breaking news
Madhave Madhusudana Movie
-
'మాధవే మధుసూదన' సినిమా రివ్యూ
టైటిల్: మాధవే మధుసూదన నటీనటులు: తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే ,జోష్ రవి, శివ తదితరులు నిర్మాణం: సాయి రత్న క్రియేషన్స్ నిర్మాత: బొమ్మదేవర రామచంద్ర రావు దర్శకత్వం: బొమ్మదేవర రామచంద్ర రావు సంగీతం: వికాస్ బాడిన విడుదల తేదీ: నవంబర్ 24, 2023 కథేంటంటే? మాధవ్ (తేజ్ బొమ్మదేవర) ఓ ఆవారా. స్నేహితులు రవి(జోష్ రవి), శివ(శివ)లతో కలిసి జాలీగా తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ లక్ష్యమంటూ లేకుండా తిరుగుతున్న కొడుకును దారిలో పెట్టాలని..బెంగళూరులోని ఆఫీస్ బాధ్యతలు అప్పజెబుతారు అతడి తల్లిదండ్రులు(ప్రియ, జయప్రకాశ్). కానీ మాధవ్ మాత్రం వైజాగ్ ట్రైన్ ఎక్కి అరకు వెళ్లిపోతాడు. మార్గ మధ్యలో ఓ రైల్వే స్టేషన్లో మాధవ్‌కి ఓ అమ్మాయి(రిషికి లొక్రే) కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే.. ఆ అమ్మాయి మాధవ్‌కి తప్ప మిగతావారెవరికి కనిపించదు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు మాధవ్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? ప్రేమ కథలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. లవ్‌స్టోరీని కాస్త వైవిధ్యంగా చెబితే చాలు.. ఆ చిత్రాన్ని హిట్ చేసేస్తారు. మాధవే మధుసూదన కూడా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఈ ప్రేమ కథలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరు. విధే విలన్. ప్రియురాలికి ఇచ్చిన మాట కోసం భగ్నప్రేమికుడు ఏం చేశాడు? ఏం చేయగలడు? అనేది చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు రామచంద్రరావు. తెలుగు ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీని పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ కాస్త జాలీగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది. సెకండాఫ్ మాత్రం కొంచెం నీరసంగా, నిదానంగా సాగినట్లు అనిపిస్తుంది. సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉండడం కాస్త మైనస్. ఎవరెలా చేశారంటే? తేజ్ బొమ్మదేవరకు ఇది మొదటి సినిమా. ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. హీరోయిన్గా చేసిన రిషికి ఆకట్టుకుంటుంది. అందంగా కనిపించింది. ఫ్రెండ్స్ పాత్రలు నవ్విస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం పర్వాలేదు. పాటలు ఓకే ఓకే. విజువల్స్ అందంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
హీరోల కష్టం అర్థమైంది..ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తా: తేజ్
‘‘ప్రేమ, వినోదం, థ్రిల్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన చిత్రం ‘మాధవే మధుసూదన’. మంచి కథ. తెలుగులో ఓ కొత్త జానర్‌లా అనిపిస్తుంది’’ అన్నారు తేజ్ బొమ్మ దేవర. ఆయన హీరోగా, రిషికా లోక్రే హీరోయిన్గా నటించిన చిత్రం ‘మాధవే మధుసూదన’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ రేపు(నవంబర్ 24) విడుదలవుతోంది. ఈ సందర్భంగా తేజ్ బొమ్మదేవర మాట్లాడుతూ– ‘‘బీబీఏ పూర్తి చేసి, విదేశాలకు వెళ్లి ఎంబీఏ చేద్దామనుకున్నా. అయితే కరోనా వల్ల ఆగిపోయాను. మా నాన్న రామచంద్ర రావు ఆ సమయంలో ‘మాధవే..’ కథను రెడీ చేసుకున్నారు. భిక్షు మాస్టర్ వద్ద నటనలో శిక్షణ తీసుకుని, ఈ సినిమా చేశాను. హీరోలు వేదికలపై మాట్లాడుతూ అప్పుడప్పుడు తడబడుతుంటే ఏదో అనుకునేవాణ్ని. కానీ వారి కష్టం ఎలా ఉంటుందో నాకు అర్థం అయింది. హీరోగానే కాదు.. ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తాను’’ అన్నారు.