breaking news
Manipuri
-
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట జరుగుతున్న గోల, అరుపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన 55 ఏళ్ల మణిపురి సంగీత విద్వాంసుడు చోంగ్థమ్ విక్రమ్ సింగ్‌ను దారుణంగా కొట్టి చంపారు కొంతమంది దుండగులు. ఇంటి బయట పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది, దాబా సిబ్బందితో జరిగిన వివాదం చివరకు దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనాయి. ఆగ్నేయ ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలోక్రి వద్ద 17 ఏళ్లుగా ప్రైవేట్ సంగీత ఉపాధ్యాయుడిగా, గిటారిస్ట్‌గా పనిచేస్తున్న చోంగ్థమ్ విక్రమ్‌ను కొందరు వ్యక్తులు కొట్టి హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆగ్నేయ ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి ఆదివారం అర్ధరాత్రి విక్రమ్ చెత్త పారవేయడానికి తన మూడవ అంతస్తులోని ఫ్లాట్ నుండి కిందికి వెళ్ళారు. తన ఇంటి వద్ద దాబా కార్మికులు, డెలివరీ బాయ్స్ చేస్తున్న అరుపులు, గోల భరించలేక విక్రమ్ సింగ్ కిందకు వచ్చి గోల చేయ వద్దని కోరారు. ఈ క్రమంలో జరిగిన వివాదంతో రెచ్చిపోయిన ఎనిమిది మంది ఆయనపై దాడికి దిగారు. అపార్ట్మెంట్లో థర్డ్ఫ్లోర్దాకా తరుముకుంటూ వచ్చి కారిడార్‌లో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విక్రమ్‌ను ఆయన కుమారుడు యైఫాబా సమీపంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గాయపడిన విక్రమ్‌ను మెట్ల మీదుగా మోసుకెళ్తున్న దృశ్యాలు, దాడి చేసినవారు అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైనాయి. ఈ కేసులో ఏడుగురుని అరెస్టు చేయడంతో పాటు ఒక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానిక హోటళ్లలో ఫుడ్ ప్యాకింగ్, డెలివరీ పనులు చేస్తున్నారు. అరెస్టు అయిన వారిని భరత్ కుమార్(19), ప్రమోద్(26), రంజాన్ ఖాన్(22), విజయ్(36), దీపాంశు (21), మోహన్ విశ్వకర్మ(32), మన్ను(26) గా గుర్తించారు.Chongtham Vikram Singh ji, a renowned musician from Manipur, went downstairs to ask some men to lower the noise outside his home. He was beaten to death for it.A father, killed outside his own home, in his own country's capital. After many such incidents, every Northeast family…— Rahul Gandhi (@RahulGandhi) September 8, 2026Manipuri musician beaten to death for objecting to shouting, drinking outside his Delhi flat; 7 held#ChongthamVikramSingh pic.twitter.com/U0fZBjClqa— Raajeev Chopra (@Raajeev_Chopra) September 7, 2026చోంగ్థమ్ విక్రమ్ సింగ్ మణిపూర్‌లో పేరుగాంచిన సంగీత విద్వాంసుడు. ఆయన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు చోంగ్థమ్ ఓంగ్బి కమలా దేవి కుమారుడు. అలాగే భారత్‌కు చెందిన మొదటి బాఫ్టా (BAFTA) అవార్డు పొందిన చిత్ర దర్శకురాలు లక్ష్మీప్రియ దేవికి విక్రమ్ వరుసకు సోదరుడు అవుతారు. ఆయన ఢిల్లీలో ఒక మ్యూజిక్ స్కూల్‌ను కూడా నడుపుతున్నారు. ఈ ఘటన అనంతరం, మణిపురి సమాజ సభ్యులు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్ఈ ఘటన సమయంలో అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్ డిప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు బాధితుడి కుటుంబాన్ని, కమ్యూనిటీ సభ్యులను కలిసి చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సింగ్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణంహోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖపై రాహుల్ గాంధీ ఆగ్రహంలోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చోంగ్థమ్ విక్రమ్ సింగ్ హత్యను తీవ్రంగా ఖండించారు. విక్రమ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన హోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులు ఏమి చేస్తున్నారని మండి పడ్డారు. సత్వరమే విచారణజరిపి దోషులను శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు.