breaking news
Mahila Samman Savings Scheme
-
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
ప్రజల్లో ఆర్థిక పొదుపును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పోస్టాఫీసుల ద్వారా వీటిని అమలు చేస్తోంది. అలాంటి మంచి స్కీముల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ) పథకం ఒకటి.మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇక చాలా తక్కువ రోజులే సమయం ఉంది. పోస్టాఫీస్ కింద నిర్వహించే ఎంఎస్ఎస్సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయని మహిళలకు కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..మహిళలకు ప్రత్యేకంస్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కింద భారత ప్రభుత్వం 2023 మార్చి 31న మహిళలు, బాలికల కోసం ఎంఎస్ఎస్సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది రెండు సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్ స్కీమ్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం లక్ష్యం.ఎంత వడ్డీ లభిస్తుంది?దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఎంఎస్ఎస్సీ స్కీమ్‌పై 7.5% వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది బ్యాంకులలో 2 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. ఇది సురక్షితమైన పథకం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీని కింద పోస్టాఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల్లో సులభంగా ఖాతా తెరవవచ్చు.పెట్టుబడి ఎంత పెట్టవచ్చు?మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద దేశంలో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ .1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 సంవత్సరాల వ్యవధి తర్వాత, అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం తరువాత డిపాజిట్ మొత్తంలో 40% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితులలో ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. డిపాజిటర్ 6 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తే వడ్డీ రేటు తగ్గవచ్చు. -
మహిళలకు భారీ వడ్డీ పథకం కొనసాగుతుందా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్ 2025-26ను (Union Budget 2025-26) సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. పన్ను రేట్ల తగ్గింపు, పెంపు, సంబంధిత గడువులు, మినహాయింపు పరిమితులు, ప్రభుత్వ పథకాలు.. ఇలా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 2023 బడ్జెట్లో ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ (Mahila Samman Savings Scheme)పైనా అటువంటి చర్చే సాగుతోంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ అనేది మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వన్ టైమ్ పొదుపు పథకం. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ పథకం ప్రస్తుతం బ్యాంకులు రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌కు ప్రభుత్వం ప్రకటించిన చివరి పెట్టుబడి తేదీ మార్చి 31 సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న బడ్జెట్లో కేంద్రం నుండి దీనికి పొడిగింపు లభిస్తుందో లేదో చూడాలి.మహిళల ఆర్థిక చేరిక, సాధికారతను ప్రోత్సహించడంలో ముఖ్యమైన మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పాత్ర పోషిస్తుందని వన్ ఫైనాన్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రజనీ తాడనే అన్నారు. ఈ పొదుపు పథకాన్ని పరిమిత అవకాశంగా ప్రవేశపెట్టారని, ఇది ఆకర్షణీయమైన 7.5 వడ్డీ రేటు అందిస్తున్నప్పటికీ ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవని చెప్పారు. "మహిళల కేంద్రీకృత విధానాలపై ప్రభుత్వ స్థిరమైన దృష్టిని దృష్టిలో పెట్టకుంటే ఈ పథకాన్ని పొడిగించవచ్చు లేదా ఇదే విధమైన ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టవచ్చు" అని ఆయన ఎకనామిక్స్ టైమ్స్‌తో అన్నారు.మరోవైపు ఈక్విటీ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ల వైపు డిపాజిటర్ల దృష్టి మళ్లడంతో మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌కు పెద్దగా ఆదరణ లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్త్ ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు, సీఈవో స్నేహ జైన్ అభిప్రాయపడుతున్నారు.రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపివేయవచ్చని ఓ ప్రభుత్వ అధికారి గతంలో చెప్పినట్లుగా మనీకంట్రోల్ పేర్కొంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాలు గతంలో బలమైన పనితీరును ప్రదర్శించాయని వివరించారు. అయితే వీటి ప్రభావం నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ (NSSF) పథకంపై పడినట్లు తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో రూ. 20,000 కోట్ల డిపాజిట్లు తగ్గిపోయాయి.7.5 శాతం వడ్డీ మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పొడిగింపునకు సంబంధించి అనిశ్చితి ఉన్న నేపథ్యంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు మార్చి 31లోపు ఖాతా తెరవడం మంచిది. ఇందులో కనీస డిపాజిట్ రూ. 1,000 కాగా గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 7.5 శాతం వడ్డీ వార్షిక వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది. ఇది ఖాతా తెరిచిన తేదీ నుండి రెండు సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. సంవత్సరం తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది.