లారీ-కారు ఢీ.. మహిళ మృతి
భూత్పూర్(మహబూబ్నగర్): వేగంగా వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ మహిళ మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.
44వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.