breaking news
marriage cheat
-
11 ఏళ్ల సహజీవనం.. మరో యువతిని పెళ్లాడిన కానిస్టేబుల్!
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఏకంగా పదకొండేళ్లు సహజీవనం చేసి మోసం చేసిన కానిస్టేబుల్ అరుణ్ కుమార్‌పై ఉప్పల్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తనకు ఇష్టం లేకుండా రెండుసార్లు గర్భస్రావం చేయించాడని, పెళ్లికి ముహూర్తాలు పెట్టి కూడా మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గత నెల ఆఖరి వారంలో ఈ కేసు నమోదు కాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన యువతితో అరుణ్‌కుమార్‌కు 2013లో పరిచయమైంది. 2014లో అరుణ్‌కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నమ్మిన తాను అతడితో సన్నిహితంగా మెలిగానని తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అరుణ్‌కుమార్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో ఆగస్టు 24న ఉదయం సుమారు 7.30 గంటలకు అతడి ఇంటికి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ వాచ్‌మెన్‌తో పాటు కుటుంబ సభ్యులను ఆరా తీయగా..అరుణ్‌కుమార్‌కు అప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తెలిసిందని పేర్కొన్నారు. అతడు ఈ ఏడాది జూలై 1న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని యువతి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం! -
పెళ్లి పేరుతో లక్షల్లో టోపీ
► మ్యాట్రిమొనీ వెబ్సైట్లలో తప్పుడు వివరాలు ► ఎన్ఆర్ఐతో వివాహం ► లక్షల్లో వసూలు హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించి పెళ్లి చేసుకొని మోసగించడమే కాకుండా ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన ప్రశాంత్ పరాంకుశం పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీ వెబ్సైట్లో రిజిష్టర్ చేసుకున్నాడు. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలోని హ్యుటెంట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్నానని, ఏడాది రూ.40 లక్షలు సంపాదిస్తానని, యూఎస్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వివరాలు పొందుపరిచాడు. కాగా విదేశాల్లో ఉంటున్న బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరానికి వచ్చిన సమయంలో అదే వెబ్సైట్లో పేరు రిజిష్టర్ చేసుకుంది. నిందితుడి ప్రొఫైల్ చూసి ఇష్టపడటంతో ఆమె కుటుంబసభ్యులు నేరుగా ప్రశాంత్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా అతను తనపేరున భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు చెప్పడంతో నమ్మిన వారు పెళ్లికి ఆమోదం తెలుపుతూ మార్చి 20న పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం చేతిలో నగదు లేదని నిందితుడు చెప్పడంతో బాధితురాలు రూ. నాలుగు లక్షలు అతని ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసింది. రూ. లక్ష నగదు చేతికిచ్చారు. బ్రాస్లెట్, రింగ్, దుస్తుల కోసం మరో రూ. 2 లక్షలు ముట్టజెప్పడంతో మియాపూర్‌లోని శ్రీకృష్ణ గ్రాండ్ హోటల్లో మార్చి 20న వారికి వివాహం జరిగింది. వివాహం అయిన వెంటనే బాధితురాలు మార్చి 25న అమెరికాకు వెళ్లింది. వీసా ప్రాసెసింగ్ చేసుకొని తాను కూడా అమెరికా వస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి అనారోగ్యంతో స్టార్ ఆస్పత్రిలో చేరానని రూ.30 లక్షల వరకు డబ్బు అవసరమని చెప్పడంతో బాధితురాలు విచారణ చేయగా అబద్ధమని తేలడమేగాక, మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుసుకుంది. తప్పుడు వివరాలు పొందుపరిచి పెళ్లిళ్ల పేరిట అమ్మాయిలను వంచిస్తున్నట్లు గుర్తించి డిసెంబర్ 7న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి 1,80,000 విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.


