breaking news
Loving confrontation
-
ప్రేమించడం కారణంగానే చనిపోతున్నారు: చీఫ్ జస్టీస్ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో ప్రేమించడం వల్లే ప్రతి ఏడాది వందలాది మంది యువకులు మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలోని బార్ అసోసియేషన్ నిర్వహించిన అశోక్ దేశాయ్ స్మారక ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ఉపన్యాసంలో న్యాయమూర్తి చంద్రచూడ్ చట్టం, నైతికత అనే అంశాలపై ప్రసంగించారు. లీగల్ న్యూస్ వెబ్సైట్ బార్ అండ్ బెంచ్ ప్రకారం..నెతికతో ముడిపడిన బ్రెస్ట్ ట్యాక్స్, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్, మంబైలో బార్ డ్యాన్స్‌పై నిషేధం, వ్యభిచారం తదితర కేసులు గురించి ప్రస్తావిస్తూ...ఆదిపత్య సముహాలు బలహీన వర్గాలను అధిగమించే ప్రవర్తన నియమావళే నైతికతను నిర్ణయిస్తుందన్నారు. బలహీనమైన అట్టడుగు వర్గాల సభ్యులకు తమ మనుగడ కోసం ఆధిపత్య సంస్కృతికి లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. అదీగాక అణిచేత వేత వర్గాల చేతిలో అవమానింపబడే వేర్పాటువాదం కారణంగా సమాజంలో బలహీన వర్గాల వారు ప్రతివాద సంస్కృతిని సృష్టించలేకపోతున్నారని అన్నారు. ఒక వేళ బలహీన వర్గాలు అభివృద్ది చెందుతుంటే.. వారిని అణిచివేసేలా కొన్ని ప్రభుత్వ సముహాలు తమ అధికారాన్ని వినయోగిస్తున్నాయని చెప్పారు. వాస్తవానికి బలహీన వర్గాలు పురోగతిని సాధిస్తున్నప్పటికి వారిని సామాజిక నిర్మాణంలో దిగువన ఉంచడంతో వివక్షతను ఎదుర్కొంటూనే ఉంటున్నారని చెప్పారు. అలాగే ఒకరికి న్యాయం అనిపించింది మరోకరికి న్యాయంగా ఉండాల్సిన అవసరం ఉందా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. 1991లో ఉత్తప్రదేశ్‌లో 15 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఎలా చంపారనే కథనం గురించి విరించారు. వాస్తవానికి వారు నివశిస్తున్న సమాజంలో ప్రవర్తన నియమావళిని అనుసరించి ఇది అక్కడ సమంజసం కావచ్చు. వాస్తవానికి చట్టం ప్రకారం ఇది హేతబద్ధమైన చర్య, ఘోరమైన నేరం కూడా. కొన్ని నెలల వాదనల అనంతరం అక్కడి గ్రామస్తులు ఈ నేరాన్ని అంగీకరించారని కూడా చెప్పారు. ప్రస్తుతం యువత తమ కులానికి వ్యతిరేకంగా ప్రేమించడం లేదా పెళ్లి చేసుకోవడం కారణంగా పరువు హత్యలకు దారితీసి చంపబడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రసంగంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించని సుప్రీం కోర్టు తీర్పును కూడా ప్రస్తావిస్తూ...న్యాయాన్ని సరిదిద్దాం. రాజ్యంగ నైతికత వ్యక్తుల హక్కులపై దృష్టి పెడుతూ...సమాజంలో నైతికతను కాపడుతుందని చెప్పారు. భారత రాజ్యంగం ప్రజల కోసం రూపొందించబడింది కాదని, ఫ్రాథమిక హక్కలు ప్రకారం వారు ఎలా ఉండాలో చెబుతోంది. ఇదే మన రోజువారీ జీవితాన్ని మార్గ నిర్దేశిస్తుందని చెప్పారు. (చదవండి: ఈవెంట్‌కి వెళ్లకుండా అడ్డుకుందని..సుత్తితో కొట్టి..పది ముక్కలుగా కోసేశాడు) -
ప్రేమ.. పెళ్లి... ఘర్షణ
► మరదలిని బెదిరించి పెళ్లాడిన బావ ► వేరొకరిని ప్రేమించిన మరదలు ► విషయం తెలియడంతో బావతో ప్రేమికుడి ఘర్షణ అలంపూర్ : కర్నూలు జిల్లాకు చెందిన ప్రేమికుల పంచాయతీ అలంపూర్‌కు చేరింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా నందికోట్కూరు నియోజకవర్గం మిడ్తూరుకు చెందిన రమేష్, అదే గ్రామానికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం మేనత్త కొడుకు ఉదయ్‌కుమార్‌తో వివాహం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదోనికి చెందిన ఉదయ్ రెండురోజుల క్రితం మిడ్తూరు చేరుకున్నాడు. అలంపూర్‌లోని గుడికి వెళ్తామని ఇంట్లో చెప్పి గురువారం ఉదయం మరదలితో కలిసి బయల్దేరారు. అలంపూర్‌కు చేరుకున్న తర్వాత ఉదయ్‌కుమార్, తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి బలవంతంగా మరదలికి తాళికట్టాడు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయణమయ్యారు. తనకు ఇష్టంలేకుండా ఎందుకు తాళికట్టావంటూ అమ్మాయి నిలదీసింది. దీంతో ఉదయ్ మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే మందును తాగే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో తన ప్రేమికురాలు బావతో కలిసి వెళ్లిందనే సమాచారం తెలియడంతో రమేష్, ఉదయ్ సెల్‌కు ఫోన్‌చేసి మాట్లాడుతుండగా అమ్మాయి ఫోన్ లాక్కుని జరిగిన విషయం రమేష్‌కు చెప్పింది. త్వరగా రావాలని కోరింది. దీంతో రమేష్ వెంటనే అలంపూర్ చౌరస్తాకు వచ్చాడు. అక్కడే ఉదయ్, తన ప్రియురాలు కనిపించారు. నేను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని రమేష్ అతనితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ పెద్దదికావడంతో స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని ఔట్‌పోస్టుకు తరలించి విచారించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అలంపూర్ చౌరస్తాకు చేరుకుని పోలీసులతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబందించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మానవపాడు ఎస్ఐ భగవంతరెడ్డి తెలిపారు.