breaking news
luxeries
-
వెయిటర్ నుంచి.. 8 వేల కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ సీఈఓగా!!
ఎక్కడో పుట్టి మరో దేశంలో వెయిటర్ స్థాయి నుంచి సముద్ర టూరిజాన్నే శాసించే స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. పైగా ఆ దేశ సంస్కృతిని మెచ్చి వారిలా జీవించడం మరింత విశేషం. అయినప్పటికీ తను ఎక్కడ నుంచి వచ్చాను అన్న మూలాన్ని మర్చిపోకుండా ఆదర్శంగా జీవిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు ఈ వ్యక్తి. అతడే ప్రముఖ లగ్జరీ క్రూయిజ్ అధినేత జుర్గెన్ బైలోమ్(Jurgen Bailom). కంటెంట్ క్రియేటర్ నవన్ జైస్వాల్ అతడితో జరిపిన సంభాషణలో తన ప్రస్థానం గురించి వివరించాడు. అందకు సంబంధించిన విషయం నెట్టింట షేర్ చేయడంతో బైలోమ్ కథ వైరల్‌గా మారింది. ఆ సంభాషణలో బైలోమ్ భారతదేశంలో తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నారు. జుర్గెన్ బైలోమ్ తాను ఒక ఓడలో వెయిటర్‌గా జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. శక్తిమంతంగా పనిచేస్తూ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అయినా ఈ రేంజ్‌కి ఎలా చేరుకోగలిగారు అని జైస్వాల్ ప్రశ్నించగా..చేయగలనన్న దృక్పథంతో చకచక నేర్చుకోవడం, మార్కెట్‌ని, ప్రజలను, సంస్కృతిని అర్థం చేసుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. అలాగే ఆర్థికంగా విజయం సాధించడం గురించి కూడా మాట్లాడారు. "అవసరం లేకపోతే ఖర్చు చేయవద్దు." అనే విషయాన్ని బలంగా నమ్ముతానని చెప్పారు. అప్పుడు డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, అలాగే ఏం చేయాలనే దానిపై అవగాహన ఉంటే.. డబ్బే మీ వెంట పడుతుంది." అని బైలోమ్ నొక్కి చెబుతున్నారు. ఆస్ట్రియాలో జన్మించిన ఆయన హాస్పిటాలిటీ పరిశ్రమలోకి ఒక వెయిటర్‌గా భారత్‌లో అడుగుపెట్టానంటూ తన 40 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. అలా కార్డెలియో అనే ప్రముఖ లగ్జరీ క్రూయిజ్ సంస్థని పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ కంపెనీకి ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా. ఇది భారత సముద్ర పర్యాటక రంగంలో తన ఆధిపత్యాన్ని స్థాపించుకుందని చెప్పారు. తన బ్రాండ్ భారత క్రూయిజ్ వ్యాపారంలో 99% మార్కెట్ వాటాను కలిగి ఉందని తెలిపారు. అలాగే తన వ్యాపారం రూ. 8 వేలు కోట్లు టర్నోవర్ ఆర్జిస్తుందని చెప్పారు.ప్రస్తుతం తాను ఒకే నౌకను నడుపుతున్నప్పటికీ..ఇది ఏడాదికి సుమారు 600 నుంచి 700 కోట్ల టర్నోవర్ చేస్తుందని అన్నారు. తాను భారతదేశానికి చెందనప్పటికీ..ఇక్కడ ప్రపంచ స్థాయి క్రూయిజ్ లైన్ నిర్మించగలిగే విస్తారమైన తీరప్రాంతాన్ని గుర్తించానని అన్నారు. ఇక్కడ క్రూయిజ్ వ్యాపారం చేయడం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదంటున్నారాయన. ఇది ప్రపంచంలోని మూడో అతిపెద్ద తీరం అని అన్నారు. తాను 2018లో భారత్‌కి వచ్చినట్లు తెలిపారు. అలాగే ఇక్కడ సంస్కృతి నచ్చిందన్నారు. ముంబైలో ప్రతి ఒక్కరు కష్టపడతారని, ఉపాధి కోసం నిత్యం ఏదో ఒక పనిచేస్తుంటారని కొనియాడారు. భారతీయుల సంప్రదాయాలు, సెంటిమెంట్లపై అవగాహన ఉందని, తను కూడా వాటిని అనుసరిస్తానని చెప్పారు. తన ఆఫీసులో కూడా క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తామని, ఫర్నీచర్ వంటి తదితరాలు వాస్తుపరంగా ఉండాల్సిన దిశలో ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఆర్థికంగా బాగానే ఉన్నామా అని పర్యవేక్షిస్తుంటానని, ఒకవేళ ఆధ్యాత్మిక పరంగా ఏవైన మార్పులు, చేర్పులు ఉంటే చేస్తానని కూడా చెప్పారు బైలోమ్. View this post on Instagram A post shared by Navan Jaiswal (@navan.jaiswal) (చదవండి: ప్రిన్సిపాల్ ఉద్యోగాన్ని వదిలి మరి మిల్లెట్ వ్యాపారం! ఇవాళ ఏకంగా..) -
విలాస సౌకర్యాలు జ్ఞానాన్ని పెంచలేవు: ఎ.పి.జె. అబ్దుల్ కలాం
సాక్షి, హైదరాబాద్: పెద్దపెద్ద భవనాలు, విలాసవంతమైన సౌకర్యాలు జ్ఞానాన్ని పెంచలేవని, ప్రేమతో కూడిన విద్య, గొప్ప అధ్యాపకులు మాత్రమే విద్యార్థులను నాణ్యమైన పౌరులుగా తీర్చిదిద్దగలరని భారత మాజీ రాష్ట్రపతి, విఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం అన్నారు. మంగళవారం గౌలిదొడ్డిలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. రామేశ్వరం పంచాయతీ పాఠశాలలో తాను చదువుకునే కాలంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఉపాధ్యాయులు తమలో జ్ఞానాన్ని నింపగలిగారని కలాం తెలిపారు. ఫలానా సబ్జెక్టును చదువుతానని విద్యార్థి అడిగితే తల్లిదండ్రులు తప్పకుండా ప్రోత్సహించాలని సూచించారు. జీవితంలో చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నేరమని, పెద్ద లక్ష్యం, నిరంతర జ్ఞాన సముపార్జన, కఠోరశ్రమ, సవాళ్లను అధిగమించడం అనే నాలుగు సూత్రాలు విజయసోపానాలని ఉద్బోధించారు. తెలుగులో ‘బాగున్నారా?’ అంటూ పలకరించి విద్యార్థులను అలరించారు. పలు పద్యాలను, విద్యార్థులు అనుసరించాల్సిన పద్ధతులను వారి చేతే చెప్పించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్. ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి సి. సిద్ధార్థన్‌రెడ్డి, గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి, ఎస్సీ గురుకులాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


