breaking news
Malaysian Girl
-
'శుభలగ్నం' సీన్లను తలపించేలా లవ్ స్టోరీ..
వేరే వ్యక్తి భర్తని కోటి రూపాయలకు కొనుక్కోవడం జగపతిబాబు, ఆమని, రోజా నటించిన 'శుభలగ్నం' లో చూశాం. డబ్బుపై మోజుతో ఆమని తన భర్త జగపతిబాబును రోజాకు అమ్ముకుంటుంది. అయితే దాదాపు అలాంటి సీన్ మలేషియాలో చోటుచేసుకుంది. ఓ యువతి మరోకరి బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమించింది. అతడికి తన వివరాలు చెబుతూ లోబర్చుకోవాలని చూసింది. కానీ ఆమె యత్నాలు ఫలించలేదు. దీంతో అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను వేధించింది, చివరి ప్రయత్నంగా 1.5 కోట్ల రూపాయాలు ఇస్తానని ఆశచూపింది. డబ్బు కాదు ప్రియుడే ముఖ్యమని చెప్పింది. అందరి మనసులు గెలుచుకుంది. మలేషియాకి చెందిన 38ఏళ్ల జోసి లీ, డానీ టాన్ అనే యువకుడిని ప్రేమించింది. కానీ డానీకి అప్పటికే జోయి టాన్తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. అంత వయసున్నా టీనేజ్ యువతిగా కనిపించే జోసిది ధనిక కుటుంబ నేపథ్యం. మొదట్లో డానీతో పరిచయం పెంచుకుంది. ఆపై నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు లేకపోతే నేను ఉండలేనంటూ బాంబు పేల్చింది. తనకు ప్రేయసి ఉందన్న విషయం తెలిసినా ఇలా జోసి ఇలా చేయడంతో డానీ సీరియస్ అయ్యాడు. 20 ఏళ్ల నుంచి మనమిద్దరం కలిసే తిరిగాం, ఇప్పుడేమైంది అంటూ జోసి లేనిపోని పోస్టింగ్స్ పెట్టేది. ఆమె సోషల్ మీడియా అకౌంట్ల మెసెజ్‌లు రాకుండా బ్లాక్ చేశాడు డానీ. ప్రేమించే ఉద్దేశం లేదని తన వైఖరి స్పష్టం చేయగా తన వ్యక్తిగత వివరాలు చెబుతూ ప్రేమించాలంటూ మానసికంగా వేధింపులకు పాల్పడింది. డానీ తనను ప్రేమించడని డిసైడైన జోసి మరోవైపు నుంచి స్టోరీని నడిపాలనుకుంది. డానీని కొనాలని చూసిన జోసి లీ డానీ ప్రేయసి జోయి టాన్‌ను కలిసి నీ ప్రియుడు కావాలని, అతడిని ప్రేమిస్తున్నానని జోసి చెప్పింది. మా ప్రేమను ఓడించలేరని జోయి తేల్చి చెప్పడంతో వేధింపులకు గురిచేసేది. ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడేది. చివరి ప్రయత్నంగా రూ.1.5 కోట్లు ఇస్తాను .. డానీని నాకు వదిలేయ్ అంటూ జోయికి భారీ ఆఫర్ ఇచ్చింది. నా లవర్‌ను ఎవరికీ వదులుకునే ప్రసక్తే లేదని, ఒకవేళ నేను బ్రేకప్ చెప్పినా.. డానీ నిన్ను మాత్రం ప్రేమించడన్న విషయం తెలుసుకోమని జోయి సూచించింది. ముందు నీ రేటెంతో చెప్పు.. అవసరమైతే నేనే నీకు డబ్బులు సర్దుతానంటూ జోసి లీకి డానీ లవర్ జోయి రివర్స్ ఆఫర్ తో షాకిచ్చింది. ఆఫర్ వివరాలను జోయి టాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా జరిగిందని వివరించింది. జోయి చర్యను నెటిజన్లు కొనియాడారు. మంచి పని చేశావు. ముర్ఖపు ఆలోచనతో ఉన్న జోసి లీకి భలే బుధ్దిచెప్పావు అంటూ కామెంట్ చేస్తున్నారు. -
బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఐఎస్ లో చేరేందుకు మైనర్ యత్నం!
కౌలాలంపూర్: ఐఎస్ ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఐఎస్ ఉగ్రవాదుల పన్నిన వలలో అటు పెద్దల నుంచి మైనర్లు కూడా ఆకర్షితులవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా 14 ఏళ్ల మైనర్ బాలిక ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ లో చేరడానికి సిద్ధమవుతూ పోలీసులకు చిక్కింది. మంగళవారం మలేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ మలేషియాకు చెందిన ఆ బాలిక ఎయిర్ పోర్ట్ లో ఐఎస్ టెర్రర్ గ్రూపులో జాయిన్ అయ్యేందుకు యత్నిస్తూ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు పట్టుబడింది. దీంతో పాటుగా మలేషియాకు చెందిన 22 ఏళ్ల యువకుడ్ని ఆ బాలిక పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందని.. అనంతరం వారిద్దరూ కలిసి ఐఎస్ లో చేరేందుకు సన్నద్ధమైనట్లు పోలీస్ అధికారి ఖలిద్ అబు బకార్ తెలిపారు. ఇప్పటికే సిరియా లో ఉంటున్న ఇద్దరు మలేషియన్ మిలిటెంట్లతో ఆ యువతి టచ్ లో ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ బాలికను అదుపులో తీసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఇంకెరైనా ఐఎస్ టెర్రర్ గ్రూపులో చేరడానికి ఆ బాలిక సహాయ సహకారాలు అందించిందా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు.