జిల్లాలో 11.9 మి.మీ సగటు వర్షపాతం
ఏలూరు (ఆర్ఆర్ పేట): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 11.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యిందని జిల్లా ఇన్చార్జి ముఖ్య ప్రణాళికాధికారి టి.సురేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. గడిచిన 24 గంటల్లో మొత్తంగా 571.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఏలూరు మండలంలో 69.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తాడేపల్లిగూడెం మండలంలో 0.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాలకోడేరు మండలంలో 56.2, పోలవరం 49.2, వీరవాసరం 37.4, పెదపాడు 35.2, లింగపాలెం 30.6, మొగల్తూరు 30.2, పాలకొల్లు 30, భీమవరం 29.4, వేలేరుపాడు 27, అత్తిల 22, టీ.నర్సాపురం 19.4, పెనుమంట్ర 18.8, దెందులూరు 18.2, చింతలపూడి, ఇరగవరం 12.4, నరసాపురం 9.4, ఉండి 9.2, బుట్టాయగూడెం 7, కుకునూరు 6.2, నిడమర్రు 4.8, కాళ్ల 4.6, పెనుగొండ 3.8, కామవరపుకోట 3.6, ఆచంట 3.4, పెదవేగి 3.2, తణుకు, ఆకివీడు 2.6, తాళ్లపూడి 2.4, పోడూరు 2, జీలుగుమిల్లి, ఉండ్రాజవరం 1.8, జంగారెడ్డిగూడెం, యలమంచిలి, ద్వారకాతిరుమల 1.2, గోపాలపురం 1, నిడదవోలు మండలాల్లో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.