breaking news
mantis
-
యాపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో
భూపాలపల్లి: జిల్లాలోని మంజూర్నగర్కి చెందిన ఔత్సాహిక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్‌కుమార్ తీసిన ఓ ఫొటోను యాపిల్ సంస్థ తమ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పంచుకుంది. మంజూర్‌నగర్ ఎంసీ క్వార్టర్స్‌లో ఉండే నలిమెల అరుణ్‌కుమార్‌కు కళాశాలలో ఉన్నప్పటి నుంచే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉండేది. దీంతో అడవుల్లో పర్యటిస్తూ వివిధ రకాల వన్యప్రాణుల ఫొటోలు తీసేవాడు. కొద్దిరోజుల క్రితం భూపాలపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్క్‌లో మాంటీస్ అనే పురుగును తన ఐఫోన్ కెమెరాతో క్లిక్‌మనిపించాడు. ఈ ఫొటో యాపిల్ సంస్థ దృష్టికి వెళ్లడం, అది ఐఫోన్‌తో తీసింది కావడంతో ఆ సంస్థ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అంతేకాక లొకేషన్ భూపాలపల్లి అని ట్యాగ్ చేసింది. చదవండి: MLA Seethakka: ఎడ్లబండే ఎమ్మెల్యే కాన్వాయ్ కేటీఆర్‌ని సోనూ సూద్ ఏమి కోరారో తెలుసా? -
‘మగ పురుగు’కూ జై!
మగపురుగు... ఇటీవల ప్రతివారూ విరివిగా వాడుతున్న మాట ఇది. కానీ... ఓ మగవాణ్ణి పురుగు అన్నప్పుడల్లా ఎంత నిజమో కదా అనిపిస్తుంటుంది. ఓ మగపురుగుకు అంజలి ఘటిస్తూ, నివాళులర్పిస్తూ... తనను మగపురుగుగా అభివర్ణిస్తున్నందుకు నిజంగా ప్రతి మగవాడూ గర్వించాల్సిన మాట అది. పురుగు అంటే కీటకమని అర్థం. నిజమే... యదార్థ అర్థంలో తీసుకుంటే మగవాడు ఒక పురుగే. ఈ లోకంలోని చాలా మంది మగవాళ్లు మ్యాంటిస్ అనే కీటకంతో పోల్చదగ్గవారే. ఆడవాళ్ల తిట్లభాషలో చెప్పాలంటే పురుగుపుంగవులే. ఆడపురుగు కోసం అపరిమితంగా తాపత్రయ పడే బతుకు ఆ మగపురుగుది. ఆ పురుగే... మ్యాంటీస్ మగపురుగు. ఆడదాని కోసం పడి చచ్చిపోయే ప్రేమ ఆ పురుగుది. దాని ప్రేమ ఎంత తీవ్రమంటే... దానితో కలిసి ఉన్న ఆ కొద్ది క్షణాలే తనకు నూరేళ్లనుకునే తృప్తి దానిది. ఆడదాని ఒక్క అనుగ్రహపు చూపు కోసం నూరేళ్లూ నిండుకునేలా చేసుకునే బతుకు దానిది. అంతటి నిస్వార్థపుది ఆ పురుగు! తాను ముద్దిస్తే... తననే ముద్దగా మార్చుకొని ఆడపురుగు తినేస్తుంటే లెక్కచేయక తనను తాను ఆహారంగా అర్పించుకునే త్యాగ పురుగు... మా మ్యాంటీస్ మగ పురుగు. పైగా ‘ఆడదాని-ఆహారార్థం ఇదం శరీరం’ అంటూ తన ఒంటినే బిర్యానీగా ఆడపురుగుకు నైవేద్యం పెట్టే నిజమైన పురుగు... మా మంచి మగపురుగు! ఆడదాన్ని చూస్తే మగాళ్లకు మతిపోతుంది అంటారు. నిజమే మతినీ, మెదడునూ పోగొట్టుకునే జాతి మగపురుగులది. దాంట్లోనూ ఎంత పరోపకారం అంటే... తనను తింటే తిన్నదిగానీ సృష్టికార్యం కాస్తా మధ్యలోనే దెబ్బతింటే ఎలాగన్న ఆదుర్దా మగపురుగుది. ఇలాగైతే భవిష్యత్తులో తన జాతి ఎక్కడ అంతరించిపోతుందో అన్న ఆందోళనతో మెదడును తల నుంచి మొలకు దిగజార్చుకున్న ఆ త్యాగ పురుగు... నిజంగానే నికార్సైన మగమహాపురుగు!! వాస్తవం చెప్పాలంటే మానవ జన్మ ఎత్తాక, మగపుటక పుట్టాక మ్యాంటీస్లా బతికే పురుగులే ఈ లోకంలో ఎక్కువ. ఆ విషయం గ్రహించక... గ్రహించినా అంగీకరించక... మగాళ్లని పురుగులంటూ తిట్టే ఈ లోకంలోని పక్ష‘పాతకు’లందరికీ మా దండాలు. - యాసీన్