Malti Marie
-
ప్రెగ్నెన్సీ కష్టాలు చూశా.. తనే నా మిరాకిల్ బేబీ: ప్రియాంక
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2018లో సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరీ జన్మించింది. అయితే పుట్టినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా లేకపోగా ఆమెకు రక్తమార్పిడి చేయాల్సి వచ్చింది. పొత్తిళ్లలో ఎత్తుకుని నవ్వులు పంచాల్సిన చిన్నారి ఆపరేషన్ థియేటర్లో పోరాడుతుంటే ప్రియాంక దంపతుల మనసు తల్లడిల్లిపోయింది. కానీ, వీరి ప్రార్థనలు ఫలించి మాల్తీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చింది. మిరాకిల్ బేబీఆనాటి సంగతులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది ప్రియాంక చోప్రా. ప్రియాంక మాట్లాడుతూ.. నాకు ప్రెగ్నెన్సీలు కలిసిరాలేదు. చాలా కష్టాలు చూశాను. అప్పుడు నాకు (సరోగసి ద్వారా) మిరాకిల్ బేబీ పుట్టింది. తను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన మరుక్షణం నాకింక ఏమీ కనిపించలేదు. సమస్తం ఆగిపోయినట్లే అనిపించింది. మాల్తీ ఏం చేస్తుందో? కాకపోతే తనగురించి ఎప్పటికీ భయపడుతూనే ఉంటాను. తను స్కూల్లో ఉన్నా.. నేను వేరే దేశంలో ఉన్నా.. మాల్తీ ఏం చేస్తుందో? ఎలా ఉందో? అని నా గుండె తనకోసమే కొట్టుకుంటూ ఉంటుంది. తను జోక్స్ చెప్తుంది, గొంతెత్తి పాడుతుంది. నన్ను, నా భర్తను, మా కుటుంబం మొత్తాన్ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. నా జీవితంలో తనే గొప్ప బహుమతి. నా ఆలోచనంతా తన చుట్టూనే..తను వచ్చాకే నా ప్రాధాన్యతలన్నీ మారిపోయాయి. మొదటి, చివరి ఆలోచన తన గురించే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ప్రియాంక ఇటీవలే ద బ్లఫ్ అనే హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం వారణాసి అనే సినిమా చేస్తోంది. రాజమౌళి దర్శకత్వం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.చదవండి: కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా! -
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. కానీ, బాలీవుడ్లో మాత్రం పెళ్లయ్యాకే కాదు, తల్లయ్యాక కూడా హీరోయిన్లు ఓ వెలుగు వెలుగుతున్నారు. దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి పలువురు హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చిన ప్రియాంక చోప్రా కూడా అంతే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది.నా కూతురే ఒక అద్భుతంహీరోయిన్ ప్రియాంక చోప్రా- సింగర్ నిక్ జోనస్ దంపతులకు 2022లో కూతురు మాల్తీ మేరీ చోప్రా జన్మించింది. అయితే మాల్తీ మూడు నెలలు ముందుగా పుట్టిందని, అప్పుడు చాలా బాధ అనుభవించామంటున్నాడు నిక్ జోనస్. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో నిక్ జోనస్ మాట్లాడుతూ.. 'నా కూతురు ఒక అద్భుతమనే చెప్పాలి. ఇటీవలే తనకు నాలుగేళ్లు నిండాయి. కిలో కంటే తక్కువ బరువుభవిష్యత్తులో తను గొప్ప స్థాయికి ఎదుగుతుంది. తను చేసే పనులన్నీ నేను కళ్లారా చూస్తూ ఆస్వాదించాలి. తన జననం అంత ఈజీగా జరగలేదు. సరోగసి ద్వారా బిడ్డను కన్నాం. ఆ తల్లికి 2022 ఏప్రిల్‌లో డెలివరీ డేట్ ఇచ్చారు. తీరా డెలివరీ ముందే అవొచ్చన్నారు. కిలో కంటే తక్కువ బరువుతో పాప పుట్టింది. అప్పుడంతా కరోనా కాలం. పుట్టిన మూడు నెలలకే మాల్తీ అనారోగ్యంపాలైంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. ఫలించిన నిరీక్షణమూడున్నర నెలల్లో ఆరుసార్లు రక్తమార్పిడి చేశారు. నేను, నా భార్య రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ప్రియాంక సానుకూల దృక్పథంతో చాలా ధైర్యంగా నిలబడింది. ఈ విషయంలో తనే నాకు ఇన్స్పిరేషన్.. అలా మేమిద్దరం కుంగిపోకుండా, ఓపికగా తనకు బాగవుతుందని ఎదురుచూశాం. మా నిరీక్షణ ఫలించింది. నా బిడ్డ అనారోగ్యాన్ని జయించింది. బరువు పెరిగి ఆరోగ్యంగా మా చేతుల్లోకి వచ్చింది' అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నాడు నిక్.చదవండి: చంద్రహాస్‌పై కేసు నమోదు


