breaking news
Mecca masid
-
మక్కా మసీద్ పేలుళ్ల కేసులో ఎన్నో కోణాలు
-
‘మక్కా’ పేలుడు కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. నిందితులు నేరం చేసినట్టుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, ఏ ఒక్క అభియోగానికీ ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న స్వామి అసీమానంద వాంగ్మూలానికి చట్టబద్ధత లేదని, చాలా మంది సాక్షులు తొలుత ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మళ్లీ సాక్ష్యం చెప్పారని స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసు కుని కేసును కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ.. నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రవీందర్‌రెడ్డి తీర్పునిచ్చారు. పదకొండేళ్ల తర్వాత.. హైదరాబాద్‌లోని చరిత్రాత్మక మక్కా మసీదులో 2007 మే 18న బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత 1:25 గంటల సమయంలో సెల్‌ఫోన్ సహాయంతో బాంబును పేల్చారు. ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. 58 మంది గాయపడ్డారు. దీనిపై తొలుత స్థానిక పోలీసులు, అనంతరం సీబీఐ, ఎన్ఐఏలు దర్యాప్తు చేసి.. చార్జిషీట్లు దాఖలు చేశాయి. మొత్తంగా పది మందిని నిందితులుగా చేర్చాయి. సుదీర్ఘంగా 11 ఏళ్లపాటు దర్యాప్తు, విచారణలు కొనసాగాయి. తాజాగా సోమవారం తీర్పు వెలువడింది. అభియోగాలకు ఆధారాలేవీ? ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారు బాంబు పేలుళ్లకు పాల్పడినట్టు నిరూపించడంలో ఎన్ఐఏ విఫలమైందని న్యాయ మూర్తి రవీందర్‌రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. నిందితులపై ఎన్ఐఏ మోపిన ఏ ఒక్క అభియోగానికి కూడా ఆధారాలు చూపలేకపోయిందని తెలిపారు. పేలుడుకు వాడిన సిమ్ కార్డులను నిందితులు ఉపయోగించారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అజ్మీర్ దర్గా పేలుడుకు, మక్కా మసీదు పేలుడుకు అవే సిమ్ కార్డులను ఉపయోగించారని ఎన్ఐఏ అభియోగం మోపిందని.. కానీ దీనిపై ఆధారాలను చూపలేకపోయిందని స్పష్టం చేశారు. బాబూలాల్ యాదవ్ పేరుతో దేవేందర్ గుప్తా సిమ్ కార్డులను కొనుగోలు చేశారనేందుకూ ఆధారాల్లేవన్నారు. ఆ వాంగ్మూలాలు చెల్లవు.. కేసులో కీలకంగా పేర్కొన్న స్వామి అసీమానంద నేరాంగీకార వాంగ్మూలానికి ఎటువంటి చట్టబద్ధత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పోలీసు కస్టడీలో ఉండగా ఢిల్లీలోని పంచకుల కోర్టులో అసీమానంద వాంగ్మూలాన్ని నమోదు చేశారని.. కస్టడీలో ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం చట్ట ప్రకారం చెల్లదని వెల్లడించారు. దర్యాప్తు అధికారులు అసీమానంద వాంగ్మూలం ఆధారంగానే కొందరిని నిందితులుగా చేర్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక పేలుళ్లకు జరిపిన కుట్రలో భరత్ మోహన్‌లాల్‌కు సంబంధం ఉందని ఎన్ఐఏ నిరూపించలేక పోయిందని,. మిగతా కుట్రదారులకు డబ్బు ఇచ్చారనేందుకూ ఆధారాలు లేవని తెలిపారు. పేలుడుకు ముందురోజు రాజేంద్ర చౌదరి స్వయంగా మసీదుకు వెళ్లి బాంబు పెట్టారనేందుకు సైతం ఆధారాలు చూపలేకపోయిందన్నారు. ప్రధాన దర్యాప్తు అధికారి రాజా బాలాజీ ఇచ్చిన సాక్ష్యం కూడా పరస్పర విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 226 మంది సాక్షుల్లో 64 మంది తాము మొదట ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మళ్లీ సాక్ష్యం చెప్పారని వివరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. పది మంది నిందితులు.. 226 మంది సాక్షులు ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చారు. తొలుత దర్యాప్తు చేసిన సీబీఐ.. హిందూ అతివాద గ్రూపు పేలుళ్లకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించింది. 