా?

Oct 1 2016 9:56 PM | Updated on Sep 4 2017 3:48 PM

దాండియాకు రెడీయా?

దాండియాకు రెడీయా?

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని డీజే మెరుపుల మధ్య దాండియా నృత్యాల సందడికి సిటీలో తెరలేచింది.

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని డీజే మెరుపుల మధ్య దాండియా నృత్యాల సందడికి సిటీలో తెరలేచింది. ఏకేఈఎంఎస్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ‘మెగా దాండియా ఉత్సవ్‌’ను శంషాబాద్‌లోని ఎంఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 8 నుంచి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పవన్‌ అగర్వాల్, అభిలాష్‌ చెప్పారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో వర్ధమాన సినీ తారలు పాల్గొని సందడి చేశారు. మూడు రోజుల ఈ ఈవెంట్‌లో డీజే పీయూష్‌ బజాజ్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ ప్రదర్శన ఉంటుందన్నారు.
    – సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి

 

Advertisement
 
Advertisement
Advertisement