breaking news
M. Srinivas
-
కార్మికుల జీవితాలతో చెలగాటమాడొద్దు
- జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం హైదరాబాద్: సింగరేణి కార్మికుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడవద్దని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం హెచ్చరించారు. ఆదివారం ఓయూ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ ఆడిటోరియంలో ఐఎఫ్టీయూ అనుబంధ సంఘం సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఎస్సీసీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్ అధ్యక్షత వహించగా ప్రొ.కోదండరాం ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు వ్యవస్థతో కార్మికులు తమ హక్కులను నష్టపోతున్నారన్నారు. సింగరేణి కాలరీస్ దివాళాకు గత ప్రభుత్వాలే కారణమని, ఇకనైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకుడు ఎం.శ్రీనివాస్, ఎండీ రాసొద్దీన్, కొండపర్తి శంకర్‌లతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆమె ఎక్కడ?
విద్యాబాలన్ తప్పిపోయింది... అయ్యో పాపం అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం. ఇక్కడ చెబుతున్నది కథానాయిక విద్యాబాలన్ గురించి కాదు. ప్రిన్స్, జ్యోతీసేథ్ జంటగా శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎం శ్రీనివాస్ కుమార్ రెడ్డి, ఎల్, వేణుగోపాల్‌రెడ్డి, పి.లక్ష్మీ నరసింహారెడ్డి, ఆలూరి చిరంజీవి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. శ్రీనివాస్ దర్శకుడు. ఇందులో విద్యాబాలన్ అనే అమ్మాయి కోసం ఇతర పాత్రలు అన్వేషిస్తారు. అదన్నమాట అసలు సంగతి. కమ్రాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత కె.ఎల్ దామోదర ప్రసాద్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న ‘అల్లరి’ న రేశ్ మాట్లాడుతూ- ‘‘ఇదొక రొమాంటిక్, కామెడీ మూవీ. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని అన్నారు. ‘‘అందరినీ కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది. చాలా ఎంటర్టైనింగ్గా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని ప్రిన్స్ చెప్పారు. చిత్రం ఘనవిజయం సాధించాలని హీరో నిఖిల్ ఆకాంక్షించారు. లక్ష్మీ నరసింహారెడ్డి, కమ్రాన్, జ్యోతీసేథ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.