breaking news
Maurya
-
మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన దీపావళివేళ భక్తులు పూజించే లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో తన భార్యను పూజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్‌గా మారిన ఈ ఫొటోలపై మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎస్పీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో దీపావళి సందర్భంగా తన తన భార్యను పూజిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని ఏ మతం, కులం, జాతి, వర్ణం, వ్యవస్థలో పుట్టిన ఏ బిడ్డకైనా రెండు చేతులే ఉంటాయన్నారు. రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు ఉన్న మహిళకు.. నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, ఇరవై చేతులు, వెయ్యి చేతులు కలిగిన శిశువు ఇప్పటి వరకు పుట్టలేదన్నారు. నాలుగు చేతులతో లక్ష్మీదేవి ఎలా పుట్టింది? ఎవరైనా లక్ష్మీ దేవిని ఆరాధించాలనుకుంటే, దేవతలాంటి భార్యను పూజించండి. గౌరవించండి.. ఎందుకంటే ఆమె మీ కుటుంబ పోషణ కోసం పనిచేస్తూ, ఆనందం, శ్రేయస్సు అందిస్తూ, ఆహారం సంరక్షణ బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే! दीपोत्सव के अवसर पर अपनी पत्नी का पूजा व सम्मान करते हुए कहा कि पूरे विश्व के प्रत्येक धर्म, जाति, नस्ल, रंग व देश में पैदा होने वाले बच्चे के दो हाथ, दो पैर, दो कान, दो आंख, दो छिद्रों वाली नाक के साथ एक सिर, पेट व पीठ ही होती है, चार हाथ,आठ हाथ, दस हाथ, बीस हाथ व हजार हाथ वाला… pic.twitter.com/CP5AjKODfq — Swami Prasad Maurya (@SwamiPMaurya) November 12, 2023 -
‘అల్లరి’కి భయం లేదు!
‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్’ చిత్రాల తర్వాత ‘అల్లరి’ నరేశ్, జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. కృతిక, మౌర్యాని కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘అత్తారింటికి దారేది’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల తర్వాత మా బ్యానర్లో వస్తోన్న పూర్తి స్థాయి ఎంటర్టైనర్ ఇది. వినోదంతో పాటు హారర్ ఉంటుంది. బ్యాంకాక్‌లో తీసిన పాటలతో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నవంబర్ 11న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా బ్యానర్లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది’’ అని అన్నారు. ‘‘నరేశ్, నా కాంబినేషన్లో గతంలో వచ్చిన చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ చిత్రాల కంటే ఈ సినిమా విజయవంతమై, మాకు హ్యాట్రిక్ సక్సెస్ సాధించి పెడుతుందనే హోప్ ఉంది’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భోగవల్లి బాపినీడు.