యాపిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో

Apple Instagram Share Mantis Photo Clicked By Bhupalpally Young Man - Sakshi

భూపాలపల్లి: జిల్లాలోని మంజూర్‌నగర్‌కి చెందిన ఔత్సాహిక వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్, డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ తీసిన ఓ ఫొటోను యాపిల్‌ సంస్థ తమ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో పంచుకుంది. మంజూర్‌నగర్‌ ఎంసీ క్వార్టర్స్‌లో ఉండే నలిమెల అరుణ్‌కుమార్‌కు కళాశాలలో ఉన్నప్పటి నుంచే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉండేది. దీంతో అడవుల్లో పర్యటిస్తూ వివిధ రకాల వన్యప్రాణుల ఫొటోలు తీసేవాడు.

కొద్దిరోజుల క్రితం భూపాలపల్లిలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఎకో పార్క్‌లో మాంటీస్‌ అనే పురుగును తన ఐఫోన్‌ కెమెరాతో క్లిక్‌మనిపించాడు. ఈ ఫొటో యాపిల్‌ సంస్థ దృష్టికి వెళ్లడం, అది ఐఫోన్‌తో తీసింది కావడంతో ఆ సంస్థ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అంతేకాక లొకేషన్‌ భూపాలపల్లి అని ట్యాగ్‌ చేసింది. 

చదవండి: 
MLA Seethakka: ఎడ్లబండే ఎమ్మెల్యే కాన్వాయ్‌

కేటీఆర్‌ని సోనూ సూద్‌ ఏమి కోరారో తెలుసా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top