breaking news
Manalo Okadu
-
'మనలో ఒకడు' నిర్మాతల మరో ప్రయత్నం
మనలో ఒకడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన యుని క్రాఫ్ట్ మూవీస్, తన బ్యానర్ లో రెండో సినిమాను ఎనౌన్స్ చేసింది. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన మనలో ఒకడు సినిమాతో అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత గురజాల జగన్ మోహన్. ప్రస్తుతం ఆయన తన రెండో ప్రయత్నంగా సిద్ధేశ్వర్ మనోజ్ దర్శకత్వంలో సినిమాను ఎనౌన్స్ చేశారు. దర్శకుడు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రియ ప్రేమలో ప్రేమ్ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయం అయ్యాడు సిద్దేశ్వర్ మనోజ్. తొలి ప్రయత్నంగా లవ్ స్టోరిని ఎంచుకున్న మనోజ్, రెండో సినిమాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నారు. -
మీడియాతో ఢీ
‘‘సమాజంలో ఎవరైనా మా ముందు తలదించాల్సిందేననే ఓ మీడియా అధినేతతో మనలో ఒకడు, ఓ సామన్య అధ్యాపకుడు ఢీ అంటే ఢీ అంటూ తలపడితే.. ఏం జరిగిందనే కథతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మనలో ఒకడు’. జగన్మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయాలను కుంటున్నారు. ‘‘కృష్ణమూర్తిగా ఆర్పీ, మీడియా అధినేతగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది’’ అని నిర్మాత అన్నారు. ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి పాటలు: చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, కెమేరా: ఎస్.జె.సిద్ధార్థ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాల సుబ్రమణ్యం.