breaking news
Manish Jaiswal
-
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
రాంచీ: జార్ఖండ్ బీజేపీ తనకు షోకాజ్ నోటీసులు పంపించటం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా అన్నారు. ఇటీవల ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని, పార్టీ క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనటంలేదని జార్ఖండ్ బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిపై బుధవారం జయంత్ సిన్హా స్పందిస్తూ జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరికి లేఖ రాశారు.‘‘జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ పంపిన షోకాజ్ నోటీసులు అందుకున్న నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అసలు తనను పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ర్యాలీలు, సంస్థాగత సమావేశాలకు కనీస ఆహ్వానం పంపలేదు. పార్టీ హజారీబాగ్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బరిలోకి దించుతున్నట్ల ప్రకంటించిన సమయంలో నా పూర్తి మద్దతు తెలియజేశా. మనీష్‌కు అభినందనలు తెలియజేశా. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ కొత్త అభ్యర్తికి మద్దతు ఇస్తానని తెలిపా. అయితే నేను ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే నాకు కచ్చితంగా సమాచారం అందించేది. జార్ఖండ్‌కు సంబంధించిన ఓ సీనియర్ గాని, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాకు ఎటువంటి పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలను పిలుపు రాలేదు’’ అని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరి ఆధిత్య సాహుకు లేఖ ద్వారా తెలిజేశారు.My response to Shri Aditya Sahu ji’s letter sent on May 20, 2024 pic.twitter.com/WfGIIyTvdz— Jayant Sinha (Modi Ka Parivar) (@jayantsinha) May 22, 2024 ఇక.. జయంత్ సిన్హా మార్చిలోనే తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని, ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరమే తాను ప్రాతినిధ్యంలో వహిస్తున్న హజారీబాగ్ పార్లమెంట్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బీజేపీ బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
హవ్వ! దండేసి దండం పెట్టేశారు
రాంచి: సాధారణంగా మరణించిన వారి ఫొటోలకు దండ వేసి దండం పెట్టడం ఆనవాయితీ.. అంతేకాదు బతికున్న వారి ఫొటోలకు దండం పెట్టడం, బొట్టు పెట్టడం, దండ వేయడాన్ని అశుభంగా, అవమానంగా కూడా భావిస్తాం. కానీ జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం ఏకంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫొటోకు దండ వేసి, తిలకం దిద్దేశారు. సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఇలా చేయడంతో అక్కడున్నవారంతా విస్తుపోయారు. ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని కోదర్మ జిల్లా ఒక పాఠశాలలో స్మార్ట్ క్లాసులను విద్యాశాఖమంత్రి నీరా యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడున్న అబ్దుల్ కలాం ఫొటోకు దండ వేసి, హారతి వెలిగించారు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. మంత్రికి అంతమాత్రం తెలియదా అని విమర్శలు గుప్పించారు. స్కూల్ హెడ్, బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైశ్వాల్ , మరికొంతమంది పెద్దల సమక్షంలోనే ఈ తంతు జరిగింది. ఈ వ్యవహారంలో విమర్శలు చెలరేగడంతో మంత్రి స్పందించారు. అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్టు అనీ,. అలాంటి గొప్ప వ్యక్తికి ఫోటోకి దండ వేసి గౌరవిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అందులో అంత అభ్యంతరంకరమైంది ఏముందంటూ తనను తాను సమర్ధించుకున్నారు మంత్రి నీరాయాదవ్. మరోవైపు పాఠశాలల్లో దేశనాయకులకు, రాజకీయ నాయకులకు దండ వేసి గౌరవించడం మామూలేనని మనీష్ , మంత్రిగారిని వెనకేసుకు రావడం కొసమెరుపు.