2010లో దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మలను అరెస్టు చేసింది. దేవేందర్ గుప్తా మొదటి నిందితుడిగా, లోకేశ్ శర్మను రెండో నిందితుడిగా చార్జిషీటు దాఖలు చేసింది. అనంతరం ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్లింది. విస్తృతంగా దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో జరిగిన దాడుల నుంచి సేకరించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని.. మరికొందరు నిందితులను అరెస్టు చేసి, చార్జిషీట్లు దాఖలు చేసింది. సందీప్ దంగే, రామచంద్ర కల్సాంగ్ర, సునీల్ జోషి, స్వామి అసీమానంద అలియాస్ నంబకుమార్ సర్కార్ అలియాస్ ఓంకారానంద్ అలియాస్ రాందాస్, భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్ అలియాస్ భరత్ భాయ్, రాజేంద్ర చౌదరి, తేజ్‌రామ్ పర్మార్, అమిత్ చౌహాన్లను తదుపరి నిందితులుగా చేర్చింది. ఇందులో ఐదుగురిపైనే అభియోగాలను నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి.. కేసు దర్యాప్తు సమయంలోనే హత్యకు గురికాగా.. సందీప్ దంగే, రామచంద్ర కల్సంగ్రల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్ పర్మార్, అమిత్ చౌహాన్‌లపై దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తంగా నిందితుల నేరాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ మొత్తం 226 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించింది. 396 ఎగ్జిబిట్లు, 28 మెటీరియల్ ఆబ్జెక్ట్స్‌ను కోర్టు ముందుంచింది. పేలని బాంబు ఇచ్చిన ఆధారంతో.. మక్కా మసీదులో బాంబు పేలుడు అనంతరం క్లూస్ టీం తనిఖీలు చేస్తుండగా.. పేలకుండా ఉన్న మరో బాంబు లభించింది. దానిని నిర్వీర్యం చేసిన క్లూస్ టీం బృందం.. అందులో టైమర్‌గా సిమ్‌కార్డులను వినియోగించినట్టు గుర్తించింది. అంటే తొలి బాంబును కూడా అలా సిమ్ ఆధారంగానే పేల్చినట్టు నిర్ధారించారు. అటు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా పేలుళ్లలోనూ అచ్చు ఇదే తరహాలో సిమ్ ఆధారంగా బాంబులు అమర్చినట్టు గుర్తించారు. దాంతో దర్యాప్తు అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్టు చేశారు. భారీగా బందోబస్తు.. మక్కా పేలుడు కేసు తీర్పు సందర్భంగా నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తీర్పునిచ్చిన జడ్జి రవీందర్‌రెడ్డి చాంబర్ వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయన ఇంటికి తిరిగి వెళ్లేంత వరకు కూడా బందోబస్తు కొనసాగింది. నిందితులపై అభియోగాలివే.. దేవేందర్ గుప్తా: బాంబు పేలుళ్లకు మిగతా నిందితులతో కలసి కుట్ర పన్నాడు. మనోజ్‌కుమార్ పేరుతో తప్పుడు స్కూల్ సర్టిఫికెట్, బాబూలాల్ యాదవ్ పేరుతో తప్పుడు రేషన్‌కార్డు తయారు చేశాడు. ఈ తప్పుడు రేషన్‌కార్డుతో డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. దీని ఆధారంగా సిమ్ కార్డు తీసుకున్నాడు. ఈ ఫోన్ నంబర్ ద్వారానే మిగతా నిందితులతో మాట్లాడాడు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి అజ్మీర్ దర్గా వద్ద ఎలా పేలుడు జరిపారో.. అదే తరహాలో మక్కా మసీదు వద్ద పేలుళ్లు జరిపారు. లోకేశ్ శర్మ: మొబైల్ ఫోన్లు సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మక్కా మసీదు పేలుళ్లు ఎలా జరపాలన్న స్కెచ్ రూపొందించింది ఇతనే. స్వామి అసీమానంద: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా.. మక్కా మసీదు, అజ్మీర్ దర్గాలలో పేలుళ్లు జరపాలని ప్రతిపాదించాడు. తన పథకాన్ని వివరించి రామచంద్ర కల్సాంగ్ర, భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్ల ద్వారా సిమ్ కార్డులు సంపాదించాడు. పేలుళ్ల తరువాత స్వామి ఓంకారానంద్గా మారుపేరుతో హరిద్వార్ సమీపంలోని ఆత్మాల్పూర్ బొంగ్లా గ్రామంలో దాక్కున్నాడు. పోలీసులు అసీమానందను అరెస్ట్ చేసి.. హరిద్వార్ చిరునామాతో ఉన్న ఓటర్, రేషన్ కార్డులను, నాబాకుమార్ సర్కార్ పేరుతో ఉన్న పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్: పేలుడు కుట్రకు సంబంధించి కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌లోని మహదేవ్నగర్లో ఉన్న భరత్ ఇంట్లోనే అందరూ భేటీ అయి పేలుడుకు ప్రణాళిక రూపొందించారు. అక్కడే పేలుళ్ల కోసం రామచంద్ర కల్సాంగ్రకు రూ.40 వేలు ఇచ్చారు. సునీల్ జోషికి రూ.25 వేలు ఇచ్చి పిస్టళ్లు, సిమ్ కార్డులు పొందారు. రాజేంద్ర చౌదరి: మక్కా మసీదులో బాంబు పెట్టిన ప్రధాన వ్యక్తి. 2007 ఏప్రిల్‌లో మరో వ్యక్తితో కలసి మక్కా మసీదు వద్ద రెక్కీ నిర్వహించాడు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు, మాలేగావ్ పేలుళ్ల కేసుల్లోనూ రాజేంద్ర నిందితుడు. జడ్జి రవీందర్‌రెడ్డి రాజీనామా! ఉదయం తీర్పు.. మధ్యాహ్నం రాజీనామా బెదిరింపుల వల్లేనంటున్న నాంపల్లి కోర్టు వర్గాలు రాజీనామాను ధ్రువీకరించని హైకోర్టు వర్గాలు సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుడు కేసును కొట్టేస్తూ ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జి రవీందర్‌రెడ్డి.. న్యాయాధికారి పోస్టుకు రాజీనామా చేసినట్లు తెలిసింది. ఉదయం 11.50 గంటలకు తీర్పునిచ్చిన ఆయన, మధ్యాహ్నం కల్లా రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను హైకోర్టుకు పంపినట్లు నాంపల్లి కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే రాజీనామా లేఖ విషయాన్ని హైకోర్టు వర్గాలు ధ్రువీకరించడం లేదు. ప్రస్తుతం రవీందర్‌రెడ్డి తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాకు దారి తీసిన కారణాలు ఏంటన్నది నిర్దిష్టంగా తెలియడం లేదు. ఆయన వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఆయన్ను సంప్రదించేందుకు ‘సాక్షి’ యత్నించగా.. మాట్లాడేందుకు నిరాకరించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో రవీందర్‌రెడ్డి రాజీనామా వార్త బయటకు రావడంతో సర్వత్రా దీనిపైనే చర్చ జరిగింది. రాజీనామాపై ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతున్నారు. తీర్పు అనంతరం బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందువల్లే రాజీనామా చేశారని నాంపల్లి కోర్టు వర్గాలు చెబుతున్నాయి. న్యాయాధికారుల డిమాండ్ల పరిష్కారం, హైకోర్టు అనుసరిస్తున్న కంపల్సరీ రిటైర్మెంట్ విషయాల్లో ఇతర న్యాయాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంతోనే ఆయన రాజీనామా చేశారని మరికొందరు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 226 మంది సాక్ష్యులను విచారణ చేపట్టింది. ఛార్జీషీట్లో 10 మంది పేర్లను చేర్చగా.. వారిలో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేవలం రెండే నిమిషాల్లో కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురు నిందితులు స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలలో ఏ ఒక్కరిపైనా ఆరోపణలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. దీంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే మిగతా వారిపై మాత్రం ఛార్జీ షీట్ కొనసాగుతుందని కోర్టు(A-5.సునీల్ జోషి మృతి చెందారు) తెలిపింది. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా.. ఐదుగురు మృతి చెందారు. అల్లర్లలో 58 మందికి గాయాలయ్యాయి. ఇక మక్కా బ్లాస్ట్ కేసులో 10 మంది నిందితులను గుర్తించిన ఎన్ఐఏ.. ఐదుగురి పేర్లను మాత్రం చార్జీషీట్లో చేర్చింది. హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నారన్న ఆరోపణలకు ప్రతీకారంగానే నిందితులు ఈ దాడులకు పాల్పడినట్లు ఎన్ఐఏ కోర్టుకి తెలిపింది. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో అలర్ట్ ప్రకటించిన పోలీస్ శాఖ.. పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ప్రత్యేక బలగాలతో భారీ భద్రత కట్టుదిట్టం చేసింది. మే 18, 2007 : మక్కా మసీదులో పేలుడు.. 9 మంది మృతి, 58 మందికి గాయాలు. 29 డిసెంబర్ 2007: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో సునీల్ చనిపోయాడు. జూన్ 2010: ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్లో సునీల్ జోషి పేరు నిందితుడిగా ఉంది నవంబర్ 19, 2010: హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) సీబీఐ అరెస్ట్ చేసింది. కొద్దిరోజులకే దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసింది. డిసెంబర్ 18, 2010: మక్కా మసీదు పేలుడు ఘటనలో తన పాత్రను అసీమానంద అంగీకరించాడు. 2011 డిసెంబర్ 3: గుజరాత్ వల్సాద్కు చెందిన భారత్ మోహన్‌లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్‌భాయి అరెస్ట్. ఏప్రిల్ 2011: కేసు విచారణ సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ)కి బదిలీ అయ్యింది. 2013 మార్చి 2: మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ అరెస్ట్ మార్చి 23, 2017: హైదరాబాద్ కోర్టు అసిమానందకు బెయిల్ మార్చి 31, 2017: ఏడేళ్ల తర్వాత అసిమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు ఏప్రిల్ 16, 2018: ఈ కేసులో ఐదుగురు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది ఎన్ఐఏ సమర్పించిన జాబితాలో నిందితులు పేర్లు... A-1. దేవేందర్ గుప్తా A-2.లోకేష్ శర్మ, A-6.స్వామి ఆసిమానందా A-7.భరత్ భాయ్ A-8.రాజేందర్ చౌదరి పరారీలో ఉన్న వారు. A-3.సందీప్ డాంగే A-4.రామచంద్ర కళా సంగ్రా A-10.అమిత్ చౌహన్. ఈ కేసులో చనిపోయిన వ్యక్తి. A-5.సునీల్ జోషి. ఈ కేసులో బెయిల్ పై ఉన్న వాళ్లు A-6 .స్వామి ఆసిమానందా A-7.భరత్ భాయ్. A-9.తేజ్ పరమార్ -
మక్కా మసీదులో ఘోర ప్రమాదం
-
మక్కా మసీదులో ఘోర ప్రమాదం
-
మక్కా మసీదులో ఘోర ప్రమాదం
- 107 మంది మృతి - మసీదుపై కూలిన భారీ క్రేన్ - 184 మందికి గాయాలు - క్షతగాత్రుల్లో 9 మంది భారతీయులు రియాద్: ముస్లింలకు అత్యంత పవిత్రస్థలమైన మక్కా మసీదులో శుక్రవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మసీదు ప్రాంగణాన్ని విస్తరించే పనుల్లో వాడుతున్న భారీ క్రేన్ పైభాగం కుప్పకూలి మసీదు ప్రాంగణంలో పడింది. 107 మంది మృత్యువాతపడగా... మరో 184 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌదీ అరేబియాలోని మక్కా మసీదును హజ్ యాత్రను పురస్కరించుకొని ఏటా లక్షలమంది సందర్శిస్తారు. కాబాకు నలువైపులా ప్రార్థనలు చేస్తారు. హజ్ యాత్ర ఇదే నెల ప్రారంభం కానుంది. కాబా మసీదు ప్రాంగణాన్ని విస్తరించేందుకు సౌదీ పనులు చేపట్టింది. స్టేడియంలా నిర్మాణాన్ని ప్రారంభించింది. ఒకేసారి 22 లక్షల మంది పట్టేలా 43 లక్షల చదరపు అడుగుల మేర ప్రాంగణాన్ని విస్తరిస్తున్నారు. నలుమూలలా భారీ క్రేన్లతో పనులు జరుగుతున్నాయి. ఒక క్రేన్ పైభాగం ఆకస్మాత్తుగా కూలిపోయి మసీదు ప్రాంగణంపై పడింది. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల కోసం భారీగా జనం రావడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. పలువురు రక్తమోడుతున్న గాయాలతో ఎటూ కదల్లేని స్థితిలో కూర్చుండిపోయారు. ప్రమాద ప్రాంతం భీతావహంగా కనిపించింది. దుర్ఘటన సమయంలో భారీ వాన కురుస్తోంది. క్షతగాత్రుల్లో 9 మంది భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. సౌదీ లోని భారత కాన్సు ల్ జనరల్ మక్కా వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, భారత డాక్టర్లు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారని... ఇప్పటిదాకా తొమ్మిది మంది భారతీయులు గాయపడినట్లు సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)