breaking news
Malligadu Marriage Bureau
-
రిలీజ్‌కు సిద్ధమైన మూడు సినిమాలు
-
‘మల్లిగాడు’ నవ్విస్తాడు
‘‘నేను నటించిన పలు చిత్రాలకు ఉదయ్‌రాజ్ మంచి కథలు ఇచ్చాడు. ఆయన ఈ చిత్రకథ చెప్పగానే నచ్చింది. ఈ మధ్యకాలంలో దాదాపు సీరియస్ సినిమాలకే పరిమితమయ్యాను. ఈ చిత్రంలో నా మార్క్ వినోదం, సెంటిమెంట్ ఉంటుంది. పెళ్లి సందడి, క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రాల తరహాలో బ్రహ్మానందం, నా కాంబినేషన్లో మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రమిది’’ అన్నారు శ్రీకాంత్. రచయిత ఎ. ఉదయ్రాజ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీకాంత్, మనోచిత్ర జంటగా మల్లెల సీతారామరాజు, పిల్లాడి స్వాతి నిర్మించిన చిత్రం ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. రఘురాం స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన నేపథ్యంలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. తమ్మారెడ్డి భరద్వాజ్ యూనిట్ సభ్యులకు షీల్డులు అందజేశారు. ఇంకా ఈ వేడుకలో ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి, ప్రసన్నకుమార్, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని మల్లెల సీతారామరాజు అన్నారు. పాటలు విజయం సాధించినట్లుగానే సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు అన్నారు. -
మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో పాట చిత్రీకరణ
-
మల్లిగాడి పాటల హంగామా
శ్రీకాంత్, మనోచిత్ర జంటగా ఉదయరాజ్.ఎ దర్శకత్వంలో మల్లెల సీతారామరాజు, పిల్లాడి స్వాతి కలిసి నిర్మించిన చిత్రం ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. రఘురాం స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వి.వి.వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందించారు. వీరితో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, వి.సాగర్, ఎం.ఎల్.కుమార్‌చౌదరి, బెక్కెం వేణుగోపాల్, తరుణ్ అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాంకాంక్షలు అందించారు. చాలాకాలం తర్వాత తాను నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఇదని, దర్శకుడు జనరంజకంగా సినిమాను మలిచాడని శ్రీకాంత్ చెప్పారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
డిసెంబర్ 3న మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో