breaking news
Maharajas Express
-
ఢిల్లీ నుంచి ఢిల్లీకి: ద ఇండియన్ పనోరమ టూర్
‘ద ఇండియన్ పనోరమ’ టూర్. ఇది ఏడు రోజుల యాత్ర. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో జైపూర్, రణతంబోర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, ఓర్చా, ఖజురహో, వారణాసి ప్రదేశాలు కవర్ అవుతాయి.పనోరమ టూర్లో ఏమేమి ఉన్నాయి?యూపీ... ఎంపీ... రాజస్థాన్ రాష్ట్రాలు.ఆరు రోజుల్లో మూడు రాష్ట్రాల పర్యటన.జయ్‌పూర్‌లో సన్డయల్ను చూస్తాం.అమేర్ కోటలో మాన్సింగ్ మందిరం.రామ్‌బాగ్ రాజమందిరంలో భోజనం.పులి పుట్టిల్లు రణతంబోర్ సఫారీ.విజయం పేరుకే పరిమితమైన ఫతేపూర్.ఏడు వింతల్లో స్థానం పొందిన తాజ్‌మహల్.ఢిల్లీకి మోడలైన ఓర్చా ఐలాండ్ఫోర్ట్.బ్రిటిష్ ఇంజనీర్లను దిగ్భ్రమకు గురిచేసిన...ఆలయాల పుట్ట... ఖజురహో నగరం.సారనాథ్ స్థూపం... సిల్క్ వీవింగ్ సెంటర్.వారణాసిలో గంగాహారతి... పడవ విహారం.వారం రోజులు ఏడు క్షణాలను తలపిస్తాయి.1రోజుఢిల్లీ నుంచి జైపూర్‌కు ప్రయాణం. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్లో ఉదయం ఏడున్నరకు పర్యాటకులకు స్వాగతం. రైలెక్కిన తర్వాత తొమ్మిది గంటలకు మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. పన్నెండు గంటలకు టూర్ మేనేజర్ పర్యాటకులకు ఈ టూర్ గురించిన వివరాలు తెలియచేస్తారు. ఒంటి గంటకు రైల్లోనే లంచ్. మూడున్నరకు రైలు జయ్‌పూర్‌కు చేరుతుంది. అమేర్ ఫోర్ట్ సందర్శనం. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి బస రైల్లోనే. రైలు జయ్‌పూర్ స్టేషన్లోనే ఉంటుంది.అమేర్ కోటజయ్పూర్కి పదకొండు కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం అమేర్. ఇందులోని కోట అమేర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. రాజపుత్రుల నిర్మాణకౌశలానికి నిదర్శనం ఈ కోట. దీని నిర్మాణం నాటికే మనదేశంలో మొఘల్ పాలన మొదలైంది. అమేర్ కోటలోని కొన్ని ప్యాలెస్‌లలో మొఘల్ ఆర్కిటెక్చర్ సమ్మేళనం కూడా కనిపిస్తుంది. ఈ కోటను కట్టించిన మాన్‌సింగ్‌కి పన్నెండు మంది రాణులు. ఒక్కో రాణికి ఒక్కొక్క గది ఉంటుంది. ప్రతి గది నుంచి పై అంతస్థులోని మాన్సింగ్ గదికి మెట్లు ఉన్నాయి. శీలాదేవి ఆలయద్వారం, గణేశ్పోల్ ముఖద్వార నిర్మాణం అద్భుతంగా ఉంటాయి. ప్యాలెస్ లోపల గోడలకు పాలరాతిలో చేసిన ఇన్లే వర్క్‌ను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.2రోజుజయ్పూర్ పర్యటన. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. తొమ్మిదింటికి రైలు దిగి సిటీ ప్యాలెస్, గ్యాలరీల వీక్షణానికి వెళ్లాలి. ఒంటిగంటకు తిరిగి రైలెక్కిన తర్వాత భోజనం. ఆ తర్వాత విశ్రాంతి. రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరవచ్చు. సాయంత్రం ఆరు గంటలకు రామ్‌బాగ్ ప్యాలెస్‌కు వెళ్లాలి. డిన్నర్ ప్యాలెస్‌లోనే. తొమ్మిదిన్నరకు తిరిగి రైలెక్కాలి. రాత్రి పదకొండు గంటలకు రైలు జయ్పూర్నుంచి సవాయ్ మాధోపూర్ (రణతంబోర్)కు బయలుదేరుతుంది.గులాబీ నగరం!ఈ నగరం పేరు జయ్‌పూర్, రెండవ సవాయ్ జయ్సింగ్ నిర్మించాడు. బ్రిటిష్ రాజకుటుంబీకులు భారత్ సందర్శనార్థం వచ్చిన సందర్భంగా జయ్‌పూర్‌లోని భవనాలకు గులాబీరంగులు వేశారు. అప్పటి నుంచి పింక్‌సిటీ అనే పేరు వాడుకలోకి వచ్చింది. యునెస్కో సాధారణంగా ఒక కట్టడాన్ని లేదా ప్రదేశాన్ని మాత్రమే హెరిటేజ్ సైట్ల జాబితాలోకి తీసుకుంటుంది. ఒక నగరం మొత్తాన్ని హెరిటేజ్‌సైట్‌గా గుర్తించడం అరుదు. ఆ గౌరవం జయ్‌పూర్‌కి దక్కింది. సైక్లింగ్ ప్రేమికులు జయ్‌పూర్‌లో రెండు రోజులు బస చేసి, సైకిల్ అద్దెకు తీసుకుని పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తారు. అంత సమయం లేని వాళ్లు వాహనంలో సిటీ టూర్ చేస్తారు. సిటీప్యాలెస్, హవామహల్, జల్‌మహల్ వంటి రాజపుత్రుల మార్కు నిర్మాణాలతో పాటు మనదేశ విజ్ఞానానికి ప్రతీక అయిన జంతర్‌మంతర్‌ని తప్పకుండా చూడాలి. దీనిని 1734లో నిర్మించారు. అతిపెద్ద సన్డయల్ ఇక్కడే ఉంది.రామ్‌బాగ్ తొలి ప్యాలెస్హోటల్రామ్బాగ్ ప్యాలెస్ జయ్‌పూర్‌కి మణిహారం వంటిది. యాభై ఎకరాల్లో విస్తరించిన ఈ ప్యాలెస్ ప్రధాన నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇందులో జయ్‌పూర్ రాజు సవాయ్ రెండవ మాన్సింగ్, మహారాణి గాయత్రీ దేవి నివసించారు. రాజకుటుంబీకుల వివాహ వేడుకలు, పోలో ఆటలు ఇక్కడే జరిగేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసిన క్రమంలో ఈ ప్యాలెస్‌ను హోటల్‌గా మార్చారు. కొంతకాలం రాజకుటుంబమే నిర్వహించింది. తర్వాత తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్యాలెస్‌లో రాజభోజనం చేసే అవకాశం ఈ టూర్ కల్పిస్తోంది.3రోజురణతంబోర్ నుంచి ఫతేపూర్ సిక్రీ. ఉదయం ఆరున్నరకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్కుకు వెళ్లాలి. తొమ్మిది ముప్పావుకు వెనక్కి వచ్చి రైలెక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. పదింపావుకి రైలు ప్రయాణం ఫతేపూర్ సిక్రీ వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండూ ముప్పావుకు రైలు ఫతేపూర్ సిక్రీకి చేరుతుంది. మూడు నుంచి ఫతేపూర్ సిక్రీ నగర పర్యటన మొదలు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ఆగ్రా వైపు సాగుతుంది. ఏడున్నరకు భోజనం. ఎనిమిది గంటలకు రైలు ఆగ్రా స్టేషన్‌కు చేరుతుంది.