breaking news
Loud explosion
-
ఢిల్లీలో భారీ పేలుడు.. పోలీసులు అలర్ట్
సాక్షి, ఢిల్లీ: రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాలలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి పాఠశాల గోడతో పాటు, పలు షాపుల అద్దాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.ఫోరెన్సిక్ బృందాలు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పేలుడుకు కారణాలను అన్వేషిస్తున్నారు. స్థానికుడు రికార్డ్ చేసిన వీడియోలో పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో నుంచి పొగలు కమ్ముకోవడం కనిపించింది.తాను ఇంట్లోనే ఉన్నానని.. పెద్ద శబ్దం, పొగలు కమ్ముకోవడంతో వీడియో రికార్డ్ చేశానని.. అంతకుమించి ఏమీ తెలియని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ పేలుడు ఉదయం 7.47 గంటలకు జరిగింది. పేలుడు కారణాలపై దర్యాప్తు చేసేందుకు నిపుణులను పిలిపించామని సీనియర్ పోలీసు అధికారి అమిత్ గోయల్ తెలిపారు.ఈ ఘటనలో ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని.. విచారణలో భాగంగా భూగర్భ మురుగునీటి లైన్ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పేలుడు తర్వాత భరించలేని దుర్గంధం వ్యాపించింది. డ్రైనేజీ పైపు పేలి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తుండగా, క్రూడ్ బాంబు కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: వయనాడ్ ఎవరది?.. డైనమిక్ లీడర్ నవ్య Vs ప్రియాంక -
పఠాన్కోట్ లో మళ్ళీ పేలుడు కలకలం
పంజాబ్: పఠాన్కోట్ భారత వైమానిక స్థావరం బయట మంగళవారం మరోసారి భారీ పేలుడు శబ్దం వినిపించింది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూండగానే మళ్లీ పెద్ద ఎత్తున పేలుడు వినిపించడం కలకలం రేపింది. దీంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగివున్నారనే దానిపై మరింత ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు అసలు భారత సైనిక దుస్తుల్లో పఠాన్-కోట్ ఎయిర్-బేస్ వరకు ఎలా రాగలిగారు? లోపలి మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది? లోపల ఉన్నవారే ఎవరైనా ఉగ్రవాదులకు ఉప్పందించారా లాంటి అంశాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ ఎత్తున పేలుడు శబ్దం రావడంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగి వున్నరానే దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. గత మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.