సీఏ-సీపీటీ ఫలితాల్లో... మాస్టర్‌మైండ్స్ ప్రభంజనం
జాతీయ స్థాయిలో 2,3,8,10 ర్యాంకులు కైవసం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సోమవారం విడుదల చేసిన సీఏ-సీపీటీ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ సీఏ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి ప్రకాష్ చెప్పారు. బ్రాడీపేటలోని మాస్టర్‌మైండ్స్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఏ-సీపీటీ సిలబస్‌ను క్లిష్టతరం చేసిన తరువాత తొలిసారిగా జరిగిన పరీక్షల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని వివరించారు.
తమ విద్యార్థులు 2,2,3,8,10 ర్యాంకులు సాధించారని వెల్లడించారు. పి.సాయికిరణ్, వై.మనోజ్ రెడ్డి 200 మార్కులకు 186 మార్కులు సాధించి అఖిల భారత స్థాయిలో రెండవ ర్యాంకు కైవసం చేసుకున్నారని చెప్పారు. ఎం.సూర్యప్రకాశ్ 3వ ర్యాంకు, కేదారపు వింద్యావాహిని 8వ ర్యాంకు, డి.పూర్ణాంజనేయ సాయి 10వ ర్యాంకు సాధించారని తెలిపారు.
గతేడాది విడుదలైన సీఏ-సీపీటీ ఫలితాల్లో తమ విద్యార్థి బి.మురళీమోహన్ అఖిల భారత స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న అధ్యాపకులచే బోధన నిర్వహించడం మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థ ప్రత్యేకత అని చెప్పారు. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయనతోపాటు మరో డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ అభినందించారు.
మ్యాగ్నజీల్ విద్యార్థుల జయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్: సీఏ-సీపీటీ ఫలితాల్లో మ్యాగ్నజీల్ సీఏ విద్యాసంస్థ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని సంస్థ చైర్మన్ రేపాల రవికుమార్ చెప్పారు. బ్రాడీపేటలోని మ్యాగ్నజీల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 14న జరిగిన సీఏ-సీపీటీ పరీక్షలకు తమ సంస్థ నుంచి హాజరైన విద్యార్థులు అఖిల భారత స్థాయిలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత చెందారని వివరించారు.
95 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. అత్యుత్తమ ప్రమాణాలతో బోధన, స్టడీ షెడ్యూల్స్, ముందస్తు పరీక్షలు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల సారధ్యంలో తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలుపుకునే రీతిలో ఫలితాలు సాధించటానికి కృషి చేశామని వివరించారు. నూతన రాష్ట్ర ఆవిర్భావంతో సీఏ విద్యార్థులకు ఫైనాన్స్, టాక్సేషన్ రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. సీఏ-సీపీటీలో అర్హత సాధించిన విద్యార్థులు క్వాలిఫైడ్ సీఏలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయనతోపాటు సంస్థ డెరైక్టర్ రేపాల భానువిజేత, అకడమిక్ డీన్ వై.ఎల్.రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.
శ్రీమేధ సంచలన విజయం
గుంటూరు ఎడ్యుకేషన్: సీఏ-సీపీటీ ఫలితాల్లో శ్రీమేధ సీఏ విద్యాసంస్థల విద్యార్థులు సంచలన విజయం నమోదు చేశారని సంస్థ డెరైక్టర్ అన్నా నందకిషోర్ తెలిపారు. బ్రాడీపేటలోని శ్రీమేధ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీటీ ఫలితాల్లో తమ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారని వివరించారు.
గట్టు కార్తీక్ శర్మ 200 మార్కులకు 181 మార్కులు సాధించి అఖిల భారతస్థాయిలో 7వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడని చెప్పారు. వై.వెంకట సునీల్‌కుమార్ 177 మార్కులు, ఎం.వంశీకృష్ణ, 163 మార్కులు సాధించి తిరుగులేని విజయం అందుకున్నారన్నారు. గతంలో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో 2, 2, 4, 4, 8, 9, 9, 10 ర్యాంకులు కైవసం చేసుకున్నారని గుర్తు చేశారు.
అత్యుత్తమ స్టడీ మెటీరియల్, నిష్ణాతులైన అధ్యాపక బృందం, విద్యార్థుల నిరంతర కృషితో సీఏ, సీఎంఏ కోర్సుల్లో 80 శాతానికి పైగా ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. సీపీటీలో ఉత్తీర్ణత చెందని విద్యార్థులకు ఇంటెన్సివ్ శిక్షణ తరగతులను ఈ నెల 24 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. విజేతలను ఆయనతోపాటు మరో డెరైక్టర్ కేసీహెచ్.పవన్‌కుమార్, అధ్యాపకులు అభినందించారు.
శ్రీ మేధా(వి) విజయ ఢంకా
గుంటూరు ఎడ్యుకేషన్: సీఏ-సీపీటీ ఫలితాల్లో శ్రీమేధా(వి) విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయ ఢంకా మోగించారని సంస్థ గుంటూరు శాఖ డెరైక్టర్ ఎం.బాలస్వామి చెప్పారు. బ్రాడీపేటలోని సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు.
ఎం.రవికుమార్ 9వ ర్యాంక్, డి.హితేష్ జైన్ 10వ ర్యాంక్, ఎం.వి.ఎన్.అరవింద్ 10వ ర్యాంక్ సాధించారని వివరించారు. బి.మనోహర్ రెడ్డి 160 మార్కులు సాధించాడని తెలిపారు. సీఏ పరీక్షల్లో శ్రీమేధా(వి) యేటా జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తోందన్నారు. విద్యార్థులను లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. విద్యార్థులను ఆయనతోపాటు సంస్థ డెరైక్టర్ ఎం.విజయ్ అగర్వాల్, ఎం.సాగర్ అభినందించారు.
శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: సీఏ-సీపీటీ ఫలితాల్లో శ్రీచైతన్య సీఏ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని సంస్థ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, డీన్ శ్రీరాములు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియెట్‌తో పాటు సీఏ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు. పరీక్షకు హాజరైన వారిలో 73 శాతం మంది ఉత్తీర్ణులయ్యూరని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు.