breaking news
Mack Tests
-
‘మాక్’తో మేల్కొలుపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విద్యార్థులకు అనేక అనుభవాలను నేర్పింది. ఆప్షన్ల ఎంపికలో అతి విశ్వాసం పనికిరాదని స్పష్టం చేసింది. మంచి ర్యాంకు వచ్చినా తక్కువ ఆప్షన్లు పెట్టడం వల్ల సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలు సీట్ల కేటాయింపులో నష్టం జరిగే వీలుంది. ఆప్షన్లు ఇవ్వడంలో పొరపాట్లు చేసిన వారు ఇప్పుడు వాటిని సరి చేసుకుంటారు. దీంతో ఈ నెల 18న చేపట్టే అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే జాగ్రత్తగా అప్షన్లు మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. 2 వేల ర్యాంకుకూ సీటు రాలే..మాక్ సీట్ల కేటాయింపులో 83,054 సీట్లకు 77,154 సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపు 95 వేల మంది విద్యార్థులు ఆప్షన్లపై కసరత్తు చేశారు. అయితే, 16,905 మంది ఆప్షన్లు ఇచ్చినా సీట్లు పొందలేకపోయారు. వీళ్లంతా తక్కువ కాలేజీలు, కొన్ని బ్రాంచీలను మాత్రమే ఎంచుకున్నారు. మొదటి దశ కౌన్సెలింగ్ కాబట్టి జేఈఈ ద్వారా జాతీయ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా రాష్ట్ర ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేశారు. ఎక్కువ ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల మంచి ర్యాంకు వచ్చినా వారికి సీటు రాలేదు. ఒక విద్యార్థినికి ఎప్‌సెట్‌లో 2 వేల ర్యాంకు వచ్చింది. అయినా మాక్ సీట్ల కేటాయింపులో సీటు రాలేదు. ఒక విద్యార్థికి 50 వేల ర్యాంకు వచ్చినా టాప్ 15 జాబితాలో ఉన్న కాలేజీలో సీఎస్ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. ఇతను ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది.జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలిఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25లో 16 వేల మంది పెరిగి, 1.07 లక్షలకు ఇంజనీరింగ్ ప్రవేశాలు చేరాయి. కాబట్టి ఎప్‌సెట్ అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చినవాళ్లు ఈసారి వాటిని పెంచుతారు. మంచి ర్యాంకులు ఉండి సీట్లు వచ్చిన విద్యార్థులు టాప్ కాలేజీల్లో మార్పులు కోరుకుంటారు. కాబట్టి మాక్‌లో వచ్చిన సీటు అసలు కేటాయింపులో ఉండకపోవచ్చు. 20 వేల ర్యాంకుపైన వచ్చిన విద్యార్థుల దీన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలని, ఇందుకు తగ్గట్టుగా ఆప్షన్ల ఎంపికపై కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆన్లైన్ ‘పరీక్ష’లో విజయానికి...
ఎగ్జామ్ టిప్స్ ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది.. అన్ని విభాగాల మాదిరిగానే చదువు, పోటీ పరీక్షలు కూడా ‘ఆన్లైన్’ బాటలో నడుస్తున్నాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ వంటి ఉద్యోగ నియామక పరీక్షలతో పాటు క్యాట్, గేట్ వంటి ప్రవేశ పరీక్షలూ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆన్లైన్ పరీక్షల వల్ల ఉపయోగాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి మార్గాలు.. అభ్యర్థులు మొదట ఆన్లైన్ పరీక్ష విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. దరఖాస్తు విధానం, పరీక్ష కేంద్రాలు, స్లాట్ బుకింగ్, ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్, పరీక్ష విధానం తదితరాల గురించి ముందే తెలుసుకోవాలి. లేకుంటే పరీక్ష రోజు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్‌లు కీలకం వీలైనన్ని ఎక్కువ ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల ఆన్లైన్ పరీక్షపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్, ఎస్సే... ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలు ఎలా రాయాలో తెలుస్తుంది. తరచూ ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవచ్చు. ప్రాక్టీస్ చేసేటప్పుడు సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సెక్షన్ల వారీగా సమయాన్ని నిర్దేశించుకుని, ప్రాక్టీస్ చేయాలి. వేగం, కచ్చితత్వం అవసరం ప్రాక్టీస్ సమయంలోనే ప్రశ్నను వేగంగా చదివి అర్థం చేసుకుని తక్కువ సమయంలో కచ్చితమైన సమాధానం గుర్తించేలా సాధన చేయాలి. లేకపోతే ప్రశ్న పెద్దగా, క్లిష్టంగా ఉన్నప్పుడు సమయం వృథా అవ డమే కాక చివర్లో సమయం సరిపోక ఇబ్బంది పడేలా చేస్తుంది. మ్యాథమెటిక్స్, డేటా అనాలసిస్ వంటి సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో.. వీలైనంతలో పెన్-పేపర్ అవసరం లేకుండా ప్రాక్టీస్ చేయాలి. మార్గదర్శకాలు చదవాలి పరీక్ష ప్రారంభానికి ముందు తప్పనిసరిగా గైడ్‌లైన్స్ చదవాలి. దీని వల్ల సమయం ఆదా చేయడం, పరీక్ష విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. పరీక్ష రాసేటప్పుడు టైం కీలక పాత్ర పోషిస్తుంది. తెలివిగా ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. పేజీ పైభాగంలో కనిపించే కౌంట్‌డౌన్ డిస్ప్లే గమనిస్తూ పరీక్ష రాయాలి. దీని వల్ల ఏ సెక్షన్‌కు ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు * పరీక్ష సమయానికి ముందే పరీక్షహాలుకు చేరుకుని నెట్ కనెక్షన్, కంప్యూటర్ను చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే యాజమాన్యానికి తెలియజేయాలి. వైర్లెస్ ఇంటర్నెట్ కంటే కేబుల్ నెట్ కనెక్షన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. * పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి నావిగేషన్ బటన్లను (బ్యాక్, హోం, ఫార్వోడ్, రీఫ్రెష్, రీలోడ్) ఉపయోగించకూడదు. * పేజీ పూర్తిగా లోడ్ అయ్యే వరకు వేచి ఉండాలి. పేజీ పూర్తిగా లోడ్ కాకుండానే పరీక్ష రాయడం ప్రారంభిస్తే కొన్ని ప్రశ్నలు మిస్ అయ్యే అవకాశం ఉంది. * ప్రతి ప్రశ్నకు సమాధానం క్లిక్ చేశాక సేవ్ చేయడం మరచిపోవద్దు. * పరీక్ష రాయడం పూర్తయితే, అన్ని ప్రశ్నలను ఒకసారి చెక్ చేసుకొని, అప్పుడు సబ్మిట్ బటన్ నొక్కాలి. * సబ్మిట్ చే సేటప్పుడు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా కొంచెం ముందుగానే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక కన్ఫర్మేషన్ పాస్వర్డ్ వచ్చే వరకు వేచి ఉండాలి. కన్ఫర్మేషన్ పాస్వర్డ్ రాకపోతే సబ్మిట్ కాలేదని అర్థం. వెంటనే ఇన్విజిలేటర్‌కి తెలియజేసి, సరిగా సబ్మిట్ అయ్యేలా చూసుకోవాలి.