breaking news
Marta Kostyuk
-
వింబుల్డన్ సెమీస్‌లో ఉక్రెయిన్ సంచలనం
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఉక్రెయిన్ సంచలనం మార్తా కొష్ట్యుక్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ కొష్ట్యుక్ 6-3, 6-2తో ఇటలీకి చెందిన 13వ సీడ్ జాస్మిన్ పవోలినిను మట్టికరిపించింది. కేవలం గంటా 9 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో కొష్ట్యుక్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు సెట్లలోనే మ్యాచ్‌ను కైవసం చేసకున్న కొష్ట్యుక్ 3 ఏస్‌లు సంధించడంతో పాటు 19 విన్నర్లు కొట్టగా, పవోలిని 8 విన్నర్లకే పరిమితమైంది. 26 అనవసర తప్పిదాలతో పవోలిని మూల్యం చెల్లించుకుంది. మరో క్వార్టర్స్‌లో లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 7-5తో ఎలిస్ మెర్టిన్స్ (బెల్జియం)పై సునాయాస విజయం సాధించి సెమీస్ చేరుకుంది. లిండా నొస్కోవాగురువారం జరగనున్న సెమీస్‌లో గాఫ్‌తో ముచ్కోవా, కొష్ట్యుక్తో నొస్కోవా తలపడనున్నారు. గత 22 మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి మాత్రమే చవిచూసిన కొష్ట్యుక్‌కు మేజర్ టోర్నీల్లో ఇది వరుసగా రెండో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లో మిర్రా ఆండ్రీవా చేతిలో కొష్ట్యుక్ ఓటమి చవిచూసింది. Marta Kostyuk's 96mph forehand. Unstoppable. 💥 pic.twitter.com/b65WxCl89e— Wimbledon (@Wimbledon) July 8, 2026 -
స్వియాటెక్‌కు కొస్టుక్ షాక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఈసారి సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ ఏడాది కొత్త చాంపియన్ అవతరించడం ఖరారు కాగా... మహిళల సింగిల్స్ విభాగంలోనూ వరుసగా రెండో ఏడాది కొత్త విజేత రావడం ఖాయమైంది. మహిళల సింగిల్స్ బరిలో మిగిలిన నాలుగుసార్లు చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు ఆదివారం అనూహ్య పరాజయం ఎదురైంది. దాంతో ఈసారీ మహిళల సింగిల్స్‌లో కొత్త క్వీన్ అవతరించనుంది. 15వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్) అద్భుత ఆటతీరుతో మెరిపించి 7–5, 6–1తో ‘బర్త్‌డే గర్ల్’ స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 2019 తర్వాత స్వియాటెక్ రెండోసారి ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. 2020లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన స్వియాటెక్ 2021లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. 2022, 2023, 2024లలో టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ఈ పోలాండ్ స్టార్...గత ఏడాది సెమీఫైనల్లో ఓడిపోయింది. 99 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కొస్టుక్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సర్వీస్‌లో 33 పాయింట్లు, రెండో సరీ్వస్‌లో 12 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 25 విన్నర్స్ కొట్టిన ఈ ఉక్రెయిన్ భామ, 27 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ ఒక్క ఏస్ కూడా కొట్టకుండానే, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 13 విన్నర్స్ కొట్టిన ఆమె, 39 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘నేనింకా షాక్‌లోనే ఉన్నా. నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ప్లేయర్‌ను ఓడించానంటే నమ్మశక్యంగా లేదు’ అని ఈ ఏడాది క్లే కోర్టు సీజన్లో ఓటమి రుచి చూడని కొస్టుక్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా), 18వ సీడ్ సొరానా కిర్స్టీ (రొమేనియా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్వితోలినా 4–6, 6–4, 6–0తో 11వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై, ఆండ్రీవా 6–3, 6–2తో జిల్ టెక్మన్ (స్విట్జర్లాండ్)పై, కిర్స్టీ 6–3, 7–6 (7/4)తో జియు వాంగ్ (చైనా)పై గెలిచారు. శనివారం జరిగిన మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–4, 6–7 (1/7), 4–6తో అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా) చేతిలో ఓటమి చవిచూసింది. క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) వరుసగా ఆరో ఏడాది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జెస్పర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)తో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 7–6 (7/3), 6–4, 6–1తో గెలుపొందాడు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) గాయంతో ఈ టోర్నీకి దూరంగా ఉండటం... ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లో... మాజీ విజేత, సెర్బియా దిగ్గజం జొకోవిచ్ మూడో రౌండ్లో వెనుదిరగడంతో... జ్వెరెవ్ టైటిల్ ఫేవరెట్‌గా అవతరించాడు. జ్వెరెవ్ తన స్థాయికి తగ్గట్టు ఆడితే పారిస్‌లో ‘గ్రాండ్‌స్లామ్ టైటిల్’ కలను నిజం చేసుకుంటాడు. 2025 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో.. 2024 ఫ్రెంచ్ ఓపెన్‌లో... 2020 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన జ్వెరెవ్ మూడుసార్లూ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. మరోవైపు స్పెయిన్ రైజింగ్ స్టార్ రాఫెల్ జొడార్ ఆడుతున్న రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల జొడార్ 4–6, 4–6, 6–1, 6–2, 6–2తో పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెగ్జాండ్రా పనోవా (రష్యా) ద్వయం 1–6, 3–6తో డెసిరె క్రాసిక్ (అమెరికా)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఐ డోంట్ కేర్: సబలెంకా రియాక్షన్ వైరల్
బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా కొత్త ఏడాదిని, కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించింది. బ్రిస్బేన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా.. మార్టా కొస్టుక్‌పై ఏకపక్ష విజయం సాధించింది. అయితే, మ్యాచ్ అనంతరం సబలెంకాతో కరచాలనం చేసేందుకు ఉక్రెయిన్‌కు చెందిన మార్టా నిరాకరించింది.ఉక్రెయిన్‌లో పరిస్థితుల నేపథ్యంలో రష్యా, బెలారస్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్‌కు దూరంగా ఉండాలని తాను పెట్టుకున్న నియమాన్ని ఇక్కడ కూడా 23 ఏళ్ల మార్టా పాటించింది. ఈ విషయంపై సబలెంకా తాజాగా స్పందించింది.నేను అసలు పట్టించుకోను‘‘అది ఆమె నిర్ణయం. అందుకు నేనేం చేయగలను?.. ఆమె షేక్‌హ్యాండ్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా నాకేమీ తేడా ఉండదు. నేనసలు ఆ విషయాన్నే పట్టించుకోను. ఒక్కసారి కోర్టులో దిగిన తర్వాత నా ధ్యాసంతా ఆట మీదే ఉంటుంది.కోర్టులో అడుగుపెట్టిన తర్వాత గెలవాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతాను. మర్టా లేదంటే జెస్సికా పెగులా.. నా ప్రత్యర్థిగా వీరిలో ఎవరు ఉన్నారన్నది ముఖ్యం కాదు. నా అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలవడం.. ట్రోఫీని అందుకోవడంపై మాత్రమే దృష్టి సారిస్తా.నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అథ్లెట్‌గా నా పనిని నేను సక్రమంగా పూర్తి చేస్తాను’’ అని సబలెంకా.. మార్టాకు పరోక్షంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కాగా 2022 నుంచి రష్యా, బెలారస్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్‌కు మార్టా దూరంగా ఉంటోంది. రూ. 1 కోటీ 93 లక్షలుఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా 6–4, 6–3తో మార్టా కొస్టుక్‌ను ఓడించింది.78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఒక ఏస్ సంధించింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. తొలి సర్వీస్‌లో 32 పాయింట్లకుగాను 26... రెండో సర్వీస్‌లో 20 పాయింట్లకుగాను 12 పాయింట్లు సంపాదించింది. ఇక సబలెంకా కెరీర్లో ఇది 22వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన బెలారస్ స్టార్‌కు 2,14,530 డాలర్ల (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్


