breaking news
Lt Governor Kiran Bedi
-
రాత్రివేళ స్కూటీపై మహిళా గవర్నర్!
పుదుచ్చేరి: రాత్రి సమయంలో మహిళలకు ఏ విధమైన రక్షణ ఉందో పరిశీలించటానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఓ సాహసం చేశారు. శుక్రవారం రాత్రి సహాయకురాలితో కలిసి ఆమె స్కూటీపై కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తిరిగారు. తననెవరూ గుర్తుపట్టకుండా బేడీ శాలువా కప్పుకున్నారు. ‘పుదుచ్చేరిలో రాత్రిపూట మహిళలు సురక్షితమే..అయినప్పటికీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం’ అని బేడీ ట్వీటర్లో తెలిపారు. ప్రజలకు సమస్యలేమైనా ఉంటే పీసీఆర్ లేదా 100కు ఫోన్ చేయాలని సూచించారు. కిరణ్‌బేడీ చర్యను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. అయితే స్కూటీని నడుపుతున్న మహిళతో పాటు బేడీ కూడా హెల్మెట్ ధరించకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో రాత్రిపూట తాము నిస్సహాయంగా కనిపించడంతో పాటు ఆ సమయంలో స్కూటీ నడిపే సగటు మహిళ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికే హెల్మెట్ ధరించలేదని బేడీ వివరణ ఇచ్చారు. -
కోస్టల్ క్లీనప్ డ్రైవ్ ప్రారంభించిన కిరణ్ బేడీ
పుదుచ్చేరిః లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పుదుచ్చేరీలో కోస్టల్ క్లీనప్ డ్రైవ్ ను ప్రారంభించారు. కోస్ట్ గార్డులు, వాలంటీర్లు నిర్వహించిన కార్యక్రమంలో కిరణ్ బేడీ ప్రముఖ అతిథిగా పాల్గొన్నారు. ప్రకృతిని గౌరవించి, బీచ్ లను చెత్తా చెదారంతో నింపడం మానాలని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31వ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా బీచ్ లలోని చెత్తను తొలగించే కార్యక్రమాన్ని కోస్ట్ గార్డు సిబ్బంది చేపట్టారు. కార్యక్రమానికి ముందు బేడీ సహా స్థానిక పరిపాలనా మంత్రి ఎ నమశ్శివాయం.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో సభ్యులైన ఎన్సీసీ, ఎన్ ఎస్ ఎస్, ఎన్జీవో సభ్యులతో గార్బేజ్ ఫ్రీ బీచెస్ కోసం ప్రతిజ్ఞ చేయించారు. క్లీనప్ డ్రైవ్ లో భాగంగా వాలంటీర్లతో కలసి కిరణ్ బేడీ, మంత్రి నమశ్శివాయం, పలువురు అధికారులు సైతం బీచ్ లలో చెత్తను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. అంతర్జాతీయ డ్రైవ్ లో భాగంగా బీచ్ లను శుభ్రపరిచే కార్యక్రమాన్ని పుదుచ్చేరిలోని అన్ని తీర ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నట్లు కమాండర్ ఎస్ సి త్యాగి తెలిపారు. స్థానిక పరిపాలనా విభాగంతో కలసి ఇండియన్ కోస్ట్ గార్డు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.