రణతంబోర్ పులి పుట్టిల్లురణతంబోర్ విస్తారమైన అడవి. కొంతభాగం పులుల సంరక్షణ కేంద్రం. రాయల్ బెంగాల్ టైగర్లు సంచరించే నేల ఇది. ఈ అడవిలో ఏడువందల అడుగుల ఎత్తు కొండ మీద ఓ కోట. ఇది జయ్‌పూర్ రాజవంశానికి చెందిన కోట. రాజపుత్రుల శత్రుదుర్భేద్య కోటలంత పెద్దది కాదు, కానీ నిర్మాణపరంగా పెద్దదే. యునెస్కో ఈ కోటను హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ కేటగిరీలో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ అడవిలో చంబల్ నది ప్రవహిస్తుంది.విజయవంతం కాని ఫతేపూర్ ఫతేపూర్ అంటే... సిటీ ఆఫ్ విక్టరీ. అంటే విజయనగరం అని అర్థం. విఫలమైన అక్బర్ ప్రయత్నాల్లో ఇదొకటి. ఎవరూ సొంతం చేసుకోని అక్బర్ బ్రెయిన్ చైల్డ్ ‘దీన్ ఈ ఇలాహి’ మతం కూడా ఇక్కడే పుట్టింది. ఇక్కడ పుట్టిన జహంగీర్ కూడా మొఘల్ పాలకుల్లో అత్యంత తక్కువ సమయం పాలించిన పాలకుడు, ఎటువంటి చారిత్రక గొప్పదనం లేని పాలకుడుగా మిగిలిపోయాడు. పాతికేళ్ల కిందట ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టింది. సిక్రీ అనే ఈ గ్రామంలో అక్బర్ నగరాన్ని నిర్మించకముందు శుంగ జాతి ప్రజలు నివసించేవారని, కన్యాకుబ్జ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేదని వెల్లడైంది. అక్బర్‌కు ఇష్టమైన భార్య మరియమ్ ఉజ్ జమానీకి మగపిల్లవాడు పుట్టిన ఈ ప్రదేశంలోనే రాజధానిని నిర్మించాలని అక్బర్ ముచ్చటపడ్డాడు. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.4రోజుఆగ్రా పర్యటన. ఆరున్నరకు తాజ్ మహల్ సందర్శన. తొమ్మిది గంటలకు తాజ్ ఖేమాలో బ్రేక్‌ఫాస్ట్. పదకొండు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ప్రయాణం ఓర్చా వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి, రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరడం. రాత్రి భోజనం ఏడున్నరకు.వాహ్ వండర్ఫుల్ తాజ్!తాజ్‌మహల్ మనదేశానికి గర్వకారణం. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సైట్ మాత్రమే కాదు. ప్రపంచ వింత కూడా. ఏడు వింతల జాబితా కోసం 2007లో ఓటింగ్ జరిగినప్పుడు మొదట తాజ్ చాలా వెనుకబడింది. వెనుకబడిందనే విషయం మీద ప్రభావవతమైన కథనాలను వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు ప్రసారం చేయడంతో దేశమంతా చైతన్యవంతమైంది. ఉత్సాహవంతులు చురుగ్గా ఓటింగ్‌లో పాల్గొని తాజ్ మహల్‌కు ఓటు వేసి గెలిపించారు. తాజ్‌మహల్ మాత్రం ‘నన్ను ప్రేమించండి లేదా సమాధికి ఇంత గొప్ప నిర్మాణం అవసరమా అని ద్వేషించండి... నన్ను మాత్రం గుర్తించి తీరాల్సిందే’ అన్నట్లు ఠీవిగా ఉంటుంది. గోడలకు ఉన్న రంగురంగు ఇన్లే వర్క్ వస్త్రం మీద దారంతో అందంగా కుట్టిన పూలను తలపిస్తుంది. గోడలకు పాలరాతిలో చెక్కిన పూలను చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసి గోడకు అతికించారా అనిపిస్తుంది. మెత్తని రాతిలో ఉలి చేసిన చాతుర్యానికి, శిల్పకారుడి నైపుణ్యానికి సలామ్ అనాల్సిందే. ఈ టూర్లో ఆగ్రాలోని రెడ్ఫోర్ట్ను కూడా చూడాలి. అక్బర్ తొలి రాజధాని ఆగ్రా. ఈ ఎర్ర కోట నుంచే పాలన సాగించాడు.5రోజుఓర్చాకు రావడం, ఖజురహోకి ప్రయాణం. ఉదయం ఆరున్నరకు రైలు ఓర్చా స్టేషన్‌కు చేరుతుంది. ఓర్చా కోట సందర్శనం, గ్రామాల పర్యటన తర్వాత తిరిగి రైలెక్కాలి. తొమ్మిదీ ముప్పావుకు బ్రేక్‌ఫాస్ట్. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఖజురహోకు సాగుతుంది. ఒంటిగంటకు లంచ్. మూడింటికి రైలు ఖజురహోకి చేరుతుంది. రైలు దిగి అక్కడి ప్రసిద్ధ దేవాలయాల దర్శనం. ఆరున్నరకు వెనక్కి వచ్చి మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. విశ్రాంతి, యాక్టివిటీస్‌తో సేదదీరడం. ఏడున్నరకు రాత్రి భోజనం. రాత్రి పదిగంటలకు రైలు వారణాసికి బయలుదేరుతుంది.ఐలాండ్ ఫోర్ట్ఓర్చా కోట మరీ పురాతనమైనదేమీ కాదు. పదహారవ శతాబ్దపు నిర్మాణం. బుందేల్ రాజపుత్రుల కోట ఇది. రుద్రప్రతాప్ సింగ్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఒక్కో ప్యాలెస్‌ను నిర్మిస్తూ విస్తరించారు. మొఘల్ పాలకుడు జహంగీర్ ఈ రాజ్యానికి అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన బస కోసం అప్పటి బుందేల్‌ఖండ్ రాజు వీర్ సింగ్ దేవ్ ఏకంగా ఒక మందిరాన్నే కట్టించారు. అదే జహంగీర్ ప్యాలెస్. ఢిల్లీ నగరాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ల్యూటియెన్స్ కూడా ఓర్చా కోట, ప్యాలెస్‌ల డిజైన్లతో ప్రభావితమయ్యాడు. ఈ కోట నిర్మాణంలో గొప్పతనం ఏమిటంటే... కోటలోని మూలనున్న చిన్న గదుల్లోకి కూడా సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించడానికి చిన్న చిన్న గూళ్లున్నాయి. ఈ కోటలో మరో ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఐలాండ్ ఫోర్ట్. బేత్వా, జామ్ని నదుల సంగమస్థలిలో ఏర్పడిన దీవి మీద నిర్మించారు. అందుకే ఈ కోట నుంచి ప్రధాన నేలమీదకు వంతెన కూడా ఉంటుంది. సాధారణంగా శత్రువుల దాడుల నుంచి రక్షణ కోట చుట్టూ కందకం తవ్వుతారు. ఇక్కడ నీటి మధ్యలో కోట ఉంటుంది.ఆలయ నగరం ఖజురహోఖజురహో జైన, హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి. ఎక్కువ ఆలయాలు తొమ్మిది, పది, పదకొండు శతాబ్దాలనాటివి. పన్నెండవ శతాబ్దం నాటికి ఆ సంఖ్య 85కి చేరింది. బుందేల్‌ఖండ్‌ను పాలించిన చందేల రాజవంశస్థులు నిర్మించిన ఆలయాలివన్నీ. ఇవన్నీ నగర వాస్తు శైలి నిర్మాణాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. వైష్ణవం, శైవ ఆలయాలు, జైన ఆలయాలు నిర్మాణపరంగా చాలా ప్రత్యేకమైనవి. బ్రిటిష్ ఇంజనీర్లు ఈ నిర్మాణాలను స్వయంగా పరిశీలించి కథనాలను రాశారు. ఈ ప్రదేశం 1986లో యునెస్కో జాబితాలో చేరింది.6రోజువారణాసి విహారం. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. మధ్యాహ్న భోజనం హోటల్ తాజ్ గాంజెస్లో. లంచ్ తర్వాత సారనాథ్ స్థూపం, సిల్క్ వీవింగ్ సెంటర్ సందర్శనం. నాలుగన్నరకు గంగానదిలో పడవ విహారం, గంగాహారతి దర్శనం. ఎనిమిది గంటలకు తిరిగి మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ చేరిన తర్వాత ఎనిమిదన్నరకు డిన్నర్. తొమ్మిదిన్నరకు ఢిల్లీకి ప్రయాణం.సారనాథ్బుద్ధుడి జీవితంలో సారనాథ్ ప్రముఖమైన ప్రదేశం. సిద్ధార్థుడు ధ్యానం చేసి బుద్ధుడైన తర్వాత తొలిసారిగా ప్రవచనం బోధించిన ప్రదేశం. బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాల్లో బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని ఐదుగురు శిష్యులకు బోధిస్తున్న చిత్రం ఉంటుంది. అది సారనాథ్‌లోని తొలి ప్రబోధానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్‌లోని బౌద్ధ స్థూపం, ప్రపంచదేశాల్లోని బుద్ధుని శిల్పాలతో ఓ గార్డెన్ ఉన్నాయిక్కడ. వారణాసి చేనేత కేంద్రం ఉందిక్కడ. మగ్గం ఉంటుంది. నేత ప్రక్రియలను వివరిస్తారు. ఇది సొసైటీ ఆధీనంలో నడుస్తుంది. అందుకే ఈ వీవింగ్ సెంటర్లో అమ్మే చేనేత చీరలను కచ్చితమైనవిగా భావిస్తారు. ఇక వారణాసిలో గంగాహారతిని చూడడం నయనానందకరం. ఈ టూర్లో కాశీ విశ్వనాథుడి దర్శనం లేదు. ఆసక్తి ఉన్న వాళ్లు మధ్యలో వీలు చేసుకుని విశ్వనాథుని దర్శనానికి వెళ్లవచ్చు.7రోజుతొమ్మిదింటికి రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. పన్నెండున్నరకు రైలు ఢిల్లీకి చేరుతుంది. స్టేషన్లో ఐఆర్సీటీసీ ఉద్యోగుల వీడ్కోలుతో పర్యటన పూర్తవుతుంది.ప్యాకేజ్ ధరలివి: → డీలక్స్ క్యాబిన్ లో ఒక్కొక్కరికి దాదాపుగా ఏడు లక్షల రూపాయలు. సూట్లో ఒక్కొక్కరికి పదమూడు లక్షల రూపాయలు. ప్రెసిడెన్షియల్ సూట్లో 22లక్షలకు పైగా అవుతుంది. వీటికి ఐదు శాతం జీఎస్టీ అదనం.→ ఈ ప్రదేశాల్లో పర్యటనకు అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య సమయం అనువుగా ఉంటుంది. కాబట్టి బుకింగ్ ఇంకా మొదలవలేదు. 90 రోజుల ముందు సైట్ ఓపెన్ అవుతుంది.→ ప్రయాణం మొత్తం 2,300 కిమీల ప్రయాణం. -
ఖరీదైన ప్రయాణం.. కనుమరుగు?
సురక్షితంగా, తక్కువ ఖర్చుతో జర్నీ చేయాలంటే సహజంగానే అందరూ రైలు ప్రయాణం వైపే మొగ్గుచూపుతారు. కేవలం సామాన్యుల అవసరాల కోసమే కాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఖరీదైన ప్రయాణాన్ని అందిస్తోన్న రైళ్లు కూడా భారత్‌లో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా రాజభోగాలు అనుభవించాలంటే ఆ ట్రైన్లు ఎక్కాల్సిందే! అయితే ప్రస్తుతం ఈ లగ్జరీ ట్రైన్లకు కష్టకాలం ఏర్పడింది. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో పర్యటిస్తున్న కొన్ని ట్రైన్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యాటకప్రియుల కోసం ఇండియన్ రైల్వే, టూరిజం కార్పొరేషన్ ప్రారంభించిన ప్రఖ్యాత ట్రైన్లలో ఒకటైన ‘ప్యాలస్ ఆన్ వీల్స్’ గత 34 ఏళ్లలో తొలిసారిగా ఆగిపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. అలాంటి లగ్జరీ రైళ్లు ఏమిటో మీకు తెలుసా...? ప్యాలెస్ ఆన్ వీల్స్.. భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ రైలు ప్యాలెస్ ఆన్‌వీల్స్. తొలినాళ్లలో ఖరీదైన రైలు ప్రయాణాల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానం ఆక్రమించిన ఈ రైలును 1982 జనవరి 26న ప్రారంభించారు. చారిత్రక వైభవం ఉట్టిపడేలా దీని ఇంటీరియర్ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఇది రాజస్తాన్ పర్యాటక శాఖ, ఇండియన్ రైల్వే సంయుక్త ప్రాజెక్టు. ఇందులోని 14 బోగీలకు రాజస్తాన్‌లోని 14 సామ్రాజ్యాల పేర్లు పెట్టారు. 1991లో దీనికి ఏసీ ఏర్పాటు చేశారు. 2009లో మొత్తం రైలును సరికొత్తగా తీర్చిదిద్దారు. ఎనిమిది రోజుల ప్యాకేజీ ధర రోజుకు ఒకరికి రూ. 22,000. ఒక గదిని ఇద్దరు పంచుకుంటే రూ. 33,000. ముగ్గురు పంచుకుంటే రూ. 45,000 వసూలు చేస్తారు. రాయల్ రాజస్తాన్.. ఇది ప్యాలెస్ ఆన్వీల్స్కు సమాంతర ప్రాజెక్ట్. 2009 జనవరిలో ప్రారంభమైంది. రాజపుత్రుల అంతఃపురాల్లో మాత్రమే కనిపించే ప్రత్యేక అలంకరణలను దీనికి ఇంటీరియర్ డిజైన్‌గా ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ఆదివారం వరకు కొనసాగే ఈ ప్రయాణం ఢిల్లీ, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, చిత్తోర్‌ఘఢ్, సవై మదోపూర్, జైపూర్, ఖజురహో, వారణాసి, ఆగ్రా, ఢిల్లీల్లో ప్రయాణిస్తుంది. ఇద్దరు కలిసి ఒక గది తీసుకుంటే రోజుకు ఒకరికి రూ. 26,000 చెల్లించాలి. ఎక్స్ట్రార్డినరీ సూట్‌కు రోజుకు రూ. 75,000 వరకు చార్జ్ చేస్తారు. ది గోల్డెన్ చారియట్.. కర్ణాటక, గోవాల్లో అందాలను తిలకించేందుకు రూపొందించిన ప్యాకేజీ. 2008 మార్చిలో ప్రారంభమైంది. ఇండియన్ రైల్వే అండ్ కర్ణాటక టూరిజమ్‌లు సంయుక్తంగా రెండు రకాల ప్యాకేజీలను నిర్వహిస్తున్నాయి. ప్రతి సోమవారం బెంగళూరు నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కబిని, బందీపూర్, మైసూర్, హసన్, హూస్పేట్, బాదామి, గోవాల మీదుగా ప్రయాణిస్తుంది. ఒక గదిని ఇద్దరు షేర్ చేసుకుంటే ఒకరికి రోజుకు రూ. 18,000 చార్జ్ చేస్తారు. ఇండియాలో నడుస్తున్న ఖైరీదైన రైళ్లలో ఇదే కాస్త ధర తక్కువ. మహారాజా ఎక్స్‌ప్రెస్.. 2010లో ప్రారంభమైన ఈ రైలును ఇండియన్ రైల్వే గ్లోబల్ ట్రావెల్ కంపెనీ, కాక్స్ అండ్ కింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో మూడు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మహారాజుల వైభవానికి ఆధునికతను మిక్స్ చేసి దీన్ని రూపొందించారు. ఫెయిరీ క్వీన్.. 1855లో ఇంగ్లండ్‌లో తయారైన ఈరైలు ప్రపంచంలోనే వాడుకలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ లోకోమోటివ్. 1909లో కాలం చెల్లిన ఈ ట్రైన్‌ను బాగుచేసి 1997 జులైలో మళ్లీ పట్టాలెక్కించారు. ఇది ఢిల్లీ ఆల్వార్ సరిస్కా (పులుల కేంద్రం), ఢిల్లీ ప్యాకేజీలను నిర్వహిస్తోంది. రెండు రోజుల ప్యాకేజీ ధర ఒకరికి రూ. 11,000 సదుపాయాలు.. ప్రతి గదికి ప్రత్యే ఏసీతో సెవెన్ స్టార్ సదుపాయాలతో బెడ్రూమ్ ఉంటుంది. ప్రతి ట్రైన్లో ఒకబార్, రెండు రెస్టారెంట్లు ఉంటాయి. లైబ్రరీ, షాపింగ్, విశ్రాంతి గది, జిమ్, అవుట్గోయింగ్ పోస్ట్, ఫోను, ఇంటర్నెట్, ఎల్సీడీ టీవీలు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. 24 గంటలూ వేడి , చల్లటి నీరు అందుబాటులో ఉంటుంది. -
ప్రపంచానికే మహరాజు
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైలు ఏదీ? అంటే ఏ అమెరికా వాళ్లదో.. బ్రిటన్వాళ్లదో అయ్యుంటుందని అనుకుంటాం.. కానీ కాదు! అది మన రైలే. పేరు ‘మహరాజాస్ ఎక్స్‌ప్రెస్’. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ రైల్లో ప్రయాణం.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, వంటలతోపాటు ప్రకృతి సోయగాలను పరిచయం చేస్తూ చాలా ఆహ్లాదంగా సాగుతుంది. ఈ రైలు వాయవ్య, మధ్య భారత దేశంలో 12 గమ్యస్థానాల మీదుగా ఐదు మార్గాల్లో నడుస్తుంది. 2010లో ఈ రైలు సేవలు ప్రారంభించారు. ► ఒత్తిడితో పనిచేసే సస్పెన్షన్ వ్యవస్థ, లైవ్ టీవీ, వైఫై, అటాచ్డ్ బాత్రూమ్, బార్, విశాలమైన భోజనశాల, లాంజ్, సురక్షితమైన టెలిఫోన్ సౌకర్యాలు ఇందులోని ప్రత్యేకతలు. ఈ రైల్లో నీటి శుద్ధి ప్లాంటు కూడా ఉంది. ► మొత్తం 23 బోగీలకుగాను.. 14 బోగీల్లో వసతి ఏర్పాటు ఉంటుంది. మొత్తం 88 మంది వరకు ప్రయాణించవచ్చు. ► బోగీల్లో నాలుగు రకాల కేటగిరీలు- ప్రెసిడెన్షియల్ సూట్, డీలక్స్ కేబిన్లు, జూనియర్ సూట్, సూట్- ఉన్నాయి. హెరిటేజ్ ఆఫ్ ఇండియా ప్యాకేజీ(ఎనిమిది రోజులు)లో ప్రెసిడెన్షియల్ సూట్లో ప్రయాణించాలంటే.. పెద్దవాళ్లకు ఒక్కొక్కరికి 14.5 లక్షల దాకా ఖర్చవుతుంది. అంటే రోజుకు దాదాపు రూ.2 లక్షలన్నమాట!