శబరిమల ఆలయం మూసివేత
కేరళ: శబరిమలలో అత్యంత పవిత్రమైన 'మండలపూజ' శనివారం ముగిసింది. పూజ ముగిసిన అనంతరం దేవాలయాన్ని మూసివేశారు. 'మకరవిలక్కు' (మకర జ్యోతి) కోసం ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు దేవాలయాన్ని తెరుస్తారు. మండల పూజ సందర్భంగా కేరళ నలుమూలల నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు.
దేవాలయ అర్చకులు మధ్యాహ్నం మండలపూజ చేశారు. అనంతరం సాయంత్రం దీపారధన చేశారు. ఈ సీజన్ లో దేవాలయానికి రికార్డు స్థాయిలో 141.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోల్చితే 14 కోట్ల రూపాయలు ఆదనంగా లభించింది.