breaking news
Marathi Beauty
-
రెంట్ ఇవ్వడానికి వెళ్తే.. రేట్ ఎంత అన్నాడు: ప్రముఖ నటి
ప్రముఖ సినీ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. మరాఠి హీరోయిన్ తేజస్విని పండిట్ వేధింపులకు గురైన విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తేజస్విని నటి జ్యోతి చందేకర్ కుమార్తె. హౌస్ రెంట్ ఇవ్వడానికి కార్పొరేటర్ ఇంటికి వెళ్తే.. తనతో గడిపేందుకు డైరెక్ట్‌గా రమ్మని పిలిచాడని తేజస్విని తెలిపింది. అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తాను వెంటనే అపార్ట్మెంట్ ఖాళీ చేసి వచ్చానని పేర్కొంది. తేజస్విని మాట్లాడుతూ.. '2009-10 ప్రాంతంలో నేను సింహగడ్ రోడ్లో (పుణెలో) అద్దె అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. అప్పట్లో నా సినిమాలు ఒకటి రెండు మాత్రమే విడుదలయ్యాయి. అపార్ట్మెంట్ ఓ కార్పొరేటర్‌కు చెందినది. నేను అద్దె చెల్లించడానికి అతని కార్యాలయానికి వెళ్లా. అతను నాకు నేరుగా ఆఫర్ ఇచ్చాడు. అక్కడే టేబుల్ మీద ఒక గ్లాసు నీరు ఉంది. నేను వెంటనే తీసుకుని అతని ముఖం మీద విసిరా. నేను అలాంటి పనులు చేయడానికి ఈ వృత్తిలోకి ప్రవేశించలేదు. నా వృత్తి కారణంగా, నా ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నందున ఇలా ప్రవర్తించారు. ఈ సంఘటన నాకు ఓ అనుభవం లాంటిది' అని అన్నారు. కాగా.. 2004లో కేదార్ షిండే అగా బాయి అరేచాతో తేజస్విని సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. -
ప్రేమించడానికి టైమ్ లేదు
ప్రేమించడానికి టైమ్ లేదంటోంది మరాఠీ బ్యూటీ డింపుల్ చోపాడే. ఆరంభంలోనే తమిళం, తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషల్లో చుట్టేస్తున్న ఈ అమ్మడు చెన్నైని మాత్రం బాగా ప్రేమిస్తోందట. మరి ఈమె గురించి కాస్త తెలుసుకుందాం. సినిమా పరిచయం గురించి? నేను మరాఠీ థియేటర్ ఆర్టిస్ట్‌ను. ఇదే సినీ రంగ ప్రవేశానికి తొలిమెట్టు. మరాఠీ నాటకాల్లో నటించడం చాలామంది చూశారు. అలా తొలుత కన్నడ చిత్ర పరిశ్రమలో తొలి అవకాశం వచ్చింది. అక్కడ బనిముత్తు అనే చిత్రంలో నటించాను. అది తొలి చిత్రం అయినా మొదట విడుదలైంది మాత్రం కోడె చిత్రం. ఆ తరువాత కన్నడంలో ఐదు చిత్రాలు, తమిళంలో యారుడా మహేశ్, కల్‌కండు, తెలుగులో రొమాన్స్ తదితర చిత్రాల్లో నటించాను. నేను మరాఠీ మోడల్ ఆర్టిస్ట్‌ను కావడంతో సినిమాల్లో చాలా గౌరవం లభిస్తోంది. ఏ భాష అయినా సంభాషణలు అర్థం చేసుకుని నటించగలుగుతున్నాను. నిజం చెప్పాలంటే నాటక రంగం సినిమాల్లో నటించడానికి చాలా హెల్ప్ అయ్యింది. సినిమా కోసం శిక్షణ పొందారా? సినిమానే జీవితంగా భావించినప్పుడు దాని గురించి కొంచెం అయినా తెలుసుకోవాలని ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ, గుర్రపు స్వారీ తదితర నటనకు ఏమేమి కావాలో అన్నీ నేర్చుకున్నాను. బీఏ చదవడం కూడా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చెన్నైలో మకాం పెడతారా? నేను చెన్నైని ప్రేమిస్తున్నాను. దక్షిణాదిలో తమిళ చిత్రాల్లోనే హీరోయిన్లకు నటనతో సత్తా చాటుకునే అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. నా వద్దకు కన్నడం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నా తమిళంలో వైవిధ్య భరిత చిత్రాలను చేయాలని ఆశిస్తున్నాను. వరుసగా మంచి అవకాశాలు వస్తే ఇక్కడే సెటిలవుతాను. డ్రీమ్ రోల్ అంటూ ఏమైనా ఉందా? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి. అంకిత భావంతో నటించాలి. దర్శకుడు చెప్పినట్లు నటిస్తే చాలని భావిస్తాను. ఇక నా మనసులోని మాట చెప్పాలంటే యాక్షన్ కథా పాత్రలో నటించాలనే కోరిక ఉంది. అందుకే మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి వాటిల్లో శిక్షణ పొందాను. విజయశాంతి నటించిన యాక్షన్ చిత్రాలు తరచూ చూస్తుంటాను. పోరా ట దృశ్యాల్లో ఆమె ఎలా నటించారో గమనిస్తాను. అదే విధంగా మూండ్రాం పిరై చిత్రం అంటే చాలా ఇష్టం. ఆ చిత్రంలో శ్రీదేవి పోషించిన పాత్ర లాంటిది చేయాలన్న ఆకాంక్ష ఉంది. బాయ్‌ఫ్రెండ్స్ ప్రేమ ఉన్నాయా? చిత్ర రంగంలోనూ, బయట కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఇప్పటి వరకు నేనెవరినీ ప్రేమించలేదు. అందుకు తగిన సమయం కూడా లేదు.మూడు భాషల్లో బిజీగా ఉన్నాను.