ఈ హత్యను మద్యం మత్తులో జరిగిన హింసాత్మక ఘటనగా కొట్టిపారేయకూడదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా అన్నారు. పెద్ద శబ్దంతో సంగీతం, బహిరంగ గొడవలు, నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి వాటిని ఏళ్లుగా సహించడం వల్లే ఈ స్థితికి దారితీసిందన్నారు. ఢిల్లీలోని తన ఇంటి బయట శబ్ద కాలుష్యంపై అభ్యంతరం చెప్పినందుకు సింగ్‌ను కొట్టి చంపారని ఖేరా అన్నారు. ఇటువంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా నిబంధనలను స్థిరంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.THIS IS SHOCKING🚨😡Delhi.Modi’s capital.BJP’s city.Manipuri musician Chongtham Vikram Singhobjected to drunk boys making noise outside his home.They beat him on the road.Chased him into his third-floor flat.Beat him again.Hours later, he was dead in hospital.His… pic.twitter.com/QN3cr5TV7x— The Rebel (@TheRebel_IN) September 8, 2026ఇదీ చదవండి: రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే! -
చరిత్ర సృష్టించిన బూంగ్
భారతీయ చిత్రం ‘బూంగ్’ చరిత్ర సృష్టించింది. లండన్ లో జరిగిన 79వ ‘బాఫ్టా’ (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుల ప్రదానోత్సవంలో ‘బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్’ విభాగంలో అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే ‘బాఫ్టా’లో తొలి అవార్డు సాధించిన మణిపుర్ సినిమా కూడా ఇదే. ఈ విభాగంలో ‘జూటోపియా 2’, ‘లిలో – స్టిచ్’, ‘ఆర్కో’ వంటి హాలీవుడ్ చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నప్పటికీ ‘బూంగ్’ అవార్డును గెలుచుకోవడం విశేషం.బూంగ్ కథ ఏంటంటే...గుగున్ కిప్జెన్ టైటిల్ రోల్లో, బాలా హిజామ్ కీలక పాత్రలో నటించిన మణిçపుర్ చిత్రం ‘బూంగ్’. లక్ష్మీ ప్రియా దేవి దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిలిం ఇది. ఫర్హాన్ అక్తర్, వికేష్ భూతాని, అలాన్ మెక్ అలెక్స్, రితేష్ సిధ్వాని, షుజాత్ వ్యాపారి నిర్మించారు. ఈ సినిమాని 2024లో కెనడాలో జరిగిన 49వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి ప్రదర్శించారు. 2025 సెప్టెంబరు 19న ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేశారు. తన తల్లిదండ్రులు మందాకిని, జాయ్కుమార్లను కలిపేందుకు బూంగ్ అనే పాఠశాల విద్యార్థి తన స్వస్థలం నుంచి మయన్మార్ సరిహద్దు వరకు చేసిన సాహసోపేతమైన భావోద్వేగ ప్రయాణంతో ఈ మూవీ సాగుతుంది. మణిపుర్లో శాంతి నెలకొనాలి: లక్ష్మీప్రియా దేవి ‘బాఫ్టా’ అవార్డు స్వీకరించిన అనంతరం భావోద్వేగంతో మాట్లాడారు లక్ష్మీప్రియా. ‘‘మేం ఎంతో కష్టపడుతూ ఓ పర్వతం ఎక్కుతున్నది ఫస్ట్ ప్లేస్ కోసమని మేం ఈ వేదికపైకి వచ్చాక అర్థం అయింది. మా చిన్న సినిమాపై ఇంతటి ప్రేమను వ్యక్తం చేసిన జ్యూరీ సభ్యులకు, బాఫ్టాకు థ్యాంక్స్. భారతదేశంలోని మణిçపుర్ నా మాతృభూమి. అక్కడ తిరిగి శాంతి నెలకొనాలని దేవుణ్ణిప్రార్థిస్తున్నానని చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలనుకుంటున్నాను. సినిమాలోని బాల నటులతో సహా, మణిపూర్‌లోని పిల్లలందరూ వారి ఆనందాన్ని, వారి కలలను తిరిగి పొందాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ప్రధాని మోదీ ప్రశంస‘‘బూంగ్’ సినిమాతో అసోసియేట్ అయిన అందరికీ శుభాకాంక్షలు. నిజంగా ఆనందమైన క్షణాలు ఇవి. ముఖ్యంగా మణిపూర్‌కు. అలాగే దేశంలోని అపారమైన సృజనాత్మక ప్రతిభ హైలైట్ అవుతుంది’’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోది ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అలాగే పలువురు భారత సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆలియా సందడి‘బాఫ్టా’ అవార్డ్స్‌లో బాలీవుడ్ నటి ఆలియా భట్ సందడి చేశారు. ‘బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్’ విభాగంలో ‘సెంటిమెంటల్ వేల్యూ’ యూనిట్‌కు అవార్డు అందించారు. ఈ అవార్డ్స్‌లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా నిలవడంతో పాటు అత్యధికంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. చిత్ర దర్శకుడు పాల్థామస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. రాబర్ట్ అరమాయో (ఐ స్వయిర్ సినిమాకు) ఉత్తమ నటుడిగా నిలవగా, జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా నిలిచి (‘హామ్నెట్’ చిత్రానికిగాను).. బాఫ్టా లీడ్ యాక్ట్రస్ అవార్డు గెలుచుకున్న తొలి ఐరిస్ మహిళగా రికార్డు సాధించారు. -
'మొదటిసారి అక్కడే కలుసుకున్నాం'.. ప్రియురాలితో పెళ్లిపై రణ్‌దీప్!
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా పెళ్లిబంధంలోకి అడుగు పెడుతున్నారు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను నవంబర్ 29న పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సరదాగా కనిపించారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ప్రియురాలి సంప్రదాయంలోనే వీరి పెళ్లి వేడుక జరగబోతోంది. మరి కొన్ని గంటల్లో మూడుముళ్లతో ఒక్కటి కాబోతున్న ఈ జంట పెళ్లికి ముందు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లిన్ లైష్రామ్ పెళ్లికి ముందు ఎలా కలుసుకున్నారో రణ్‌దీప్ గుర్తు చేసుకున్నారు రణ్‌దీప్ మాట్లాడుతూ.. 'వధువు సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం మాత్రమే గౌరవప్రదమని నేను భావించా. మైటీ సంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహాల్లో వరుడు చాలా సేపు కూర్చోవాలని విన్నా. ఆ సంప్రదాయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా జీవిత భాగస్వామి సంస్కృతిపై గౌరవంతోనే ఈ రోజు ఇక్కడ ఉన్నా. మణిపురి సంప్రదాయాలను ఆస్వాదిస్తున్నా. నేను, లిన్ మణిపురి సంస్కృతి గురించి మాట్లాడుకునేవాళ్లం. భవిష్యత్తులో మా జంట పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. రణదీప్, లిన్ ప్రేమకథ లిన్ లైష్రామ్‌తో పరిచయంపై చెబుతూ.. 'మేము చాలా కాలంగా స్నేహితులం. థియేటర్లలో ఉన్నప్పుడే కలిశాం. మా మధ్య మంచి స్నేహం ఉంది. అదే ఇప్పుడు పెళ్లిబంధంగా మారింది' అని అన్నారు. కాగా.. నసీరుద్దీన్ షా థియేటర్ గ్రూప్‌లో రణదీప్‌ను కలిశానని లిన్ తెలిపింది. అక్కడ రణదీప్ తన సీనియర్ అని వెల్లడించింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఇవాళ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. -
జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధం!
Election Rallies Ban Extended Till Jan 31: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధం కొనసాగుతుందని ఎలక్షన్ కమీషన్(ఈసీ) పేర్కొంది. ఈ మేరకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ప్రచార ర్యాలీలు నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. అంతేకాదు దేశంలోని కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా శనివారం రోడ్‌షోలు, ర్యాలీల పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ముఖ్య ఆరోగ్య కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలను మొదట జనవరి 15 వరకు నిషేధించిన తదుపరి మళ్లీ జనవరి 22 వరకు ఆ నిషేధాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాజకీయ పార్టీల భౌతిక బహిరంగ సభలకు లేదా పోటీ చేసే అభ్యర్థులకు జనవరి 28 నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం ఫిబ్రవరి 1 నుంచి సడలింపులను అనుమతించింది. పైగా కోవిడ్-19 ఆంక్షల మేరకు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాలలో ప్రచారం కోసం అనుమతించిన భద్రతా సిబ్బంది, వీడియోవ్యాన్‌లను మినహాయించి, ఇంటింటికీ ప్రచారం కోసం ఐదుగురు వ్యక్తుల పరిమితిని 10కి పెంచినట్లు తెలిపింది. (చదవండి: బలమైన స్థానం నుంచే పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్!) -
భార్య ఆచూకీ అడిగినందుకు.. చేతివేళ్లు విరిచి..
లక్నో : న్యాయం కోసం పోలీసు స్టేషను గడప తొక్కిన ఓ దళిత వ్యక్తి పట్ల రక్షకభటులు కర్కశంగా ప్రవర్తించారు. తన భార్య ఆచూకీ కనుక్కోవాలని ఫిర్యాదు చేసిన అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మనిపురి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు... బులంద్‌షహర్‌కు చెందిన ఓ 48 ఏళ్ల దళిత వ్యక్తి తన భార్యతో కలిసి శుక్రవారం రాత్రి బైక్‌పై బంధువుల ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో కారులో ఆ దంపతులను వెంబడించిన కొంతమంది దుండగులు అతడిని కొట్టి.. భార్యను తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. అయితే అతడి ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. బాధితుడినే నిందితుడిగా పేర్కొంటూ తీవ్రంగా కొట్టారు. అనంతరం తన భార్యను తానే చంపానని స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అతడి భార్య గుర్తు తెలియని దుండగులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. అయినప్పటికీ పోలీసులు ఆమె భర్తనే నిందితుడంటూ చేతివేళ్లు విరిచేశారు. కాగా ఈ ఘటనపై మనిపురి ఎస్పీ అజయ్ శంకర్ రాయ్ తీవ్రంగా స్పందించారు. బాధితుడి కాళ్లు, నడుముపై తీవ్ర గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఘటనకు కారణమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే బాధితుడి భార్య ఆరోపించినట్లుగా ఆమెపై అత్యాచారం జరుగలేదని వైద్యులు ధ్రువీకరించినట్లు తేలడంతో ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
రూ.100 కోసం పోలీసులు ఇద్దరి ప్రాణాలు తీశారు...!
మణిపురిః పదిహేను రూపాయలకోసం దళిత దంపతులను నరికి చంపిన ఘటన మరువక ముందే.. ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. 100 రూపాయలు లంచం ఇవ్వనందుకు ఇద్దరు కూలీలపై దాడి చేసి చంపిన పోలీసుల దాష్టీకం శుక్రవారం మణిపురి ప్రాంతంలో కలకలం రేపింది. ఇటుకలతో వెడుతున్న ట్రాక్టర్ ను ఆపిన పోలీసులు డ్రైవర్ వద్ద లంచం డిమాండ్ చేశారు. అతడు ఇచ్చేందుకు నిరాకరించడంతో కూలీలకు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఘటనాస్థలినుంచీ ఇద్దరు తప్పించుకొని పారిపోగా మరో ఇద్దరు కూలీలు పోలీసు దెబ్బలకు ప్రాణాలు కోల్పోగా వారిని దగ్గరలోనే ఉన్న చెరువులో పడేసినట్లు తెలుస్తోంది. చెరువులో తేలుతూ కనిపించిన ఇద్దరు కూలీల మృతదేహాలు.. ఉత్తరప్రదేశ్ మణిపురి జిల్లా ఘిరార్ ప్రాంతంలో తీవ్ర ఆందోళనను రేపింది. మృతదేహాలను బయటకు తెచ్చిన కుటుంబ సభ్యులతోపాటు, గ్రామస్థులు మృతుల శవాలతో రహదారులు దిగ్బంధించి ఆందోళనకు దిగారు. 100 రూపాయల లంచంకోసం పోలీసులు చేసిన దౌర్జన్యానికి అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం మణిపురి ఎస్పీ దేవరంజన్ వర్మ గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన ఇద్దరు హోం గార్డులతో సహా ఆరుగురు పోలీసులపై ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేశామని, దర్యాప్తు అనంతరం నిందితులపై యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ఇటుకలు లోడ్ చేసిన ట్రక్ తో పాటు ప్రయాణిస్తున్న నలుగురు కూలీలను పోలీసులు ఘిరార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చెక్ పోస్టువద్ద శుక్రవారం ఉదయం అడ్డుకుని, వారివద్దనుంచీ 100 రూపాయలు లంచం డిమాండ్ చేశారని, డ్రైవర్ లంచం ఇచ్చేందుకు నిరాకరించడంతో గొడవ మొదలైనట్లు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ఘటనాస్థలం నుంచీ ఇద్దరు తప్పించుకోగా.. మరోఇద్దర్నిపోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే వారు చనిపోయారని అనంతరం వారి మృతదేహాలను పోలీసులు పక్కనే ఉన్న చెరువులో పడేసినట్లు కంప్లైంట్ లో వివరించారు. మృతదేహాలు చెరువులో కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. -
ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లు, 21 మంది అరెస్టు
లక్నో: ఉత్తర ప్రదేశ్ మణిపూరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆవులను చంపేస్తున్నారనే వదంతులు వ్యాపించడంతో హింస చెలరేగింది. రాష్ట్ర రాజధాని లక్నోకి ఆగ్రాకి సమీపంలో ఈ అల్లర్లు చెలరేగాయి. ఆవులను వధించారని, సమీప పొలాల్లో వాటి కళేబరాలు పడివున్నాయనే పుకార్లు చెలరేగడంతో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు పలుషాపులను ధ్వంసం చేశారు. రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవు మాంసం అమ్ముతున్నారనే వార్తల నేపథ్యంలో లల్లా, షాఫిక్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. గుంపునుంచి వారిని విడిదీసి స్టేషన్‌కు తరలిస్తుండగా పోలీసు వాహనంపై దాడి చేసిన వారిని బయటకు లాగి పడేశారు. దీంతో అ దనపు బలగాలను రప్పించారు. డీఐజీ లక్ష్మీ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప రిస్థితిని అదుపు చేశారు. తమ విచారణలో ఇవన్నీ పుకార్లని తేలాయని జిల్లా మాజిస్ట్రేట్ ప్రకటించారు. ఈ కేసులో 21 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా డీఎస్పీ ని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కాగా ఉత్తర ప్రదేశ్ దాద్రి లో ఆవు మాంసం అమ్ముతున్నాడనే అనుమానంతో 52 ఏళ్ల వృద్ధుణ్ని కొట్టి చంపిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. -
న్యూఢిల్లీలో 'మరో మణిపురి' దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మణిపురికీ చెందిన జింగ్రామ్ కెన్గో (33)ను ఆగంతకులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆగంతకులు పరారైయ్యారు. జింగ్రామ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హస్తినలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో గత రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య దొంగతనం కోసం చేసినదిగా లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. జింగ్రామ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. పీహెచ్డీ చేసేందుకు మృతుడు జింగ్రామ్ నెల క్రితమే మణిపూర్ నుంచి హస్తినకు తరలి వచ్చాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో జింగ్రామ్ పీహెచ్డీ చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
అప్పుడు నిడో తానియా....ఇప్పుడు షాలోని
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. మణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని ఐదారుగురు దుండగులు తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. ఈ ఘటన కోట్లా ముబారక్పూర్ ప్రాంతంలోజరిగింది. 30ఏళ్ల షాలోని అనే వ్యక్తి తన స్నేహితుడి నివాసం నుంచి తిరిగి వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈఘటనపై డీసీపీ బీఎస్ జైశ్వాల్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. షాలోనిపై అయిదారుగురు దాడి చేసినట్లు చెప్పారు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపారు. కాగా షాలోని ప్రస్తుతం నిరుద్యోగి. అతడు మునిర్కా నివాసం ఉంటున్నాడు. కాగా ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా అనే విద్యార్థి సైతం ఇదే తరహాలో దుండగుల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి మరణించాడు. -
ప్రమాదవశాత్తూ ఇంటిగోడ కూలి ఐదుగురు మృతి
మణిపురి: ప్రమాదవశాత్తూ ఓ ఇంటి గోడ కూలి ఐదురుగు కుటుంబ సభ్యులు దుర్మరణం పాలైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మణిపురి జిల్లా ఒన్హా గ్రామంలో చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు , అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను రిస్క్యూ టీం వెలికితీశారు. వారిలో విర్మా దేవి(70), మినా దేవి(35), ఆమె కుమారుడు రాహుల్ (17), ఇద్దరు ఆడపిల్లలు శశి(14), శివానీ(9)లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, మృతిచెందిన వారి కుటుంబానికి లక్షన్నర రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రకటించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ వీకే పన్వర్ పేర్కొన్నారు.


