‘గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం’
పాడేరు, న్యూస్‌లైన్ : గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని అరకు ఎంపీ కొత్తపల్లి గీత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఇక్కడి మోదకొండమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ నేతలు విజయోత్సవ సభను ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడు తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంటే తాను నడుస్తానన్నారు.
పార్టీ అధికారంలో లేనప్పటికీ ప్రతిపక్ష హోదాలో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. నెలకోసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని, ప్రతి నియోజకవర్గంలో పార్లమెంట్ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకుంటానన్నారు.
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రలోభాలకు గురిచేసినా మన్యం ప్రజలు వైఎస్సార్ సీపీ వెంటే నిలిచి తమకు పట్టం కట్టారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లేదనే బాధ ఎవరికీ వద్దని, అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉద్యమిస్తామన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలను క్రైస్తవ దైవసేవకు లు సత్కరించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.వి.జి.కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్య రాస బాల రాజు, పలు మండలాల జెడ్పీటీసీ సభ్యు లు పి.నూకరత్నం, కె.పద్మకుమారి, జి.నళినికృష్ణ, పాడేరు మండలలోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీపీ ఎస్.వి.రమణమూర్తి పాల్గొన్నారు.